తొలి సంపాదన రూ.4లక్షలు.. ఇప్పుడు ఒక్క సినిమాకు రూ.60కోట్లు.. ఎన్టీఆర్ గ్యారేజీలో కోట్ల విలువైన కార్లు

సినీ సెలబ్రిటీల లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. ఒకప్పుడు తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న నటుడు, ఇప్పుడు ప్రైవేట్ జెట్‌తో పాటు కోట్లాది రూపాయల కార్లతో ఎలా జీవిస్తున్నాడు.

కేవలం ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారి, తన సంపదను పదింతలు పెంచుకున్నాడు.. అతడే జూ.ఎన్టీఆర్. కేవలం 4 లక్షల మొదటి శాలరీ నుంచి 60 కోట్ల రెమ్యునరేషన్ వరకు ఎన్టీఆర్ ఎదిగిన తీరు, ఆయన లగ్జరీ కార్ల కలెక్షన్, ప్రైవేట్ జెట్ వివరాలను తెలుసుకుందాం.

Jr NTR Cars

ఒక నటుడి కెరీర్ ఒక్క సినిమాతో ఎలా మారిపోతుందో తెలుసుకునేందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. 'బాహుబలి'తో ప్రభాస్, 'కేజీఎఫ్'తో యష్ పాన్ ఇండియా స్టార్లు అయ్యారు. అదే విధంగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి 'RRR'సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లను గ్లోబల్ స్టార్‌లుగా మార్చారు. 'RRR'కు ముందే జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్‌లో టాలీవుడ్‌లో కొన్ని హిట్‌లు వచ్చాయి. అయితే, 'RRR'కు ఆస్కార్ రావడంతో ఎన్టీఆర్, చరణ్‌లకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది.

ఇటీవల మే 20న జూనియర్ ఎన్టీఆర్ తన 42వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా YRF స్పై యూనివర్స్‌లో 'వార్ 2' సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా 'వార్ 2' టీజర్ కూడా విడుదలైంది. ఎన్టీఆర్ పుట్టినరోజున ఆయనకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వార్తలు కూడా బయటపడ్డాయి.

Jr NTR Cars

బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన 'యంగ్ టైగర్', హీరోగా చేసిన మొదటి సినిమా 'నిన్ను చూడాలని' కోసం కేవలం 4 లక్షల రూపాయల పారితోషికం మాత్రమే అందుకున్నారు. ఇప్పుడు 'వార్ 2' సినిమా కోసం ఆయన 60 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారంటే ఒక నటుడిగా ఆయన ఎంత ఎదిగారో అర్థం చేసుకోవచ్చు.

తెలుగు తేజం ఎన్టీఆర్ మనవడిగా ఎన్టీఆర్ పుట్టుకతోనే సిల్వర్ స్పూన్‎తో పుట్టాడని చెప్పొచ్చు. వారసత్వంగా వచ్చిన ఆస్తులతో పాటు ఆయన సొంతంగా కోట్లాది రూపాయలు సంపాదించారు. అందులో పెద్ద మొత్తాన్ని కార్లు కొనుగోలు చేయడానికే ఖర్చు చేశారు. తెలుగు సూపర్ స్టార్ గ్యారేజీలోని కొన్ని అద్భుతమైన కార్లను ఇప్పుడు చూద్దాం.

Jr NTR Cars

ఈ జాబితాలో మొదటిది జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ అల్ట్రా లగ్జరీ బ్రాండ్ మేబాచ్ నుంచి వచ్చిన S580. భారతదేశంలో మెర్సిడెస్ బెంజ్ విక్రయించే అత్యంత ఖరీదైన కార్లలో ఇది ఒకటి. ప్రస్తుతం దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.2.70కోట్లు. ఇది 48V మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌తో కూడిన 4 లీటర్ V8 ట్విన్-టర్బోచార్జ్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. అల్ట్రా లగ్జరీ కార్లలో ఉండాల్సిన అన్ని ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

తరువాత జాబితాలో లంబోర్ఘిని ఉరుస్ ఉంది. ఇటాలియన్ బ్రాండ్ నుంచి వచ్చిన మొదటి స్పోర్ట్ యుటిలిటీ వెహికల్ అయిన ఉరుస్ సెలబ్రిటీలలో చాలా పాపులర్. ఎన్టీఆర్ వద్ద ఉన్న మేబాచ్ కంటే ఈ లంబోర్ఘిని ధర ఎక్కువ. ఎన్టీఆర్ గ్యారేజీలో ఉన్న అత్యంత ఖరీదైన కారు కూడా ఇదే.

Jr NTR Cars

4 లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V8 పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే ఈ మోడల్‌లో అనేక కంఫర్ట్ ఫీచర్లు ఉన్నాయి. దాదాపు రూ.5 కోట్ల విలువైన ఉరుస్ కారు రిజిస్ట్రేషన్ నంబర్ కోసం ఎన్టీఆర్ రూ.17 లక్షలు ఖర్చు చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ సొంతమైన మరో జర్మన్ మోడల్ BMW 7 సిరీస్. ఈ కారు డీజిల్ వేరియంట్‌ను ఎంచుకున్నారు. ఈ లగ్జరీ కారు బవేరియన్ బ్రాండ్ మార్కెట్‌లో రూ.1.84 కోట్ల ఎంఎక్స్-షోరూమ్ ధరతో విక్రయిస్తోంది. BW 7-సిరీస్ లగ్జరీ సెడాన్‌లో లేటెస్ట్ టెక్నాలజీ, సేఫ్టీ ఫీచర్లను కంపెనీ అందిస్తోంది.

ఇటీవలి కాలంలో సెలబ్రిటీలు పోటీపడి కొంటున్న భారతదేశంలోని అత్యంత ఖరీదైన ఎంపీవీలలో ఒకటి టయోటా వెల్ఫేర్. దాదాపు 5 మీటర్ల పొడవు, 1.85 మీటర్ల వెడల్పు ఉన్న ఈ కారు లోపల ఫస్ట్ క్లాస్ విమాన ప్రయాణం లాంటి సౌకర్యాలు ఉన్నాయి. ప్రస్తుతం దీని ధర 1.22 కోట్ల నుంచి 1.32 కోట్ల రూపాయల వరకు ఉంది.

ఇవి కాకుండా, జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ రోవర్ వోగ్ (Range Rover Vogue) అనే ఖరీదైన కారును కూడా కలిగి ఉన్నారు. అలాగే, హ్యుందాయ్ అయోనిక్ 5 (Hyundai Ioniq 5) అనే ఎలక్ట్రిక్ కారును సొంతం చేసుకోవడం ద్వారా ఈవీల పట్ల ఆయనకున్న ఆసక్తిని కూడా చూపారు. నివేదికల ప్రకారం, ఎన్టీఆర్ ఆస్తి 500 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. \

అంతేకాదు, 80 కోట్ల రూపాయల విలువైన ఒక ప్రైవేట్ జెట్ కూడా ఆయనకు సొంతంగా ఉందని తెలుస్తోంది. కొత్త సినిమాల కోసం భారీ పారితోషికం తీసుకుంటున్న ఎన్టీఆర్ భవిష్యత్తులో తన గ్యారేజీని మరింత విస్తరించే అవకాశం లేకపోలేదు.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, May 23, 2025, 17:50 [IST]
English summary
Inside jr ntrs lavish life private jet and multi crore car collection
Read more on: #offbeat #india #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+