IndiGo Airlines 'ఇండిగో' ఘనత.. 10 కోట్ల మంది ప్రయాణించిన తొలి భారత విమానయాన సంస్థగా రికార్డు
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో(IndiGo) ఎయిర్‌లైన్స్ చరిత్ర సృష్టించింది. ఒక్క ఏడాదిలోనే 100 మిలియన్ (10 కోట్ల మంది) ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చిన తొలి భారత విమానయాన సంస్థగా రికార్డు సాధించింది. ఈ మేరకు ఇండిగో ఎయిర్‌లైన్స్ సోమవారం(డిసెంబర్ 18న) అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
భారత విమానయాన సంస్థ ఇండిగో (IndigGo Airlines) ఎయిర్‌లైన్స్ ద్వారా 2023 సంవత్సరంలో 10 కోట్ల మంది ప్రయాణించినట్లు సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఇన్ని కోట్ల మంది ప్రయాణించిన తొలి భారత విమానయాన సంస్థగా ఇండిగో రికార్డు సాధించింది. దేశీయంగా ఒక విమానయాన సంస్థ ఈ తరహా రికార్డును సృష్టించటం ఇదే మొదటిసారి.

'ఒక క్యాలెండర్ సంవత్సరంలో 100 మిలియన్ల(10 కోట్లు) మంది ప్రయాణికులను తీసుకువెళ్లిన తొలి భారతీయ విమానయాన సంస్థగా అవతరించడం ద్వారా ఇండిగో చరిత్ర సృష్టించింది' అని ఎయిర్‌లైన్స్ పేర్కొంది. ఇంతటి గొప్ప విజయాన్ని సాధించడం ద్వారా భారత విమానయాన సంస్థ ఇండిగో.. ప్రపంచంలోని అతిపెద్ద 10 ఎయిర్‌లైన్స్ సరసన చేరినట్లు సంస్థ వెల్లడించింది.
ఈ విజయంపై ఇండిగో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(CEO) పీటర్ ఎల్బర్స్ హర్షం వ్యక్తం చేశారు. ఏడాదిలో 100 మిలియన్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం గొప్ప విషయమన్నారు. చారిత్రక మైలురాయిని సాధించినందుకు సంతోషిస్తున్నట్లు సీఈవో పీటర్ వెల్లడించారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ కస్టమర్లు చూపిన ప్రేమ, విశ్వాసం, ఇండిగో సహచరుల ప్యాషన్, కృషి ఫలితంగా ఈ చారిత్రక మైలురాయిని సాధించినట్లు ఆయన స్పష్టం చేశారు.

గురుగ్రామ్‌కు చెందిన ఇండిగో ఎయిర్‌లైన్స్.. ఈ ఏడాది 17వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకొంది. కాగా 2022 లో 7.8 కోట్ల మంది ఇండిగో ఎయిర్‌లైన్స్ ద్వారా ప్రయాణించారు. అయితే ఈ ఏడాది 22 శాతం వృద్ధిని నమోదు చేస్తూ మొత్తంగా 10 కోట్ల మంది ప్రయాణించారు.
కాగా ఈ ఏడాదిలో ఒకే రోజు 2 వేల విమానాలు, 118 గమ్యస్థానాలకు చేర్చిన ఘనత కూడా ఇండిగో ఎయిర్‌లైన్స్ సొంతం. ఇందులో 20 కి పైగా అంతర్జాతీయ విమానాశ్రయాలు కూడా ఉండటం విశేషం. దీని ద్వారా ఇండిగో ఎయిర్‌లైన్స్ తన ఉనికిని మరింత విస్తరించుకుంది.

కాగా గత కొన్నేళ్లుగా భారత్‌లో పెరిగిన ఇంధన, నిర్వహణ రేట్లతో విమానయానరంగం కుదేలవుతున్న నేపథ్యంలో కేంద్రం ప్రోత్సాహకాలు అందించింది. కరోనా తర్వాత తిరిగి విమాన ప్రయాణాలకు డిమాండ్ పెరగడం కూడా ఎయిర్‌లైన్లకు కలిసి రావడంతో ఇండిగో ఎయిర్‌లైన్స్ ఈ ఘనత సాధించింది.
రాబోయే నెలల్లో ఇండిగో వ్యాపారం కోసం రోడ్‌మ్యాప్‌ను రూపొందించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. నివేదిక ప్రకారం బాలి, ఇండోనేషియా మదీనా, సౌదీ అరేబియా వంటి అంతర్జాతీయ గమ్యస్థానాలను తన సేవలను జోడించడం ద్వారా అత్యంత ఆర్థికంగా, పర్యావరణహిత పరంగా మంచి వృద్ధిని సాధించాలనే లక్ష్యంతో ఉంది. అంతే కాకుండా ఇండిగో పదేళ్లలో A320 విభాగంలో 1330 విమానాలను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








