హైవేపై అందంగా రీల్ చేసిన చిన్నది: కట్ చేస్తే రూ. 17,000 ఫైన్.. కారణం మాత్రం ఇదే
పురాణాల్లో మనం నాలుగు యుగాలు ఉన్నట్లు చదువుకున్నాం.. అయితే ప్రస్తుతం 'సోషల్ మీడియా యుగం' నడుస్తోంది. ప్రతి చిన్న విషయమూ సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. దీనికి తగ్గట్టుగానే యువత కూడా ప్రవర్తిస్తున్నారు. సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడానికి విశ్వప్రయత్నాలు చేస్తుంటారు, ఈ క్రమంలో కొన్ని ఇబ్బందుల్లో ఇరుక్కుంటున్నారు.
ఇటీవల ఒక యువతి సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడానికి చేసిన ప్రయత్నం తనను ఇబ్బందుల్లోకి నెట్టేసేంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లో జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి ఈ వీడియోలో ఒక యువతీ నేషనల్ హైవే మీద కారుని ఆపి రీల్ చేయడానికి ఫోజులివ్వడం చూడవచ్చు. అతి తక్కువ కాలంలోనే ఇది తెగ వైరల్ అయిపోయింది.

ఘజియాబాద్‌లో ఎలివేటెడ్ హైవే మీద యువతీ రీల్ చేసి దానిని 'వైశాలి చౌదరి ఖుటైల్' అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది. అయితే ఈ చిన్న వీడియోని పది వేలకంటే కూడా ఎక్కువ మంది వీక్షించారు. కొంత మంది ఈ వీడియోపై కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఈ వీడియో పోలీసుల దృష్టిలో కూడా పడింది. ఈ వీడియో చూసిన పోలీసులు ఆ యువతికి ఏకంగా రూ. 17,000 జరిమానా విధించారు.
నిజానికి ఎప్పుడు రద్దీగా ఎప్పుడూ వచ్చి పోయే వాహనాలతో ఉండే హైవే మీద ఇలాంటి రీల్స్ చేయడం చట్టరీత్యా నేరం. కావున పోలీసులు ఆ యువతీ చేసిన ఈ పనికి భారీ జరిమానా విధించారు. హైవేల మీద ఇలా చేయడం నేరం మాత్రమే కాదు ప్రమాదం కూడా. ఆ యువతికి జరిమానా విధించడానికి సంబంధించిన వీడియో కూడా పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
వైశాలికి ఇన్‌స్టాగ్రామ్ లో దాదాపు 653 వేల మంది పాలొవర్స్ ఉన్నారు. ఇలాంటి సంఘటనలు జరగటం ఇదే మొదటి సారి కాదు, గతంలో కూడా ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా జరిగాయి. గతంలో కూడా సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడానికి కొంత మంది యువత రోడ్ల మీద రీల్స్ వంటివి చేసి ఇబ్బందుల్లో పడ్డారు. హైవేల మీద మాత్రమే కాకుండా కొంతమంది యువకులు ట్రాఫిక్ సిగ్నెల్స్ దగ్గర కూడా డ్యాన్స్ చేసిన సంఘటనలను గురించి కూడా గతంలో తెలుసుకున్నాం.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియాలో ఆ యువతి రోడ్డుకి ఒక వైపు కారుని ఆపింది, అయితే ఆ కారు వెనుక కార్లు రావడం కూడా చూడవచ్చు. ఇందులో మనకు రెడ్ కలర్ మారుతి స్విఫ్ట్ కనిపిస్తుంది. ఒక వేళా ఈ సమయంలో ఏదైనా పెద్ద వెహికల్ వేగంగా వచ్చి ఆ కారుని ఢీ కొట్టి ఉంటే అనుకోని పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. అదృష్టవశాత్తు అలంటి ప్రమాదం ఏమి జరగలేదు. అయినప్పటికీ ఇది చట్టరీత్యా నేరం కాబట్టి పోలీసులు చర్యలు తీసుకోవడం జరిగింది.

సోషల్ మీడియాలో వెల్లడయ్యే ఇలాంటి సంఘటనల మీద పోలీసులు తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి. అలా తీసుకోకుండా వదిలేస్తే మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతాయి. కావున వీటిపైన చర్యలు తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. నివేదికల ప్రకారం ప్రతి సంవత్సరం భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం శతవిధాలుగా ప్రయత్నిస్తూనే ఉంది.
రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మోటార్ వాహన చట్టాలను మరింత కఠినతరం చేశాయి. ఇందులో భాగంగానే ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారికి భారీ జరిమానాలు కూడా విధిస్తున్నారు. ఇవన్నీ కూడా దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తప్పకుండా తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నాము. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్' చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








