భారతదేశంలో అతిపెద్ద ఛార్జింగ్ స్టేషన్ వచ్చేసింది.. దీని ప్రత్యేకత ఏమంటే?

భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహన వినియోగం ఎక్కువవుతోంది. అయితే ఎలక్ట్రిక్ వాహనాలకు కావలసిన మౌలిక సదుపాయాలైన ఛార్జింగ్ స్టేషన్స్ మాత్రమే కావాల్సిన సంఖ్యలో అందుబటులో లేదు. కావున ఇప్పుడు దేశంలో చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటుచేసే దిశలో పయనిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఛార్జింగ్ స్టేషన్ గురువారం గురుగ్రామ్ సెక్టార్ 86లో ప్రారంభించబడింది.

భారతదేశంలో అతిపెద్ద ఛార్జింగ్ స్టేషన్ వచ్చేసింది.. దీని ప్రత్యేకత ఏమంటే?

ఈ ఛార్జింగ్ స్టేషన్ ఢిల్లీ-జైపూర్ ఈ-హైవేపై ఉంది. ఈ ఛార్జింగ్ స్టేషన్ 141 ఛార్జింగ్ పాయింట్లను కలిగి ఉంది. అంతే కాకుండా ఈ అతి పెద్ద ఛార్జింగ్ స్టేషన్ కేవలం 24 గంటల్లో 1,000 ఎలక్ట్రిక్ కార్లను ఛార్జ్ చేయగలదు. ఇది నిజంగా ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు మంచి శుభవార్త అనే చెప్పాలి.

భారతదేశంలో అతిపెద్ద ఛార్జింగ్ స్టేషన్ వచ్చేసింది.. దీని ప్రత్యేకత ఏమంటే?

ఈ ఛార్జింగ్ స్టేషన్‌ను ఇన్‌స్టాల్ చేసిన Alektrify అనే కంపెనీ గత నెలలో గురుగ్రామ్‌లోని సెక్టార్ 52లో పెద్ద ఛార్జింగ్ స్టేషన్‌ను ఇన్‌స్టాల్ చేసింది. ఈ ఛార్జింగ్ స్టేషన్‌లో 75 ఎసి స్టాండర్డ్ ఛార్జర్ మరియు 25 డిసి ఫాస్ట్ ఛార్జర్‌లను ఇన్‌స్టాల్ చేసినట్లు కంపెనీ తెలిపింది. డీసీ ఛార్జర్‌తో 24 గంటల్లో 570 ఎలక్ట్రిక్ కార్లను ఛార్జ్ చేయగలిగితే, ఏసీ ఛార్జర్ సహాయంతో రోజుకు 600 కార్లను ఛార్జ్ చేయవచ్చు.

భారతదేశంలో అతిపెద్ద ఛార్జింగ్ స్టేషన్ వచ్చేసింది.. దీని ప్రత్యేకత ఏమంటే?

కంపెనీ ఏరాటు చేసిన ఈ ఛార్జింగ్ స్టేషన్ రెండు రకాల ఛార్జర్‌లను ఉపయోగించి 24 గంటల్లో మొత్తం 1,000 ఎలక్ట్రిక్ కార్లను ఛార్జ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. కావున రోజుకి 1000 ఎలక్ట్రిక్ కార్లకు సులభంగా ఛార్జ్ చేస్తుంది. 30 రోజుల రికార్డు సమయంలో నిర్మించిన కంపెనీకి ఇది రెండో ఛార్జింగ్ స్టేషన్ అని Alektrify చెబుతోంది.

ఢిల్లీ-ఆగ్రా ఈ-హైవేపై 60 రోజుల్లో ఇదే విధమైన ఛార్జింగ్ సామర్థ్యంతో మరో రెండు ఛార్జింగ్ స్టేషన్లను ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది. కావున త్వరలోనే మరిన్ని ఛార్జింగ్ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క అవసరాలను తీరుస్తాయి.

