మనకు ఇలాంటి 'షవర్ బస్సు' కావాలేమో..?
'షవర్ బస్సు', దీని పేరు వినగానే మీకు మ్యాటర్ ఏంటో అర్థమైపోయింటుంది. అవును, ఇది షవర్ బస్. దీనిని కేవలం స్నానానికి మాత్రమే ఉపయోగిస్తారు. శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన 'లావామాయ్' (LavaMae) అనే స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్న డోనీస్ శాండోవల్ మరియు ఆమె భర్త పేదవాళ్లు, ఇళ్లు లేని వాళ్ల కోసం పాడైపోయిన పాత బస్సులను ఇలా షవర్ బస్సులుగా మారుస్తున్నారు.
షవర్ బస్సుల ద్వారా వీరిద్దరూ పేదరికాన్ని రూపుమాపలేకపోయినప్పటికీ, ఇళ్లు లేకుండా వీధులపై తిరుగుతూ మురికిగా ఉండే వారికి వీటి ద్వారా మంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలనేది వారి ప్రధాన లక్ష్యం. వీరి మొదటి ప్రాజెక్టులో భాగంగా 1992లో నిర్మించి, శిథిలావస్థలో ఉన్న గిల్లిగ్ ఫాంటమ్ బస్సును ఇలా షవర్ బస్సుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ బస్సులు బహుళ ప్రయోజనాలను అందిస్తాయి. ఇందులో రెండు షవర్ ఏరియాలు, ఓ టాయిలెట్, సింక్ మరియు తాత్కాలికంగా వారి వస్తువులను ఉంచుకునేందుకు కొంత స్థలం ఉంటాయి. ఈ బస్సును ఎక్కడైనా పార్క్ చేసుకొని, వాటర్ హైడ్రాంట్స్ ద్వారా నీటిని ఉపయోగించుకోవచ్చు.

బాగుంది కదూ పేదల కోసం వీరు చేస్తున్న సేవ.. మనదేశంలో కూడా ఇలాంటి సిస్టమ్ అందుబాటులోకి వస్తే, మురికి వాతావరణం కాస్తా పూర్తి హైజీన్ వాతావరణంగా మారే అవకాశం ఉంటుందేమో..! మీరేమంటారు..? సరే అదంతా అటుంచి ఈ షవర్ బస్ కాన్సెప్ట్ గురించి దాని సృష్టికర్తలు ఏం చెబుతున్నారో ఈ వీడియోలో చూడండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/up9TfkcJNxk?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








