దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్.. తొలుత ఆ నగరంలోనే!!
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు కొనసాగుతోంది. రోజు రోజుకు వీటి సంఖ్య వేగంగా పెరుగుతూ వస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో వీటి వినియోగం బాగా పెరిగింది. దేశ వ్యాప్తంగా ప్రజా రవాణా సంస్థలు కూడా వీటికే ఓటు వేస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు ప్రజా రవాణాలో భాగమయ్యాయి. ఆ కోవలోనే ఓ అధునాతన బస్ అందుబాటులోకి వచ్చింది. దాని వివరాలు ఏంటో తెలుసుకోండి మరి!!
దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు ప్రారంభం కానుంది. ఈ ఘట్టానికి ముంబయి వేదిక అవ్వనుంది. ఫుల్ ఎయిర్ కండిషన్డ్ (AC)తో కూడిన ఈ ఎలక్ట్రిక్ బస్ దేశంలోనే తొలి డబుల్ డెక్కర్ బస్ గా చరిత్ర లిఖించనుంది. BEST (బృహన్ ముంబయి ఎలక్ట్రిక్ ట్రాన్స్ పోర్ట్ అండ్ సప్లై) సహకారంతో ఆ రాష్ట్ర రవాణా సంస్థ ప్రజలకు ఈ బస్సును అందుబాటులోకి తీసుకురానుంది.

స్విఛ్ ఈఐవీ 22గా పిలువబడే ఈ బస్సులు మార్చి చివరి నాటికి పూర్తి స్థాయిలో రోడ్డెక్కనున్నాయి. అందులో భాగంగా సోమవారం 13-02-2023న వీటిని ఆ సంస్థ ఉన్నతాధికారులు ప్రారంభించారు. దాదాపు 20 డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. భవిష్యత్ లో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రజా రవాణాలో ఈ బస్సులకు మంచి ఆధరణ లభించనుంది.
ఆగస్టులో ఆరంభం కానీ రోడ్డేక్కెందుకు ఆరునెలల ఆలస్యం
గత ఏడాది ఆగస్టులో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ బస్సులను ప్రారంభించారు. అయితే ఈ బస్సులను తయారు చేస్తున్న స్విఛ్ మొబిలిటీ (అశోక్ లేలాండ్ ఎలక్ట్రిక్ అండ్ కమర్షియల్ విభాగం)నికి ఆటోమెటిక్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) నుంచి అనుమతుల కోసం ఆరు నెలలు ఆలస్యం అయ్యిందని బెస్ట్ సంస్థ వెల్లడించింది. తాజాగా ఈ బస్సులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.

"మొదటగా సబర్బన్ ప్రాంతాల్లో ఈ బస్సులను అందుబాటులోకి తెస్తున్నట్లు. మరికొన్ని రోజుల్లోనే ఐదు బస్సులు రోడ్డెక్కేందుకు సిద్ధంగా ఉన్నాయి. డీజీల్ ఇంజన్ డబుల్ డెక్కర్ బస్సుల స్థానాల్లో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువస్తాము. ఈ సంవత్సరం పూర్తయ్యేసరికి దాదాపు 200 బస్సులను సిద్ధం చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నాం." అని బెస్ట్ జనరల్ మేనేజర్ లోకేశ్ చంద్ర తెలిపారు.
అధునాతన హంగులతో సరికొత్తగా..
ఇప్పటి వరకు కేవలం డీజీల్ ఇంజన్ తో మాత్రమే నడిచిన ఈ డబుల్ డెక్కర్ బస్సులు సరికొత్త హంగులతో అధునాతన సాంకేతికతో అందుబాటులోకి రానున్నాయి. 65 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ బస్సులో నిల్చుని దాదాపు ఒకేసారి 100మంది ప్రయాణించవచ్చు. ఈ డబుల్ డెక్కర్ లో పైన ఉన్న డెక్‌లోకి వెళ్లేందుకు లోపల మెట్ల సదుపాయం కలదు. అలానే బయట రెండు డోర్స్ అమర్చారు. ఈ బస్సులో డిజిటల్ టికెటింగ్, CCTV కెమెరాలు, లైవ్ ట్రాకింగ్, డిజిటల్ డిస్‌ప్లే వంటి అధునాతన ఫీచర్లు ఈ బస్సులో పొందుపర్చారు. అత్యవసర పరిస్థితుల కోసం బటన్ నొక్కి అలెర్ట్ చేసే సదుపాయం ఉంది. గంటన్నర నుంచి మూడు గంటలలోపు ఈ బస్సును ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 250 కిలోమీటర్ల వరకు నడిచేంత పెద్ద బ్యాటరీ సామర్థ్యం ఈ బస్సుకి ఉన్న ప్రత్యేకత.

పవర్ ఫుల్ ఇంజన్..
231 kWh సామర్థ్యాన్ని కలిగి ఉన్న లిథియం-అయాన్ NMC బ్యాటరీ ప్యాక్ దీనికి అమర్చారు. ఇంజన్ లో లిక్విడ్ కూలింగ్ ఆటోమెటిక్ గా ఈ ఇంజన్ గరిష్టంగా 320 hp పవర్ అవుట్‌పుట్, 190 hp నిరంతర పవర్ అవుట్‌పుట్‌ను కలిగి ఉందని స్విఛ్ తెలిపింది. 3,100 Nm అవుట్‌పుట్ రేట్ ఈ బస్సు కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా పాతాళగంగ వద్ద ఉన్న స్విచ్ మొబిలిటీ సంస్థలో తయారు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications








