30 ఎయిర్‌ బస్‌ విమానాలకు ఇండిగో ఆర్డర్‌.. రోల్స్‌ రాయిస్‌తో కీలక ఒప్పందం

దేశంలోనే అతి పెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 30 వైడ్‌- బాడీ A350-900 విమానాలను ఆర్డర్‌ చేసింది. అంతర్జాతీయంగా విమానయాన సేవలందిస్తున్న ఇండిగో.. తాజాగా గురువారం ఈ ప్రకటన చేసింది. తన అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరింపజేసే ప్రయత్నంలో భాగంగా సంస్థ మరో అడుగు ముందుకు వేసింది.

ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ప్రస్తుతం.. దేశీయంగా, అంతర్జాతీయంగా 110 గమ్యస్థానాలకు సేవలందిస్తోంది. కాగా గత క్యాలెండర్‌ ఇయర్‌లో ఇండిగో 10 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందించి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎయిర్‌లైన్స్‌లో ఒకటిగా తన స్థానాన్ని పదిలపరుచుకుంది. ఈ మేరకు దేశంలోని ప్రధాన మెట్రో నగరాలను అంతర్జాతీయంగా కనెక్ట్‌ చేస్తూ 30 ఎయిర్‌బస్‌ విమానాలకు ఆర్డర్‌ పెట్టినట్లు సంస్థ వెల్లడించింది.

Indigo-Rolls-Royce-30-Airbus

ఇప్పటి వరకు, ఇండిగో ప్రధానంగా నారో బాడీ ఎయిర్‌బస్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ద్వారా ప్రయాణికులకు సేవలందిస్తోంది. అయితే కొన్ని మార్గాల్లో కార్యకలాపాల కోసం టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌ నుంచి రెండు బోయింగ్‌ 777 విమానాలను లీజుకు తీసుకుని నడిపిస్తోంది. కాగా ఇప్పుడు ఇండిగో కొత్తగా ఆర్డర్‌ చేసిన వైడ్ బాడీ విమానాలు రోల్స్ రాయిస్ యొక్క ట్రెంట్ XWB ఇంజిన్‌తో పనిచేస్తాయి.

అందుబాటులో ఉన్న అధికారిక సమాచారం ప్రకారం ఇండిగో 60 ట్రెంట్ XWB-84 ఇంజిన్‌ల కోసం రోల్స్ రాయిస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. సాఫీగా కార్యకలాపాలు సాగించేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని ఇండిగో ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇక ట్రెంట్ XWB ఇంజిన్‌లు, వాటి సామర్థ్యం మరియు విశ్వసనీయతకు ప్రసిద్ధి చెందగా.. ఇది మునుపటి మోడళ్ల కంటే 15 శాతం ఇంధన వినియోగ ప్రయోజనాన్ని కలిగి ఉన్నట్లు సమాచారం.

Indigo-Rolls-Royce-30-Airbus

ఇండిగోతో ఒప్పందంపై Rolls Royce PLC చీఫ్‌ కస్టమర్‌ ఆఫీసర్‌ ఎవెన్‌ మెక్‌డొనాల్డ్‌ మాట్లాడారు. ఇండిగో నుంచి ట్రెంట్ XWB-84 ఇంజిన్‌ల కోసం ఇంత పెద్ద ఆర్డర్‌ పొందడం గొప్ప విజయమని ఆయన అన్నారు. రోల్స్‌రాయిస్‌కు భారత్‌ ముఖ్యమైన మార్కెట్‌ అని.. ఈ ఒప్పందం ద్వారా విమానయాన సర్వీస్‌లో మరింత వృద్ధిని సాధించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

తమపై నమ్మకం ఉంచినందుకు ఇండిగోకు మెక్‌డొనాల్డ్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ప్రయాణంలో ఇండిగోతో భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఈ ఒప్పందం ద్వారా మరింత మంది కస్టమర్లకు సేవలందిస్తామని పేర్కొన్నారు. కాగా ఇండిగో ఎయిర్‌లైన్స్‌.. ప్రధాన విమానాల ఆర్డర్ కోసం ఆర్డర్‌ పెట్టడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది జూన్‌లో, ఎయిర్‌బస్‌తో 500 విమానాల కోసం ఆర్డర్‌ చేసింది. ఇది ఇండిగో చేసిన అతి పెద్ద ఆర్డర్‌ కావడం విశేషం.

కాగా ఇండిగో ఆర్డర్‌ 30 A350- 900 విమానాల డెలివరీలు 2027లో ప్రారంభమవుతాయని సమాచారం. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఇండిగో.. అదనంగా 70 ఎయిర్‌బస్ A350 ఫ్యామిలీ ప్లేన్‌లను కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే భవిష్యత్తులో ఇండిగో సేవలు మరింతగా పెరగనున్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, April 26, 2024, 12:57 [IST]
English summary
Indigo airlines ordered 30 wide body a350 900 airbus planes check full details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+