హైదరాబాద్ వ్యక్తి ఖాతాలో చేరిన అత్యంత ఖరీదైన సూపర్ కారు.. ధర వింటేనే దడ పుట్టేస్తుంది
గత కొన్ని సంవత్సరాలు కొంత మంది వాహన ప్రేమికులు అన్యదేశ కార్లను కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల హైదరాబాద్ కి చెందిన ఒక వ్యక్తి అత్యంత ఖరీదైన 'మెక్‌లారెన్' కారుని కొనుగోలు చేశారు. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం హైదరాబాద్ కు చెందిన ఒక బిజినెస్ మ్యాన్ కి కంపెనీ 'మెక్‌లారెన్ 765 LT స్పైడర్' డెలివరీ చేసింది. ఈ సూపర్ కారు డెలివరీ చేసుకున్న ఆ వ్యక్తి పేరు 'నసీర్ ఖాన్'. మెక్‌లారెన్ కంపెనీ కార్లు ప్రస్తుతం భారతీయ మార్కెట్లో లభిస్తున్న అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో ఒకటిగా ఉన్నాయి. ఈ కారు ధర రూ.12 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మెక్‌లారెన్ కంపెనీ ఇప్పటికే భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది. ఇందులో భాగంగానే ముంబైలో ఒక డీలర్‌షిప్ కూడా ప్రారంభించింది. ఈ డీలర్‌షిప్ ప్రారంభోత్సవంలో భాగంగానే కంపెనీ ఈ మెక్‌లారెన్ 765 LT స్పైడర్ సూపర్ కారుని ఆవిష్కరించింది. అయితే ఈ సూపర్ కారు కొనుగోలు చేసిన వ్యక్తిగా 'నసీర్ ఖాన్' నిలిచాడు. ఈ కారుని కంపెనీ ఇటీవలే డెలివరీ చేసింది. ఈ కారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది.
మెక్‌లారెన్ కంపెనీ ప్రస్తుతం భారతదేశంలో జిటి, ఆర్టురా, 720ఎస్, 720ఎస్ స్పైడర్, 765 ఎల్‌టి మరియు 765 ఎల్‌టి స్పైడర్ వంటి వాటిని అందిస్తోంది. అయితే కంపెనీ అందిస్తున్న 765 ఎల్‌టి స్పైడర్ ఈ మోడల్స్ అన్నింటిలోకి ఖరీదైనదని తెలుస్తోంది. ఈ ఖరీదైన కారునే నసీర్ ఖాన్ కొనుగోలు చేశారు. ఇది ఎమ్ఎస్ఓ వోల్కనో రెడ్ కలర్ లో చూడటానికి చాలా స్పోర్టివ్ గా ఉంది.
భారతదేశంలో మెక్‌లారెన్ 765 LT స్పైడర్ కారుకి మొదటి యజమాని నసీర్ ఖాన్ అని తెలుస్తోంది. అయితే ఈ కారులో ఏదైనా కస్మైజేషన్స్ జరిగాయా.. లేదా అనేది ఖచ్చితంగా తెలియదు. కానీ ఇది చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. కంపెనీ ఇప్పటివరకు ఉత్పత్తి చేసిన వేగవంతమైన కన్వర్టబుల్ కార్లలో 765 LT స్పైడర్ ఒకటి. ఇది కూపే వెర్షన్ వలె చాలా ఏరోడైనమిక్ డిజైన్ పొందుతుంది.
మెక్‌లారెన్ 765 LT స్పైడర్ సూపర్ కారు యొక్క బాడీ వర్క్ కోసం ఎక్కువగా కార్బన్ ఫైబర్ ఉపయోగించారు. ఈ కారు అగ్రెసివ్ ఫ్రంట్ బంపర్, స్పిల్టర్, సైడ్ స్కర్ట్ మరియు ర్యాప్అరౌండ్ రియర్ బంపర్ వంటి వాటిని పొందుతుంది. ఇది కన్వర్టబుల్ వెర్షన్ కాబట్టి, సూపర్ కారు పైకప్పు కేవలం 11 సెకన్లలో ఫోల్డ్ అవుతుంది. ఈ కారు ఉతప్పటి కేవలం 765 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడింది.
మెక్‌లారెన్ 765 LT స్పైడర్ భారతదేశంలోని ఇతర సూపర్ కార్ల కంటే మరింత ప్రత్యేకమైనదిగా ఉంటుంది. ఇందులో 4.0 లీటర్ ట్విన్-టర్బోఛార్జ్ డ్ వి8 పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 765 బిహెచ్‌పి పవర్ మరియు 800 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 7-స్పీడ్ సీక్వెన్షియల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కావున అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. ఈ కారణంగా ఈ కారుకి ఎక్కువమంది అభిమానులు ఉన్నారు.
నిజానికి నసీర్ ఖాన్ కొనుగోలు చేసిన మెక్‌లారెన్ 765 LT స్పైడర్ తన మొదటి సూపర్ కారు కాదు. ఇప్పటికే అతని గ్యారేజిలో రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్, ఫెరారీ 812 సూపర్ ఫాస్ట్, మెర్సిడెస్ బెంజ్ జీ350డీ, ఫోర్డ్ ముస్టాంగ్, లంబోర్ఘిని అవెంటడార్ మరియు లంబోర్ఘిని ఉరుస్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలను తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








