సైకిల్‌పై ఫుడ్ డెలివరీ చేస్తున్న వ్యక్తిని చూసి చలించిపోయిన పోలీసులు.. చందాలు వేసుకొని కొత్త బైక్ గిఫ్ట్..!

సాధారణంగా, కొందరు డెలివరీ బాయ్స్ పోలీసుల వలన ఇబ్బందులు ఎదుర్కుంటుంటామని చెబుతూ ఉంటారు. అయితే, ఈ డెలివరీ బాయ్ మాత్రం పోలీసులు వలన చాలా లాభపడ్డాడు. ఆ వివరాలేంటో చూద్దాం రండి.

సైకిల్‌పై ఫుడ్ డెలివరీ చేస్తున్న వ్యక్తిని చూసి చలించిపోయిన పోలీసులు.. చందాలు వేసుకొని కొత్త బైక్ గిఫ్ట్..!

డెలివరీ చేసే వ్యక్తి యొక్క పని చాలా సవాలుతో కూడుకున్నది, ముఖ్యంగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీకి సంబంధించిన పనైతే అడుగడునా అవాంతరాలే ఉంటాయి. ఇలాంటి డెలివరీ బాయ్స్ బయటి వాతావరణంతో సంబంధం లేకుండా, సరైన సమయంలో కస్టమర్‌లకు ఆహారాన్ని డెలివరీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంది మరియు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటిపోతున్నాయి. అటువంటి పరిస్థితిలను సైతం ఫుడ్ డెలివరీ బాయ్స్ లెక్క చేయకుండా, కస్టమర్లకు ఆహారాన్ని డెలివరీ చేస్తుంటారు.

సైకిల్‌పై ఫుడ్ డెలివరీ చేస్తున్న వ్యక్తిని చూసి చలించిపోయిన పోలీసులు.. చందాలు వేసుకొని కొత్త బైక్ గిఫ్ట్..!

ఫుడ్ డెలివరీ బాయ్స్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. చాలా మందికి ఈ పనే పూర్తి జీవనాధారంగా ఉంటుంది. తాజాగా ఓ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలో పనిచేస్తున్న ఓ డెలివరీ బాయ్‌కి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలోని విజయనగర్ పోలీసులు షాకింగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. అదేంటంటే, ఫుడ్ డెలివరీ చేసే 22 ఏళ్ల జై హల్దే అనే కుర్రాడు రోజంతా సైకిల్‌పై నగరంలో తిరుగుతూ ఫుడ్ డెలివరీ చేస్తుంటాడు. అతడి కష్టాన్ని మరియు కుటుంబాన్ని పోషించేందుకు అతడు చేస్తున్న కృషిని గుర్తించిన పోలీసులు అతడికి ఓ బైక్‌ను గిఫ్ట్ గా ఇచ్చారు.

సైకిల్‌పై ఫుడ్ డెలివరీ చేస్తున్న వ్యక్తిని చూసి చలించిపోయిన పోలీసులు.. చందాలు వేసుకొని కొత్త బైక్ గిఫ్ట్..!

జై హల్దే ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. పొట్టకూటి కోసం అతడు ఫుడ్ డెలివరీ బాయ్ అవతారం ఎత్తాడు. అయితే, ఇతర ఫ్యాన్సీ ఫుడ్ డెలివరీ బాయ్స్ మాదిరిగా అతని వద్ద ఎలాంటి మోటార్‌సైకిల్ కానీ లేదా స్కూటర్ కానీ లేదు. కాబట్టి, సిటీలో ఎంత దూరమైనా సరే సైకిల్ పైనే ప్రయాణించి ఫుడ్ పికప్ మరియు డెలివరీ చేస్తుంటాడు. అతడికి బైక్ కొనుక్కోనే ఆర్థిక స్థోమత లేదు, వచ్చిన సంపాదనతో కుటుంబ పోషణ కూడా చూసుకోవాలి కాబట్టి, బైక్ కోసం ఈఎమ్ఐలు చెల్లించే స్థితిలో జై హల్దే లేడు.

సైకిల్‌పై ఫుడ్ డెలివరీ చేస్తున్న వ్యక్తిని చూసి చలించిపోయిన పోలీసులు.. చందాలు వేసుకొని కొత్త బైక్ గిఫ్ట్..!

అయితే, ఓ రోజు జై హల్దే సైకిల్ పై ఫుడ్ డెలివరీ చేస్తుండటాన్ని విజయ్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి తహజీబ్ ఖాజీ చూశాడు. అతడ్ని పక్కకు పిలిచి, వివరాలు తెలుసుకున్నాడు. జై హల్దే అతి వేగంతో సైకిల్ తొక్కుతూ ఆహార పొట్లాలను తీసుకుని వెళ్ళడం పోలీస్ బాస్ కంటపడింది. ఇలా ఎందుకు చేస్తున్నావని జై హల్దేని ప్రశ్నించగా, తన కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేదని, మోటార్ సైకిల్ కొనడానికి తన వద్ద డబ్బు లేదని జై హల్దే పోలీసులకు తెలిపాడు. జై హల్దే కుటుంబ పరిస్థితి గురించి విని, చలించిపోయిన పోలీసులు అతడికి ఏదైనా సాయం చేయాలనుకున్నారు.

