ఇండియన్ నేవీకి మరింత బలాన్ని చేకూర్చే INS కల్వరి గురించి ఆసక్తికరమైన విషయాలు

దేశవాళీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన పూర్తి స్థాయి మేడిన్ ఇండియా జలాంతర్గామి ఐఎన్‌ఎస్ కల్వరి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవాళ్టి కథనంలో...

By Anil

సుధీర్ఘ చరిత్రను కలిగిన భారత నావికా దళం ఆధునిక ప్రపంచంలో రోజురోజుకీ కొత్త పరిజ్ఞానంతో తన బలాన్ని పెంచుకుంటోంది. దీనికి తోడు మరింత శక్తివంతమైన యుద్ధ వాహనాలను ఇండియన్ నేవీలోకి చేర్చుకుంటోంది.

ఐఎన్ఎస్ కల్వరి జలాంతర్గామి

అందులో ఒకటి ఐఎన్ఎస్ కల్వరి స్కార్పిన్ క్లాస్ సబ్‌మెరైన్. నేవీ అనగా గుర్తొచ్చేవి నౌకలు, జలాంతర్గాములు. ఒక విధంగా చెప్పాలంటే నేవీ మొత్తం బలం ఈ వాహనాల్లోనే ఉంటుంది. అందుకోసం ఇండియన్ నేవీ అత్యంత శక్తివంతమైన అధునాతన స్కార్పీన్ శ్రేణికి చెందిన ఐఎన్ఎస్ కల్వరీ సబ్‌మెరైన్‌ను తనలో చేర్చుకుంది.

Recommended Video

This McLaren 720S Costs Only 30 Bitcoins While Others Cost $285,000
ఐఎన్ఎస్ కల్వరి జలాంతర్గామి

ఇండియన్ నేవీలో ఇప్పటి వరకు ఉన్న జలాంతర్గాములతో పోల్చుకుంటే ఐఎన్ఎస్ కల్వరి ఎంతో విశిష్టమైనది. దేశవాళీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన పూర్తి స్థాయి మేడిన్ ఇండియా జలాంతర్గామి ఐఎన్‌ఎస్ కల్వరి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవాళ్టి కథనంలో...

ఐఎన్ఎస్ కల్వరి జలాంతర్గామి

మోడీ గారి మేకిన్ ఇండియా పిలుపులో భాగంగా భారత రక్షణ వ్యవస్థ ఈ ఐఎన్ఎస్ కల్వరి సబ్‌మెరైన్‌ను పూర్తిగా ఇండియాలోనే తయారు చేసింది. ఇండియన్ నేవీ ప్రాజెక్ట్-75లో భాగంగా ముంబాయ్‌లోని మజగావ్ డాక్ లిమిటెడ్ స్కార్పిన్ శ్రేణికి చెందిన ఆరు జలాంతర్గాములను నిర్మించతలపెట్టింది.

  • రాయల్ ఎన్ఫీల్డ్ సైలెన్సర్లను రోడ్ రోలరుతో తొక్కించిన పోలీసులు
  • ఐఎన్ఎస్ కల్వరి జలాంతర్గామి

    అందులో ఒకటి ఇప్పుడు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించడానికి ఇండియన్ నేవీలో చేరగా, మిగిలిన ఐదు సబ్‌మెరైన్‌లను 2020 నాటికి భారత నౌకాదళానికి అప్పగించనుంది.

    ఐఎన్ఎస్ కల్వరి జలాంతర్గామి

    ప్రస్తుతం రష్యాకు చెందిన కిలో క్లాస్ వెసెల్స్ మరియు జర్మన్ హెచ్‌డిడబ్ల్యూ వంటి కేవలం 15 సబ్‌మెరైన్‌లు మాత్రమే భారత్ వద్ద ఉన్నాయి. చైనా వీటికి నాలుగు రెట్లు అధిక సంఖ్యలో శక్తివంతమైన సబ్‌మెరైన్‌లను కలిగి ఉంది.

    ఐఎన్ఎస్ కల్వరి జలాంతర్గామి

    సుమారుగా 3 బిలియన్ డాలర్లను వెచ్చించి ఆరు స్కార్పియన్ తరగతికి చెందిన అధునాతన సబ్‌మెరైన్‌లను ఇండియన్ నేవీలోకి చేర్చనున్నారు. వీటిలో మొదటి సబ్‌మెరైన్‌ నేవీలో చేరిపోయింది. మొదటి ఐఎన్‌ఎస్ కల్వరి నిర్మాణం డిసెంబరు 2006లో ప్రారంభమయ్యింది.

