రూ.1.17కోట్లు.. ఇది దేశంలోనే అత్యంత కాస్ట్లీ నంబర్ ప్లేట్..మరి దానిపై కట్టే టాక్స్ ఎంతో తెలుసా?

కారు కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాదు ఇప్పుడు స్టేటస్ సింబల్‌గా మారింది. కొత్త మోడల్స్ ఎంత ముఖ్యమో, వీఐపీ నంబర్ ప్లేట్‌కు కూడా అంత క్రేజ్ పెరుగుతోంది. ఈ క్రేజ్ ఎంతలా ఉందంటే ఇటీవల హర్యానాలో జరిగిన ఆన్‌లైన్ వేలంలో ఒక వీఐపీ నంబర్ రికార్డు సృష్టించింది. HR88B8888 అనే నంబర్ ఏకంగా రూ.1.17 కోట్లకు అమ్ముడై, దేశంలోనే అత్యంత ఖరీదైన రిజిస్ట్రేషన్ నంబర్‌గా నిలిచింది. అయితే, ఇంత ఖరీదైన నంబర్‌ను కొన్న వ్యక్తి.. ఆ నంబర్‌పై ఎంత టాక్స్ కట్టాలి? అసలు ఈ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్లపై టాక్స్ రూల్స్ ఏంటో తెలుసుకుందాం.

హర్యానాలో జరిగిన ఆన్‌లైన్ వేలంలో ఒక వీఐపీ కారు నంబర్ ప్లేట్ సరికొత్త చరిత్ర సృష్టించి, రికార్డు నెలకొల్పింది. HR88B8888 అనే ఈ నంబర్ ఏకంగా రూ.1.17 కోట్లకు అమ్ముడైంది. కేవలం రూ.50,000 బేస్ ప్రైస్‌తో మొదలైన ఈ బిడ్డింగ్‌లో సాయంత్రం 5 గంటలకల్లా ధర రూ.1.17 కోట్లకు చేరుకుంది.

Indias Costliest Number Plate HR88B8888 Sells for Rs 1 17 Crore How Much GST Will the Buyer Pay

ఈ నంబర్ ప్లేట్‌కు ఇంత క్రేజ్ రావడానికి ముఖ్య కారణం దీనిలోని B అనే అక్షరం 8 అంకెలా కనిపించడం వలన, ఇది వరుసగా ఎనిమిది అంకెలు ఉన్నట్లు అనిపిస్తుంది. సంస్కృతుల్లో 8 అంకె అదృష్టాన్ని, సంపదను సూచిస్తుంది కాబట్టి, దీన్ని దక్కించుకోవడానికి తీవ్ర పోటీ ఏర్పడింది. దీనికి ముందు వారం HR22W2222 నంబర్ రూ.37.91 లక్షలకే అమ్ముడైంది. కానీ ఈసారి వచ్చిన రూ.1.17 కోట్ల రికార్డు ఆ మొత్తాన్ని దాటేసింది.

ప్రస్తుతం దేశంలో ఫ్యాన్సీ నంబర్ ప్లేట్లపై టాక్స్ విధానం రాష్ట్రాల వారీగా మారుతోంది. కొన్ని రాష్ట్రాలు కేవలం రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకుంటుంటే, మరికొన్ని 18% GST వసూలు చేస్తున్నాయి. అయితే, ఈ వేలం మొత్తాన్ని లగ్జరీ ఐటమ్ గా పరిగణించి, దీనిపై నేరుగా 28% GST విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Indias Costliest Number Plate HR88B8888 Sells for Rs 1 17 Crore How Much GST Will the Buyer Pay

ఒకవేళ ఈ 28% GST ప్రతిపాదన అమల్లోకి వస్తే, రూ.1.17 కోట్ల నంబర్ ప్లేట్‌పై కొనుగోలుదారుడు సుమారు 32.76 లక్షల రూపాయల GST చెల్లించాల్సి వస్తుంది. అంటే, నంబర్ ప్లేట్ ధరతో పాటు, కేవలం టాక్స్ రూపంలోనే రూ.30 లక్షలకు పైగా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా కోట్లు పలికే వీఐపీ నంబర్ ప్లేట్, ఈ కొత్త టాక్స్ వల్ల మరింత ఖరీదైన లగ్జరీ వస్తువుగా మారుతుంది.

ఫ్యాన్సీ నంబర్ల పట్ల ఈ క్రేజ్ ఎంతలా ఉందంటే చండీగఢ్‌లో దీనికి సంబంధించిన కొన్ని విచిత్రమైన ఉదాహరణలు ఉన్నాయి. ఏప్రిల్ 2022లో ఒక కస్టమర్ రూ.55,585 విలువైన టూ-వీలర్‌కు రిజిస్ట్రేషన్ నంబర్ కోసం ఏకంగా రూ. 15.44 లక్షలు చెల్లించారు. అంటే, నంబర్ ప్లేట్ ధర స్కూటర్ ధర కంటే దాదాపు 28 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.

Indias Costliest Number Plate HR88B8888 Sells for Rs 1 17 Crore How Much GST Will the Buyer Pay

అలాగే, రూ. 9.56 లక్షల నుంచి రూ. 13.22 లక్షల విలువ చేసే సెడాన్ కార్ల యజమానులు కూడా తమ కార్ల కోసం రూ. 12.21 లక్షల నుంచి రూ. 24.40 లక్షల వరకు వెచ్చించి నంబర్ ప్లేట్లు కొనుగోలు చేశారు.

ప్రస్తుతం టాక్స్ విధానంలో ఉన్న తేడాలను తొలగించడానికి, ఫ్యాన్సీ నంబర్‌లను అధికారికంగా 28% GST పరిధిలోకి తీసుకురావాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు తయారుచేయమని కోరింది. అలాగే, ప్రభుత్వం ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేసింది..అనుమతి లేకుండా లేదా వేలంలో పాల్గొనకుండా ఫ్యాన్సీ నంబర్ ప్లేట్‌ను ఉపయోగిస్తే, మోటార్ వెహికల్ చట్టం ప్రకారం భారీ జరిమానా విధించబడుతుంది.

వీఐపీ నంబర్ల వేలం కోసం ప్రతీ శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో బిడ్డింగ్ కొనసాగుతుంది.. ఆ తర్వాత ఫలితాలు ప్రకటిస్తారు.

More from DriveSpark

Article Published On: Thursday, November 27, 2025, 15:40 [IST]
English summary
Indias costliest number plate hr88b8888 sells for rs 1 17 crore how much gst will the buyer pay
Read more on: #number plate #tax #offbeat
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+