వందే మెట్రో సర్వీస్‌ వచ్చేసింది.. 5 గంటల్లో 300 కి.మీ ప్రయాణం, ప్రస్తుత మెట్రో కంటే 100 రెట్ల ఫాస్ట్‌ సర్వీస్‌

దేశంలోనే తొలి వందే మెట్రో రైలును (Vande Metro Rail) ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. గుజరాత్‌లో తొలి రైలుని ఆయన ప్రారంభించనున్నారు. ఈ కొత్త రైళ్లు ఆధునిక ఫీచర్లు, సరికొత్త టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చాయి. దేశంలో నగరాల్లోని ముఖ్య ప్రాంతాలను కలిపే ప్రయాణాలను మరితం సులభతరం చేయడానికి ఈ రైళ్లు మెట్రో రైళ్ల మాదిరి వందే మెట్రో రైళ్లు రూపొందించబడ్డాయి. దేశంలో ఈ రైళ్ల రాకతో కేవలం నిమిషాల వ్యవధిలోనే ప్రయాణికులు గమ్యాన్ని చేరే అవకాశం ఉంటుంది. ఈ రైలుని నమో భారత్‌ ర్యాపిడ్‌ రైల్‌ (Namo Bharat Rapid Rail) అని పిలుస్తున్నారు. ఈ రైలు ప్రత్యేకతలు ఏమిటి? ఈ రైలుకి సంబధించిన ఇతర పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.

ఈ వందే మెట్రో సర్వీస్‌ ప్రస్తుతం అందుబాటులోని ఉన్న ప్రయాణానికి అప్‌డేటెడ్‌ వెర్షన్‌గా రాబోతుంది. దీని ద్వారా సిటీ పరిధిలో నడిచే సాంప్రదాయ మెట్రోలకు భిన్నంగా, ఈ రైలు నగర కేంద్రాలను సమీప ప్రాంతాలతో వేగంగా కలుపుతుంది. నగరాల మధ్య ఫాస్ట్‌ కనెక్టివిటీ కోసం వీటిని రూపొందించారు. 'మెట్రో' సాధారణంగా పట్టణ రవాణా వ్యవస్థ కోసం సర్వీసుల సమయాలను కనెక్టివిటీని పెంచుతుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.

India s First Vande Bharat metro service

ఈ వందే మెట్రో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. దీని ద్వారా వందే మెట్రో రైలుతో ప్రజలకు వేగవంతమైన ప్రయాణాలు, ప్రయాణ సమయం తగ్గుతుంది. ఇది సాంప్రదాయ మెట్రో వ్యవస్థల కంటే ఫాస్ట్‌ సర్వీస్‌ని అందిస్తుంది. ఈ వందే భారత్ మెట్రో తొలి రైలు గుజరాత్‌లోని భుజ్ నుంచి అహ్మదాబాద్ వరకు ప్రయాణిస్తుంది. ఈ మొత్తం 359 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 5 గంటల 45 నిమిషాల్లో చేరుకుంటుంది.

నేటి నుంచే (సెప్టెంబర్ 17) రెగ్యులర్ సర్వీసులు ప్రారంభమవుతాయని, మొత్తం ప్రయాణానికి టికెట్ ధర రూ.455గా ఉంటుందని రైల్వే శాఖ తెలిపింది. ఈ వందే మెట్రోలో ఫ్లెక్సిబుల్‌ సీట్లు, పూర్తి వెలుతురుతో వచ్చే క్యాబిన్లు, మాడ్యులర్ ఇంటీరియర్ బిల్ట్‌తో ఆధునిక సౌకర్యాలను కలిగి ఉంటుంది. ఈ ఫీచర్లు పాత మెట్రో వ్యవస్థల కంటే అప్‌డేటేడ్‌ వెర్షన్‌లో వస్తాయి. దీనివల్ల ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ ఎక్స్‌పీరియన్స్‌ లభిస్తుంది.

Namo Bharat Rapid Rail

ఈ వందే మెట్రో రైలు భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ రూపకల్పన చేశారు. యాక్సిడెంట్ ప్రివెన్షన్ టెక్నాలజీ, ఫైర్ డిటెక్షన్ సిస్టమ్స్, ఏరోసోల్ ఆధారిత ఫైర్ ఫైటింగ్, ఎమర్జెన్సీ లైట్స్ వంటి కవచ్ సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ అధునాతన భద్రతా ఫీచర్లు ప్రయాణీకులందరికీ సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తాయి. అంతే కాకుండా అత్యుత్తమ ఇంటీరియర్ స్ట్రక్చర్‌తో ఈ రైలును రూపొందించారు.

వికలాంగుల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు, పూర్తిగా క్లోజ్డ్‌ ఫ్లెక్సిబుల్ కాంప్లెక్స్, ఫుడ్‌ సర్వీస్‌ అందించనున్నారు. మొబైల్ ఛార్జింగ్ సాకెట్లు, సీసీటీవీ కవరేజ్‌, డ్రైవర్‌తో అత్యవసర కమ్యూనికేషన్ కోసం టాక్ బ్యాక్ సిస్టమ్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. వందే మెట్రో సాంప్రదాయ సబర్బన్ రైళ్ల కంటే సున్నితమైన ప్రయాణం కోసం బేస్‌మెంట్‌తో పనిచేసే అధునాతన బ్రేకింగ్ వ్యవస్థలను కలిగి ఉంది.

PM Narendra Modi Inaugurated Vande Metro Rail

ఈ రైలులో మొత్తం 12 బోగీలు కలవు. ఇందులో 1,150 మంది ప్రయాణీకులు ఒకేసారి ప్రయాణించవచ్చు. అర్బన్ మెట్రో వ్యవస్థల మాదిరిగానే రెండు వైపుల ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లు, డస్ట్‌ రహిత, పీస్‌ఫుల్‌, వర్షపునీటి రైలు లోపల వాతావరణాన్ని కాపాడే ఫ్లెక్సిబుల్ గ్యాంగ్ వే ఇందులో ఉన్నాయి. వందే మెట్రోను 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించే వారికోసం రూపొందించారు.

డ్రైవ్స్‌పార్క్‌ కాన్సెప్ట్: వందే మెట్రోను ప్రవేశపెట్టడం ద్వారా భారతదేశంలో రైలు రవాణా మరొక ముందడుగు వేసిందని చెప్పవచ్చు. ఇది ఫాస్టర్‌ సర్వీస్‌తో పాటు ఇతర మౌలిక అవసరాల కల్పన కోసం ఉపయోగపడుతుంది. దీని రెగ్యులర్ సర్వీస్‌లు దేశవ్యాప్తంగా ప్రయాణీకులు అలవాటు పడే అవకాశం ఉంటుంది. ముఖ్య నగరాల మధ్య ప్రయాణానికి కొత్త ప్రమాణాలను నెరవేర్చేలా ఈ సర్వీసులు ఉపయోగడతాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, September 17, 2024, 10:34 [IST]
English summary
Indias first vande metro train service inaugurated by pm modi in gujarat
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+