    ఐఎన్ఎస్ కల్వరి జలాంతర్గామి

    ఇండియన్ నేవీలో ఐఎన్ఎస్ కల్వరి అత్యాధునిక అణ్వస్త్ర రహిత సబ్‌మెరైన్. ఇందులో సైలంట్ డీజల్-ఎలక్ట్రిక్ మోటార్ ఉంది. దీంతో సముద్రం గర్భంలో దీనిని గుర్తించడం చాలా కష్టతరం అవుతుంది.

    ఐఎన్ఎస్ కల్వరి జలాంతర్గామి

    ఈ సబ్‌మెరైన్‌లో అత్యంత బరువైన టార్పిడోస్ మరియు ఎక్సోసెట్ యాంటి షిప్ మిస్సైల్స్ ఉన్నాయి. సముద్రం గర్బం నుండి లేదా సముద్రం ఉపరితలం నుండి మిస్సైళ్లను ప్రయోగించే సామర్థ్యం ఇందులో ఉంది.

    ఐఎన్ఎస్ కల్వరి జలాంతర్గామి

    ఐఎన్ఎస్ కల్వరి జలాంతర్గామి మొత్తం పొడవు 67.5 మీటర్లు మరియు ఎత్తు 12.3 మీటర్లుగా ఉంది.

    ఐఎన్ఎస్ కల్వరి జలాంతర్గామి

    కల్వరి సబ్‌మెరైన్‌ యొక్క హృదయాన్ని SUBTICS అనే ఆయుధ వ్యవస్థగా చెప్పుకోవచ్చు. సబ్‌మెరైన్ టాక్టికల్ ఇంటిగ్రేటెడ్ కంబాట్ సిస్టమ్(SUBTIC) సోనార్ల నుండి సమాచారాన్ని సేకరించి ప్రాసెస్ చేసి, శత్రు లక్ష్యాలను గుర్తించి వాటి మీదకు ట్రొపెడోస్ మరియు మిస్సైళ్లను ప్రయోగించగలదు.

    ఐఎన్ఎస్ కల్వరి జలాంతర్గామి

    యుద్ధ సమయంలో మరియు దాడులు జరిగేటపుడు సముద్రం ఉపరితలం నుండి శత్రు లక్ష్యాలను గుర్తించి, వీక్షించేందుకు ఇందులో అత్యాధునిక ఇన్‌ఫ్రారెడ్/లో లైట్ కెమెరాలు గల పెరిస్కోప్ కలదు.

    ఐఎన్ఎస్ కల్వరి జలాంతర్గామి

    ప్రాజెక్ట్-75 లో భాగంగా రూపొందుతున్న రెండవ జలాంతర్గామి ఐఎన్ఎస్ ఖండేరి. ప్రస్తుతం ఇది ప్రయోగాత్మక దశలో ఉంది. దీనిని కూడా అతి త్వరలో ఇండియన్ నేవీలోకి చేర్చనున్నారు.

    ఐఎన్ఎస్ కల్వరి జలాంతర్గామి

    కల్వరి అనగా మళయాలంలో టైగర్ షార్క్ అని అర్థం. చురుకుతనం, ధృడత్వం మరియు అద్భుతమైన పరాక్రమానికి ప్రతీకగా దీనికి కల్వరి అనే పేరు పెట్టారు.

    ఐఎన్ఎస్ కల్వరి జలాంతర్గామి

    ఇండియన్ నేవీ మొట్టమొదటి నేవీకి కూడా ఐఎన్ఎస్ కల్వరి అనే పేరునే పెట్టారు. దీనిని 1967 డిసెంబరులో భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. అణు దాడులు మరియు ఖండాతర మిస్సైళ్లను ప్రయోగించే సామర్థ్యం ఉన్న సబ్‌మెరైన్‌లను ఇండియన్ ఆర్మీ గత 50 సంవత్సరాలుగా ఉపయోగిస్తూ వస్తోంది.

    ఏదేమైనప్పటికీ దేశ రక్షణలో భాగంగా ఇండియన్ నేవీ అత్యాధునిక జలాంతర్గాములను చేర్చుకుని మరింత బలాన్ని పెంచుకుంటోంది.

Most Read Articles

English summary
Read In Telugu: INS kalvari scorpene class submarine joins indian navy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X