సైకిల్‌పై ఫుడ్ డెలివరీ చేస్తున్న వ్యక్తిని చూసి చలించిపోయిన పోలీసులు.. చందాలు వేసుకొని కొత్త బైక్ గిఫ్ట్..!

అనుకున్నదే తడవుగా, పోలీస్ బాస్ తన స్టేషన్ సిబ్బందితో ఓ మీటింగ్ పెట్టి, ఈ ఫుడ్ డెలివరీ బాయ్ కి బైక్ కొనడం కోసం విరాళాలు సేకరించాడు. ఇలా సేకరించిన విరాళాలతో సమీపంలోని ఓ హీరో మోటోకార్ప్ షోరూమ్‌లో డౌన్‌ పేమెంట్ చెల్లించి జై హల్దే కోసం ఓ హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (Hero HF Delux) మోటర్‌సైకిల్‌ను బుక్ చేశారు. ఆ తర్వాత ఆ బైక్‌ను అతడిగి గిఫ్ట్ గా అందజేశాడు. మోటార్‌సైకిల్ అందుకున్న ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిన జై హల్దే, మిగిలిన వాయిదాలను తానే చెల్లిస్తానని చెప్పాడు.

సైకిల్‌పై ఫుడ్ డెలివరీ చేస్తున్న వ్యక్తిని చూసి చలించిపోయిన పోలీసులు.. చందాలు వేసుకొని కొత్త బైక్ గిఫ్ట్..!

సైకిల్ పై వేగంగా వెళ్లలేకపోవడం మరియు ఎక్కువ దూరం ప్రయాణించలేక పోవడం వంటి కారణాల వలన తాను చాలా తక్కువ మొత్తంలోనే డబ్బు సంపాధించే వాడినని, అయితే, పోలీసులు అందించిన మోటార్‌సైకిల్‌ కారణంగా తాను మరిన్ని ఫుడ్ ఆర్డర్లను డెలివరీ చేసి మంచి డబ్బు సంపాదిస్తున్నానని జై చెప్పుకొచ్చాడు. ఇంతకుముందు సైకిల్ ద్వారా తాను రోజుకి 6 నుంచి 8 ఫుడ్ ఆర్డర్లను మాత్రమే డెలివరీ చేసేవాడినని, ఇప్పుడు మోటార్‌సైకిల్ వచ్చిన తర్వాత 15-20 ఫుడ్ ఆర్డర్లను డెలివరీ చేస్తున్నానని చెప్పాడు. ఈ సందర్భంగా తనకు సాయం చేసిన పోలీసులకు అతను కృతజ్ఞతలు తెలియజేశాడు.

హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (Hero HF Delux) బైక్ గురించి క్లుప్తంగా..

హీరో హెచ్ ఎఫ్ డీలక్స్ విషయానికి వస్తే, ఇది దేశపు నెంబర్ వన్ టూవీలర్ బ్రాండ్ హీరో మోటోకార్ప్ అందిస్తున్న ఎంట్రీ లెవల్ కమ్యూటర్ మోటార్‌సైకిల్. పవర్, పెర్ఫార్మెన్స్‌లో రాజీ పడకుండా మెరుగైన మైలేజీని అందించేలా కంపెనీ రూపొందించిన బడ్జెట్ మోటార్‌సైకిల్ ఇది. సింపుల్ బాడీ గ్రాఫిక్స్, అల్లాయ్ వీల్స్ మరియు ట్యూబ్ లెస్ టైర్స్, సెల్ఫ్ స్టార్ట్, రియర్ గ్రాబ్ రెయిల్, 9.6-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్, అప్ రైట్ హ్యాండిల్ బార్, సింగిల్ పీస్ సీట్, హాలోజెన్ హెడ్ ల్యాంప్, టెయిల్ ల్యాంప్స్, టర్న్ ఇండికేటర్లు, హెడ్ ల్యాంప్ కౌల్ ఇంటిగ్రేటెడ్ వైజర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

సైకిల్‌పై ఫుడ్ డెలివరీ చేస్తున్న వ్యక్తిని చూసి చలించిపోయిన పోలీసులు.. చందాలు వేసుకొని కొత్త బైక్ గిఫ్ట్..!

అంతేకాకుండా, ఇందులో క్రాష్ ప్రొటెక్టర్లు, ఫుల్ కన్సీల్డ్ చెయిన్ కవర్, ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనక వైపు నాన్ అడ్జస్టబుల్ షాక్ అబ్జార్బర్లు, 130 మిమీ డ్రమ్ బ్రేకులు, అదనపు సేఫ్టీ కోసం కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టం (సిబిఎస్) వంచటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇంజన్ విషయానికి వస్తే, ఇది 97 సిసి ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్ ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 7.9 బిహెచ్‌పి శక్తిని మరియు 8.05 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 4-స్పీడ్ గేర్ బాక్ జతచేయబడి ఉంటుంది. ఇందులోని ఐ3ఎస్ స్టార్ట్-స్టాప్ ఫీచర్ కారణంగా మెరుగైన మైలేజీ లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, May 3, 2022, 17:52 [IST]
English summary
Indore police gifts a motorcycle to food delivery boy details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+