రీల్స్ చేస్తూ Lamborghini కారు కొన్న జంట - వీడియో వైరల్
మనసుంటే మార్గం ఉంటుందని ఇప్పటికే ఎంతోమంది నిరూపించారు. మరో సారి ఈ మాటను నిజం చేస్తూ ఓ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ జంట తనకు నచ్చిన ఖరీదైన ఇటాలియన్ కారు కొనేసారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోందో.
నిజానికి చాలామందికి ఓ మంచి ఖరీదైన కారు కొనాలని, అందులో తిరగాలని ఉంటుంది. అయితే ఇది అందరికి సాధ్యమయ్యే పని కాదు, ప్రయత్నిస్తే అసాధ్యం కానేకాదు. ఇటీవల ఓ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ జంట కోట్ల రూపాయల విలువ చేసే ఓ లంబోర్ఘిని (Lamborghini) కారును కొనుగోలుకే చేశారు. దీనికి సంబంధించిన వీడియో కీర్తి సింగ్ రహేజా మరియు రోహిత్ రహేజా తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు.

వీడియోలో గమనించినట్లయితే ఆ జంట లంబోర్ఘిని షోరూమ్‌కు చేరుకోవడం, అక్కడ కేక్ కట్ చేయడం, కారును డెలివరీ తీసుకోవడం, చివరికి కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం చూడవచ్చు. ఇక్కడ కనిపించే కారు 'లంబోర్ఘిని ఉరుస్ పర్ఫార్మంటే' (Lamborghini Urus Performante) అని తెలుస్తోంది. చూడటానికి ఆకర్షణీయంగా ఉండే ఈ కారు అద్భుతమైన పెయింట్ స్కీమ్ పొంది ఉండటం కూడా ఇక్కడ గమనించవచ్చు.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. వేలమంది వీక్షించిన ఈ వీడియోపై కొందరు తమదైన రీతిలో అభినందనలు చెబుతున్నారు. ఈ ఖరీదైన కారు కొన్న ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఆసక్తికరమైన రీల్స్ చేస్తూ లెక్కకు మించిన ఫాలోవర్స్ పొంది ఉన్నారు. వీరు ప్రధానంగా లైఫ్ స్టైల్, ఫ్యాషన్, లగ్జరీ, ట్రావెల్ వంటి వాటికి సంబంధించిన అంశాల మీద రీల్స్ చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

లంబోర్ఘిని ఉరుస్ పర్ఫార్మంటే
లంబోర్ఘిని కంపెనీకి చెందిన ఉరుస్ పర్ఫార్మంటే ధర రూ. 4.22 కోట్లతో ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఈ కారు దాని మునుపటి మోడల్ కంటే కూడా అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో ఫ్రంట్ బంపర్ మరియు రియర్ బంపర్ వంటివి రీడిజైన్ మాత్రం కాకుండా కొంత కాస్మొటిక్ అప్డేట్స్ పొందినట్లు ఇక్కడ గమనించవచ్చు. అల్లా వీల్స్ డిజైన్ కూడా మునుపటి కంటే భిన్నంగా కొంత ప్రత్యేకంగా కనిపిస్తుంది.
ఇంటీరియర్ డిజైన్ కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. డ్యాష్ బోర్డు, స్టీరింగ్ వీల్, రూప్ లైనర్ వంటివి బ్లాక్ ఆల్కాంటారా మెటీరియర్ పొందింది. ఈ కారు 4.0-లీటర్ ట్విన్-టర్బో ఛార్జ్డ్ వీ8 ఇంజిన్ కలిగి 6000 rpm వద్ద 666 హార్స్ పవర్ మరియు 2250 - 4500 rpm వద్ద 850 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ద్వారా నాలుగు చక్రాలను పవర్ డెలివరీ చేస్తుంది.
కేవలం 3.3 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వరకు వేగవంతమయ్యే ఈ కారు 11.5 సెకన్లలో 220 కిమీ/గం వేగాన్ని చేరుకుంటుంది. ఈ SUV గరిష్ట వేగం 308 కిమీ/గం. ఇందులో సబ్బియా (sand), నీవ్ (స్నో) మరియు టెర్రా (మడ్) అనే డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. అద్భుతమైన పనితీరుని అందించే ఈ లంబోర్ఘిని కారును పలువురు సెలబ్రిటీలు / ప్రముఖులు ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తుంటారు.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








