దేశంలోనే తొలిసారిగా లోకోపైలట్ లేకుండా నడిచే మెట్రో రైల్.. ఎక్కడో తెలుసా?
దేశంలో తొలిసారిగా లోకోపైలట్ లేకుండా నడిచే మెట్రో రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. మొట్టమొదటగా ఈ సర్వీస్ తమిళనాడు రాజధాని చెన్నై(Driverless Metro Train In Chennai)లో మొదలు కానుంది. ఈ మేరకు ఆగష్టులో చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (CMRL) తన మొదటి డ్రైవర్‌లెస్ రైలును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.
డ్రైవర్‌లెస్ మెట్రో రైళ్ల ప్రాజెక్ట్‌లో భాగంగా రాబోయే నెలల్లో అదనపు రైలు సెట్లు వస్తాయని చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ అధికారులు చెబుతున్నారు. 28 మెట్రో స్టేషన్ల ద్వారా అనుసంధానించబడిన 26 కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా.. మూడు కార్ల రైళ్లను ప్రతిపాదించారు. ఆగస్ట్‌లో ఒక రైలు సెట్ వస్తుందని, ఆ తర్వాత మరో రెండు నెలల్లో మరో 6 రైలు సెట్లు వస్తాయని అధికారులు వెల్లడించారు.

డ్రైవర్‌లెస్ మెట్రో మొదటి రైలు రాకముందే, జూలై నాటికి కారిడార్‌లోని ఎలివేటెడ్ లైన్‌లో బ్యాలస్ట్‌లెస్ ట్రాక్‌ల పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సీఎంఆర్‌ఎల్ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ నివేదికను వెల్లడించింది. 2025లో కారిడార్-4లో ఎలివేటెడ్ స్ట్రెచ్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది. పవర్‌హౌస్ కనెక్టివిటీని కోడంబక్కం నుంచి పూనమల్లి బైపాస్ వరకు ఏర్పాటు చేయాలని నివేదికలో పేర్కొంది.
ప్రస్తుతం పూనమల్లి డిపో నిర్మాణ పనుల్లో ఉండగా.. వచ్చే ఏడాది రైళ్ల కార్యకలాపాలు ప్రారంభమైనప్పుడు కారిడార్ 4లో నడిచే అన్ని రైళ్లను నిర్వహిస్తుంది. రెండో దశలో భాగంగా మొత్తం 138 మూడు కార్ల ట్రైన్‌సెట్‌లను కొనుగోలు చేయాలని చెన్నై మెట్రో యోచిస్తోంది. 116.1 కిలోమీటర్ల విస్తీర్ణంలో, ఇది 2025 నుండి 2028 వరకు దశలవారీగా కార్యకలాపాలు ప్రారంభిస్తాయి.

కాగా ఫేజ్ 1లో, మొదటి సెట్ రైళ్లు బ్రెజిల్ నుంచి దిగుమతి అయ్యాయి. లైన్లు సిద్ధమయ్యే వరకు వాటిని కోయంబేడు డిపోలో భద్రపరిచారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో, డ్రైవర్‌లెస్ రైళ్ల ఫస్ట్‌లుక్‌ను చెన్నై మెట్రో రైల్ అధికారులు విడుదల చేశారు. ఇందులో అధునాతన ఫీచర్లను పొందుపరిచారు.
డ్రైవర్‌లెస్ మెట్రో రైళ్ల(Driverless Metro Train Facilities) లోపల ప్రయాణీకుల కోసం పెర్చ్ సీట్లు, రైలు లోపల మరియు బయట CCTV కెమెరాలు, మొబైల్ ఫోన్‌లు మరియు ల్యాప్‌టాప్‌ల కోసం ఛార్జింగ్ సాకెట్లను అమర్చారు. ఇక మహిళల కోసం ప్రత్యేకంగా తక్కువ ఎత్తులో వివిధ రంగుల్లో హ్యాండిల్స్, ప్రత్యేక సీట్లను అందిస్తున్నారు.
ఈ మెట్రో రైళ్ల లోపల దివ్యాంగుల కోసం కూడా చెన్నై మెట్రో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. లాంగ్ వెయిట్ ప్రెస్ బటన్ మరియు రియల్ టైం రూట్ మ్యాప్‌లను అందిస్తున్నారు. ప్రయాణికులకు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం LCD స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. కాగా రైలు సెట్లలోని మూడు కార్లలో ప్రతి దాంట్లో సుమారు 1,000 మంది ప్రయాణించవచ్చు.
లోకోపైలట్ లేకుండా నడిచే మెట్రో రైలును గంటకు 90 కి.మీ వేగంతో ప్రయాణించేలా డిజైన్ చేశారు. కానీ భద్రతా కారణంగా దృష్ట్యా రియల్ టైంలో 80 కి.మీ వేగంతో మాత్రమే ప్రయాణిస్తుంది. మార్గ మధ్యలో వాటికి అడ్డంకులు మరియు రైలు పట్టాలు తప్పిన వాటిని గుర్తించడానికి డిటెక్టర్‌లను పొందుపరిచారు. దీంతో పాటు విద్యుత్తును ఆదా చేయడానికి రీ ప్రొడక్టివ్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








