ఇండిమోటార్డ్ 'టాంబ్ రైడర్' - టూర్ ఆఫ్ కాంబోడియా మోటార్‌సైకిల్ అడ్వెంచర్ టూర్

By Ravi

మీకు మోటార్‌సైకిల్ అడ్వెంచర్ టూరింగ్ అంటే ఇష్టమా..? మీ టూరింగ్‌కి సరైన గ్రూప్ కోసం ఎదురుచూస్తున్నారా..? లేక బైక్‌పై అడ్వెంచరస్ రైడ్‌లు చేసేందుకు ఓ చక్కని అవకాశం కోసం ఎదురుచూస్తున్నారా..? అయితే, ఇదిగో అలాంటి ఓ చక్కటి అవకాశమే ఇది.

కాంబోడియాలోని మిస్టీరియస్ మరియు ఏన్షియంట్ వైల్డ్‌నెస్‌ను చుట్టేందుకు 'టాంబ్ రైడర్ - టూర్ ఆఫ్ కాంబోడియా - ఏ రైడ్ త్రూ ది అన్ఎక్స్‌ప్లోర్డ్ ట్రైల్స్' పేరిట ఓ మోటార్‌సైకిల్ అడ్వెంచర్‌ను నిర్వహిస్తున్నారు. భారతదేశపు పురాతన మోటార్‌సైకిల్ అడ్వెంచర్ టూరింగ్ కంపెనీ 'ఇండిమోటార్డ్' (indiMotard) ఈ అడ్వెంచరస్ మోటార్‌సైకిల్ టూర్‌ను నిర్వహిస్తోంది.

'టాంబ్ రైడర్ - టూర్ ఆఫ్ కాంబోడియా' మార్చ్ 16, 2014వ తేదీన ప్రారంభమవుతుంది. ఈ టూర్ కాంబోడియా రాజధాని నాంఫెన్ నుంచి ప్రారంభమై మొత్తం 9 రోజుల పాటు సాగుతుంది. ఈ ట్రావెల్ రూట్ సముద్ర తీరాలు, దాగి ఉండే బీచ్‌లు మరియు రహస్య ద్వీపాల గుండా సాగుపోతుంది. అలాగే 15వ శతాబ్ధానికి చెందిన ఆంగ్కార్ వాట్ దేవాలయాలను సందర్శించే అవకాశం ఉంటుంది.

indiMotard Tomb Raider

అంతేకాదు, ఈ టూర్‌లో మీరు ఇదివరకెన్నడూ చూడని వంటకాలు కూడా ఉంటాయి. సీమ్ రీప్‌లో అడవి రూట్ల గుండా సాగిపోతూ ఈ టూర్ చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. డర్ట్ ట్రైల్, దాగి ఉండే రసహ్య దేవాలయాలు, దశాబ్ధాలు గడచిన ఇప్పటికీ మారని గ్రామాలు ఇలా ఎన్నెన్నో అద్భుతాలను ఈ టూర్‌లో చూడొచ్చు.

ఈ టూర్‌లో పాల్గొనే వారికి హోండా ఎక్స్ఆర్250ఎస్, బాజా 250ఎస్, యమహా సెర్రో ఎక్స్‌టి 225 మోటార్‌సైకిళ్లను ఆఫర్ చేస్తారు. ఇంధనాన్ని కూడా వారే ఆఫర్ చేస్తారు. బాగా నిపుణులై టూర్ గైడ్లు కూడా వీరితో ఉంటారు. అన్నీ కలిపి ఈ టూర్ ప్యాకేజ్ ధర రూ.1,29,000. మొదట్లో ఈ ప్యాకేజ్ ధర ఎక్కువగా అనిపించినప్పటికీ, ఇందులో అనుభూతి మాత్రం ఇందకు వంద రెట్లు అధికంగా ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు.

ఈ టూర్ ప్యాకేజ్‌లో 7 రోజుల మోటార్‌సైక్లింగ్ టూర్, 9 రోజుల వెకేషన్ ఉంటాయి. ఇందులో ఇన్ని భోజనాలు, మోటార్‌సైకిళ్లు, ఫ్యూయెల్, బ్యాకప్/సపోర్ట్ వెహికల్, మెకానిక్, ఎయిర్‌పోర్ట్ పికప్/డ్రాప్ వంటి అన్ని లగ్జరీ అకామిడేషన్లు ఉంటాయి. అయితే, ఇందులో ఎయిర్ టికెట్స్, వీసా చార్జీలు, రైడింగ్ గేర్, హెల్త్/యాక్సిడెంట్ ఇన్సూరెన్స్‌లు కవర్ కాబడి ఉండవు.

మరిన్ని వివరాల కోసం సంప్రదించండి:
Mr. Anand Dharmaraj - +91 998 082 9440
ఈ-మెయిల్ ఐడి: [email protected]
వెబ్‌సైట్: www.indimotard.com

Article Published On: Thursday, January 30, 2014, 12:47 [IST]
English summary
If you are passionate about motorcycle adventure touring but are waiting for the right group or do not know how to go about it on your own then here is an excellent opportunity to explore the mysterious and ancient wilderness of Cambodia. Named "‘Tomb Rider' - Tour of Cambodia - A Ride Through the Unexplored Trials" this motorcycle adventure tour is being organised by India's leading Motorcycle Adventure Touring company indiMotard. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+