తన తాతయ్యను తొలిసారిగా విమానం ఎక్కించిన మనవడు.. ఆ ఫ్లైట్ నడిపింది ఎవరో తెలుసా.??
చిన్నప్పుడు తండ్రి తన సైకిల్ లేదా బైక్‌పై ముందు కొడుకును కూర్చోబెట్టుకుని నడుపుతుంటే ఆ కొడుకు ఆనందానికి అవధులు ఉండవు. ఆ తర్వాత పెద్దయ్యాక అదే కొడుకు తన తండ్రిని బైక్ వెనుక కూర్చుని నడుపుతుంటే బాధ్యతలు తీరినంత ఆనందంగా ఫీలవుతాడు ఆ తండ్రి. అయితే ఇక్కడ తన తాతయ్యకు మధురమైన సర్‌ప్రెజ్‌ను ఇచ్చాడు ఓ మనవడు అదేంటంటే..
ఓ మనవడు తన తాతయ్య(Pilot Surprise To His Grandfather)ను తొలిసారిగా ఫ్లైట్ ఎక్కించాడు. ఇందులో ఆశ్చర్యమేంటి అనుకుంటున్నారా.. తన తాతయ్య ఎక్కిన ఆ విమానాన్ని నడిపింది ఆ పైలటే.. ఆ విషయం తన తాతయ్యకు తెలియదు. ఫ్లైట్ ఎక్కిన తర్వాత సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు ఆ మనవడు. అప్పుడు ఆ పెద్దాయన ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

విమానం నడిపే ప్రతి పైలట్‌కు ప్రతి క్షణం చాలా కీలకమే. చాలా అప్రమత్తంగా ఫ్లైట్ నడపాల్సి ఉంటుంది. కానీ తమ కుటుంబం ఆ విమానంలో ప్రయాణించాల్సి వస్తే.. ఆనందంతో కూడిన కొంచెం భయం ఉంటుంది. ఈ భయాలన్నీ పక్కన పెడితే.. తాను నడుపుతున్న ఫ్లైట్‌లో తొలిసారిగా ప్రయాణిస్తున్న తన తాతయ్యను అందరికీ గొప్పగా పరిచయం చేసి తన ప్రేమను చాటుకున్నాడు.
ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. ఆ పైలట్ పేరు ప్రదీప్ కృష్ణన్. అతను ప్రసిద్ధ ఇండిగో ఎయిర్‌లైన్‌లో పైలట్‌గా పనిచేస్తున్నాడు. అతని తాత మరియు కుటుంబం మొత్తం తమిళనాడుకు చెందినవారే. చెన్నై నుంచి కోయంబత్తూరు వెళ్లే ఇండిగో విమానంలో పైలట్ ప్రదీప్ కృష్ణ ఆశ్చర్యకరమైన యాత్ర జరిగింది.

అంటే ఈ విమానాన్ని నడిపిన పైలెట్లలో ప్రదీప్ కృష్ణన్(Indigo Flight) ఒకరు. ఇక్కడ ఆ పైలట్ తాతయ్య.. తన భార్య, కుటుంబంతో కలిసి ఇండిగో విమానం ఎక్కాడు. అయితే విమానం ఎక్కేవరకు ఫ్లైట్ నడుపుతుంది తన మనవడే అనే విషయం ఆ పెద్దాయనకు తెలియదు. దీంతో విమానం ఎక్కాక టేకాఫ్ అయ్యేముందు లోపలికి వచ్చిన తన మనవడిని పైలట్ సూట్‌లో చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు అతని తాతయ్య.
లోపలికి వచ్చాక ప్రదీప్ కృష్ణన్ ఓ ప్రకటన చేశారు. నా కుటుంబం నాతో ప్రయాణిస్తున్నట్లు ప్రకటించడానికి చాలా సంతోషంగా ఉంది. మా తాత, అమ్మమ్మ మరియు అమ్మ 29వ వరుస సీట్లలో కూర్చున్నారు. మా తాతయ్య ఈరోజు తొలిసారిగా నాతో విమాన ప్రయాణం చేస్తున్నారు " అని ప్రత్యేక ప్రకటన చేశారు.

అయితే కొంతమంది పైలట్లు కాక్‌పిట్ క్యాబిన్ లోపల ఉండి మైక్‌లో మాట్లాడుతుంటారు. కొంతమంది నేరుగా బయటకు వచ్చి ప్రయాణికుల ఎదుటే మాట్లాడుతారు. ఇక్కడ ప్రదీప్ కృష్ణన్ కూడా విమానంలో తన కుటుంబం ముందు నిలబడి తమిళం మరియు ఆంగ్లం కలగలిసిన భాషలో ప్రత్యేక ప్రకటన చేశారు.
పైలట్ ప్రదీప్ కృష్ణన్ 'నేను మా తాతయ్య TVS 50 బైక్ వెనుక సీటులో చాలా సార్లు ప్రయాణించాను. ఇప్పుడు నేను నడుపుతున్న ఫ్లైట్‌లో మా తాతయ్య ప్రయాణించడం చాలా ఉంద'ని ప్రకటించాడు. దీంతో విమానంలోని ప్రయాణికులందరూ చప్పట్లు కొట్టారు. ప్రదీప్ తాత లేచి నిలబడి దండం పెడుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో ప్రదీప్ కృష్ణన్‌ను నెటిజన్లు అభినందిస్తున్నారు. ఏ కుటుంబానికి అయినా ఇదో గొప్ప అనుభూతిని అని కామెంట్లు చేస్తున్నారు. ప్రదీప్ కృష్ణన్ 2018లో పైలట్‌గా బాధ్యతలు స్వీకరించారు. పైలట్‌గా తన మొదటి విమానంలో తన తల్లి మరియు అమ్మమ్మను తీసుకెళ్లడం అప్పట్లో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఇప్పుడు తొలిసారిగా తాతయ్యని తీసుకెళ్ళారు.


Click it and Unblock the Notifications