భారతదేశంలో అతిపెద్ద ఛార్జింగ్ స్టేషన్ వచ్చేసింది.. దీని ప్రత్యేకత ఏమంటే?

అయితే ఈ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేటన్ ప్రారంభోత్సవం సందర్భంగా, నేషనల్ ప్రోగ్రామ్ డైరెక్టర్, బిజినెస్ మరియు ప్రాజెక్ట్ డైరెక్టర్, నేషనల్ హైవేస్ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (NHEV) 'అభిజిత్ సిన్హా' మాట్లాడుతూ.. సెక్టార్-52లో ఏర్పాటు చేసిన ఛార్జింగ్ స్టేషన్‌ను ప్రారంభించిన తర్వాత ఇది మా రెండవ ఛార్జింగ్ స్టేషన్. ఇది కేవలం 30 రోజుల్లో నిర్మించబడింది.

భారతదేశంలో అతిపెద్ద ఛార్జింగ్ స్టేషన్ వచ్చేసింది.. దీని ప్రత్యేకత ఏమంటే?

ఢిల్లీ-ఆగ్రా ఈ-హైవే కోసం నోయిడాలో 60 రోజులలోపు అదే పరిమాణం మరియు స్థాయి రెండు కొత్త స్టేషన్లు ఏర్పాటు చేయబడతాయి. ప్రభుత్వ రంగ సంస్థలు/ప్రైవేట్ సంస్థలకు కేటాయించిన తేదీ నుండి 90 రోజుల రికార్డు సమయంలో మరో 30 ఈ-హైవే ఛార్జింగ్ స్టేషన్లు నిర్మించబడతాయని ఆయన చెప్పారు.

భారతదేశంలో అతిపెద్ద ఛార్జింగ్ స్టేషన్ వచ్చేసింది.. దీని ప్రత్యేకత ఏమంటే?

ఈ ఛార్జింగ్ స్టేషన్లు ఇప్పుడు 72 శాతం వినియోగం మరియు 36 నెలల విరామంతో పెట్రోల్ పంపులతో వాణిజ్యపరంగా మరియు సాంకేతికంగా పోటీపడుతున్నాయని, ఈ స్టేషన్ 1,000 కార్లను మరియు సెక్టార్ 52 స్టేషన్ 576 కార్లను ఛార్జ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందని కూడా ఆయన చెప్పారు.

భారతదేశంలో అతిపెద్ద ఛార్జింగ్ స్టేషన్ వచ్చేసింది.. దీని ప్రత్యేకత ఏమంటే?

సాధారణ ఛార్జింగ్ స్టేటన్స్ పట్టణ ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే పెద్ద మొత్తంలో అంటే 1000 కార్లకు ఛార్జింగ్ చేయడం అనేది గొప్ప విషయం అనే చెప్పాలి. ఇలాంటివి రానున్న రోజుల్లో మరిన్ని అందుబాటులోకి రానున్నాయి. అప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ కష్టాలు ఉండే అవకాశం లేదు.

భారతదేశంలో అతిపెద్ద ఛార్జింగ్ స్టేషన్ వచ్చేసింది.. దీని ప్రత్యేకత ఏమంటే?

భారతే దేశంలో ఎలక్ట్రిక్ వాహన వినియోగాలను పెంచడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలను అందిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని తప్పకుండా పెంచుతాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా అదేవిధంగా అందుబాటులో ఉండాలి. దీనికోసం ప్రభుత్వాలు ప్రయివేట్ సంస్థలతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. కావున రానున్న రోజుల్లో ఛార్జింగ్ స్టేషన్స్ విరివిగా అదుబాటులోకి రానున్నాయి.

గమనిక: మొదటి రెండు ఫోటోలు తప్పా మిగిలినవి కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే

More from DriveSpark

Article Published On: Friday, March 4, 2022, 19:21 [IST]
English summary
Indias largest ev charging station inaugurated in gurugram sector 86 details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+