దేశంలో ఇలాంటి కారు ఎవ్వరికీ లేదు.. కుటుంబంతో కలిసి డెలివరీ తీసుకున్న వీడియో వైరల్
ప్రస్తుతం కార్ల కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయి. మిడిల్ క్లాస్ వాళ్లు బడ్జెట్ కార్లను కొనుగోలు చేస్తున్నారు. కొంతమంది సంపన్నులు మాత్రం ఎవ్వరికీ ఉండనటువంటి మోడల్స్‌ని కొనేందుక ఆసక్తి చూపిస్తారు. అలాంటి సంఘటనే ఇక్కడ ఒకటి జరిగింది. కేరళకు చెందిన ఓ వ్యాపారవేత్త సరికొత్త ల్యాండ్ రోవర్‌ని కొనుగోలు చేశాడు. అతను కొనుగోలు చేసిన కారున ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతుంది. ఎందుకంటే ఇది సరికొత్త గ్రీన్ (mamba Green)కలర్‌లో తీసుకువచ్చింది. దేశంలో ఈ కలర్‌లో డిఫెండర్ అందుబాటులోకి రావడం గమనార్హం. వాస్తవానికి గ్రీన్ కలర్ కార్లు మన దేశంలో కార్లను చాలా అరుదుగా కనిపిస్తాయి.
చాలా ఖరీదైన లగ్జరీ కార్లు ఆకుపచ్చ రంగులో చాలా అరుదుగా అమ్ముడవుతాయి. అదే సమయంలో కొందరు తమ కార్లకు ప్రత్యేకంగా గ్రీన్ కలర్‌ని కోట్ చేస్తారు. తాజాగా ఖరీదైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 ప్రత్యేక గ్రీన్ కలర్‌లో డెలివరీ తీసుకుంటున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. ప్రపంచంలో ల్యాండ్ రోవర్ కార్లను అత్యధికంగా విక్రయిస్తున్న దేశాల్లో భారత్ ఒకటి.

ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో పెద్ద ఎత్తున ల్యాండ్ రోవర్ కార్లను కొనుగోలు చేస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇవి చూడటానికి భారీగా కనిపించడం, అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉండటం వల్ల ల్యాండ్ రోవర్ కార్లు భారతదేశంలో ఇంత ప్రాచుర్యం పొందడానికి కారణం అయ్యాయి. ల్యాండ్ రోవర్ డిఫెండర్లను ఆధునిక ప్రమాణాలతో నిర్మించారు. అలాంటి డిఫెండర్ ఇప్పుడు గ్రీన్ కలర్‌లో రావడంతో వైరల్ అవుతుంది.
ల్యాండ్ రోవర్ డిఫెండర్ 90, 110 మరియు 130 వేరియంట్లలో లభిస్తుంది. తాజాగా అతను కొనుగోలు చేసిన వేరియంట్ డిఫెండర్ 110. కేరళకు చెందిన ప్రేమ్‌షా అనే వ్యాపారవేత్త గ్రీన్ కలర్‌లో డిఫెండర్ 110 కారును కొనుగోలు చేశాడు. ప్రేమ్‌షా కేరళలోని కొల్లాంలోని అనచల్లో ఆటోబ్యాగ్స్ కంపెనీని నడుపున్నాడు. ఆటోబ్యాగ్స్ టూర్ ప్లానర్ కంపెనీ. తమిళనాడులో టూర్ ట్రిప్పులను ప్లాన్ చేసి దానికి అనుగుణంగా కస్టమర్లను తీసుకెళ్లే సంస్థ ఇది.

ఆటోబ్యాగ్స్ కంపెనీ కింద వివిధ వాహనాలు నడుస్తున్నాయి. కంపెనీని నడుపుతున్న ప్రేమ్‌షా కొచ్చిలోని ముత్తూట్ మోటార్స్ డీలర్షిప్ షోరూం నుంచి మాంబా గ్రీన్ కలర్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 కారును కొనుగోలు చేశారు. డిఫెండర్ ఇప్పటి వరకు భారత్‌లో 1200 యూనిట్లను విక్రయించింది. కానీ ప్రేమ్‌షా గ్రీన్ డిఫెండర్ 110 వాటన్నింటి కంటే భిన్నంగా ప్రత్యేకమైనది.
ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 రెండు ఇంజిన్ ఆప్షన్‌లో లభిస్తుంది. 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 3.0-లీటర్ డీజిల్‌తో ఈ కార నడుస్తుంది. ప్రేమ్‌షా డిఫెండర్ ఏ ఇంజిన్ ఆప్షన్‌లో కొనుగోలు చేశాడో తెలియలేదు. అయితే ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ మరియు ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటుంది.
డిఫెండర్ కార్లు ఖరీదైనవి అయినప్పటికీ, వాటిని కఠినమైన రోడ్లపై కూడా రవాణా చేయవచ్చు. డిఫెండర్ 5,018 మిమీ పొడవు, 2,008 మిమీ వెడల్పు, 1,967 మిమీ ఎత్తు ఉంటుంది. దీని వీల్ బేస్ 3,022 మిమీగా ఉంటుంది. కారు లోపల 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ కన్సోల్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉన్నాయి.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








