కరోనా ఎఫెక్ట్: 700 మందికి పైగా అరెస్ట్.. ఎక్కడో తెలుసా?

భారతదేశంలో కరోనా మహమ్మారి అంతకంతకూ పెరిగిపోవడం వల్ల ఎంతో మంది మృత్యువాత పడ్డారు. అంతే కాకుండా ఎంతో మంది ప్రజలు ఈ వైరస్ ప్రభావం వల్ల చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ క్లిష్ట పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కఠినమైన చర్యలతో కరోనా నివారణకు లాక్ డౌన్ ప్రకటించారు.

కరోనా ఎఫెక్ట్: 700 మందికి పైగా అరెస్ట్.. ఎక్కడో తెలుసా?

మనదేశంలో ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలులో ఉంది. ఇందులో భాగంగానే గత శుక్రవారం నుండి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మొత్తం లాక్‌డౌన్ అమలు చేయబడింది. లాక్‌డౌన్ సమయంలో ప్రభుత్వాలు సూచించిన నిబంధనలు తప్పకుండా పాటించాలి, లేకుంటే వారిపై చర్యలు తీసుకోబడతాయి.

కరోనా ఎఫెక్ట్: 700 మందికి పైగా అరెస్ట్.. ఎక్కడో తెలుసా?

ఇండోర్ నగరంలో కర్ఫ్యూ విధించడం వల్ల జనసంచారం లేకుండా నిర్మానుష్యంగా మారింది. ఈ కర్ఫ్యూని కొంతమంది పాటిస్తున్నారు, మరికొంతమంది అనవసరంగా బయటకు వస్తున్నారు. అత్యవసరం తప్ప అనవసరంగా బయటకు రాకూడదనే నియమం ఉంది. కానీ ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు.

MOST READ:రైతులకు గుడ్ న్యూస్.. ట్రాక్టర్ కావాలంటే ఫ్రీగా వాడుకోవచ్చు.. ఎక్కడంటే?

కరోనా ఎఫెక్ట్: 700 మందికి పైగా అరెస్ట్.. ఎక్కడో తెలుసా?

నివేదికల ప్రకారం లాక్ డౌన్ ఉల్లంఘించిన దాదాపు 700 మందికి పైగా జైలు పాలయ్యారు. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిని శిక్షించడానికి ఇండోర్‌లో తాత్కాలిక జైలును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అనవసరంగా బయటకు వచ్చేవారిని ఈ జైలులో ఉంచుతారు.

కరోనా ఎఫెక్ట్: 700 మందికి పైగా అరెస్ట్.. ఎక్కడో తెలుసా?

ఒకే రోజులో కరోనా లాక్ డౌన్ ఉల్లంఘించిన 700 మందిని పోలీసులు అరెస్ట్ చేయడం ఇదే మొదటిసారి.అరెస్ట్ చేసిన వారి వాహనాలు కూడా పోలీసులు జప్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎన్ని వాహనాలు జప్తు చేశారన్న విషయం ఖచ్చితంగా తెలియదు.

MOST READ:భారత్‌లో విడుదలైన 2021 జిఎల్‌ఎ & ఎఎమ్‌జి జిఎల్‌ఎ 35; ధర & వివరాలు

కరోనా ఎఫెక్ట్: 700 మందికి పైగా అరెస్ట్.. ఎక్కడో తెలుసా?

కరోనా లాక్ డౌన్ సమయంలో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి కేక్‌తో వచ్చిన వ్యక్తి వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో ఒకే రోజు వేలాది మంది వాహనదారులపై పోలీసులు చర్యలు తీసుకున్నట్లు కూడా చెబుతున్నారు.

కరోనా ఎఫెక్ట్: 700 మందికి పైగా అరెస్ట్.. ఎక్కడో తెలుసా?

భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో పోలీస్ బలగాలు ఎక్కువగా మోహరించాయి. ఈ మహమ్మారిని నివారించడానికి దాదాపు చాలా ప్రాంతాలలో పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. కరోనావైరస్ వైరస్ సెకండ్ వేవ్ భారతదేశంలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ వల్ల ప్రతిరోజూ 2 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.

MOST READ:ప్రమాదంలో రెండు ముక్కలైన 5 స్టార్ రేటింగ్ పొందిన కారు; పూర్తి వివరాలు

కరోనా ఎఫెక్ట్: 700 మందికి పైగా అరెస్ట్.. ఎక్కడో తెలుసా?

ప్రస్తుతం దేశంలో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటకతో సహా వివిధ ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమలు చేయబడింది. పొరుగున ఉన్న తమిళనాడులో కూడా ప్రస్తుతం కరోనా మహమ్మారి గుప్పెట్లో ఉంది. తమిళనాడులో కరోనా కేసులు ఎక్కువ రావడానికి కారణమా పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోకపోవడం అని ఆరోపణలు వస్తున్నాయి.

కరోనా ఎఫెక్ట్: 700 మందికి పైగా అరెస్ట్.. ఎక్కడో తెలుసా?

తమిళనాడు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడం లేదని, ప్రజలు అవసరం నుండి బయటపడుతున్నారు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు అక్కడి పోలీసులకు చాలా ఇబ్బంది కలిగించాయి. ఇప్పుడు అప్రమత్తమైన తమిళనాడు పోలీసులు సరైన కారణం లేకుండా బయటకు వచ్చే వాహనాలను జప్తు చేస్తున్నారు.

MOST READ:లాక్‌డౌన్ ఉన్నా.. అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి.. అయితే భూమ్మీద కాదు.. మరెక్కడనుకుంటున్నారా?

కరోనా ఎఫెక్ట్: 700 మందికి పైగా అరెస్ట్.. ఎక్కడో తెలుసా?

పోలీసులు ఈ కఠినమైన చర్యలు తీసుకోవడం వల్ల, రాబోయే రోజుల్లో కొత్త కరోనా సంక్రమణ కేసులు తగ్గించడానికి వీలుగా ఉంటుంది. కానీ ప్రజలు కూడా ప్రభుత్వాలను సహకరించి అత్యవసర పరిస్థితిలో తప్ప ఇతర సమయంలో బయటకు రాకుండా ఉండాలి.

Most Read Articles

English summary
Indore Police Sent More Than 700 People To Jail For Violating Lockdown Norms. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X