సరైన వాహన రిజిస్ట్రేషన్ లేకపోతే బీమా క్లెయిమ్ రాదు: సుప్రీం కోర్టు

వెహికల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ విషయంలో సుప్రీం కోర్టు ఓ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఇకపై, ఏదైనా వాహనం యొక్క రిజిస్ట్రేషన్ చెల్లుబాటు కాకపోయినట్లయితే, సదరు వాహనానికి బీమా అందించే కంపెనీలు కస్టమర్లు చేసే క్లెయిమ్‌ను తిరస్కరించవచ్చని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది.

సరైన వాహన రిజిస్ట్రేషన్ లేకపోతే బీమా క్లెయిమ్ రాదు: సుప్రీం కోర్టు

వాహనం రిజిస్ట్రేషన్ చెల్లుబాటు కాకపోతే, అది ప్రాథమిక నియమాల ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. ఈ పరిస్థితిలో, సదరు వాహన యజమాని వాహనం యొక్క బీమాను క్లెయిమ్ చేస్తే, అది చెల్లదని కోర్టు పేర్కొంది. సెప్టెంబర్ 30 న ఓ వాహన దొంగతనానికి సంబంధించిన బీమా క్లెయిమ్ కోసం వచ్చిన పిటిషన్ ను విచారించిన సందర్భంగా సుప్రీం కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.

సరైన వాహన రిజిస్ట్రేషన్ లేకపోతే బీమా క్లెయిమ్ రాదు: సుప్రీం కోర్టు

రోడ్డుపై డ్రైవింగ్ చేయడానికి వాహన రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని సుప్రీంకోర్టు తెలిపింది. వాహనం రిజిస్ట్రేషన్ చెల్లుబాటు కాకపోతే లేదా దాని రిజిస్ట్రేషన్ గడువు ముగిసినట్లయితే, అది వాహన బీమా ఒప్పంద నిబంధనలను ఉల్లంఘిస్తుంది. ఓ కారు యజమాని బీమా కంపెనీ నుంచి రూ. 6.17 లక్షల బీమా క్లెయిమ్ కోసం వినియోగదారుల ఫోరమ్‌లో పిటిషన్ దాఖలు చేశారు, దీనిని బీమా కంపెనీ సుప్రీం కోర్టులో సవాలు చేసింది.

సరైన వాహన రిజిస్ట్రేషన్ లేకపోతే బీమా క్లెయిమ్ రాదు: సుప్రీం కోర్టు

తాత్కాలిక రిజిస్ట్రేషన్ ఉన్న కారు యొక్క బీమా క్లెయిమ్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించినప్పుడు గత శనివారం ఈ పరిశీలన జరిగింది. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన బీమా కంపెనీలలో ఒకటైన యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఈ క్లెయిమ్‌పై అప్పీల్ దాఖలు చేసింది. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఉత్తర్వును సవాలు చేసింది.

సరైన వాహన రిజిస్ట్రేషన్ లేకపోతే బీమా క్లెయిమ్ రాదు: సుప్రీం కోర్టు

అసలు విషయం ఏమిటి?

ఈ సందర్భంలో, వాహన యజమాని ఓ కొత్త వాహనాన్ని కొనుగోలు చేశారు, అది తాత్కాలికంగా నమోదు (టెంపరరీ రిజిస్ట్రేషన్) చేయబడింది. వాహనం యొక్క టెంపరరీ రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత కూడా అతను తన కారును శాస్వత నమోదు (పర్మినెంట్ రిజిస్ట్రేషన్) చేయించలేదు. అయితే, ఈ సమయంలో రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, పార్కింగ్ స్థలంలో పార్క్ చేసినప్పుడు ఆ కారు దొంగిలించబడింది.

సరైన వాహన రిజిస్ట్రేషన్ లేకపోతే బీమా క్లెయిమ్ రాదు: సుప్రీం కోర్టు

దీంతో సదరు వాహన యజమాని బీమా కోసం క్లెయిమ్ చేశారు. కానీ, వాహనం యొక్క టెంపరరీ రిజిస్ట్రేషన్ గడువు ముగిసిందని చెప్పడంతో బీమా కంపెనీ క్లెయిమ్‌ను తిరస్కరించింది. ఆ తర్వాత పాలసీదారుడు జిల్లా ఫోరమ్ ని సంప్రదించి, 1,40,000 అద్దె మొత్తంతో పాటు బీమా మొత్తాన్ని చెల్లించేలా ఆదేశాలు కోరాడు. అయితే, కోర్టు దీనికి సంబంధించి ఫిర్యాదును కొట్టివేసింది.

సరైన వాహన రిజిస్ట్రేషన్ లేకపోతే బీమా క్లెయిమ్ రాదు: సుప్రీం కోర్టు

వాహనానికి చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ లేదు

ఈ పిటిషన్ ని విచారించిన సుప్రీంకోర్టు బెంచ్, దొంగతనం జరిగిన రోజు నాటికి సదరు కారు యొక్క రిజిస్ట్రేషన్ చెల్లుబాటులో లేదని తెలిసింది. ఇది స్పష్టంగా మోటార్ వాహనాల చట్టాన్ని ఉల్లంఘిస్తోందని మరియు బీమా షరతులను కూడా ప్రాథమికంగా ఉల్లంఘిస్తోందని ధర్మాసనం తెలిపింది. ఈ కేసులో బీమా కంపెనీకి కస్టమర్ చేసిన క్లెయిమ్ ను తిరస్కరించే హక్కు ఉందని కోర్టు పేర్కొంది. జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్‌సిడిఆర్‌సి) నిర్ణయాన్ని సుప్రీం కోర్టు పక్కకునెట్టింది.

సరైన వాహన రిజిస్ట్రేషన్ లేకపోతే బీమా క్లెయిమ్ రాదు: సుప్రీం కోర్టు

బీమా కంపెనీ వాదన

వాహనం యొక్క తాత్కాలిక రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే కస్టమర్ పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడంలో విఫలమయ్యారు. కాబట్టి, ఇది ప్రాథమిక పాలసీ ఉల్లంఘన అని బీమా కంపెనీ బెంచ్ ముందు వాదించింది. ఈ పాలసీ ప్రకారం, బీమా కంపెనీకి కస్టమర్ చేసిన క్లెయిమ్‌ ను తిరస్కరించే హక్కు ఉంది. ఫలితంగా, కస్టమర్ తాను కోల్పోయిన కారుతో పాటుగా బీమాని కూడా కోల్పోయారు.

సరైన వాహన రిజిస్ట్రేషన్ లేకపోతే బీమా క్లెయిమ్ రాదు: సుప్రీం కోర్టు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం

మోటార్ వాహనాల చట్టం 1988 లోని సెక్షన్ 3 మరియు 5 ప్రకారం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం చట్టం ప్రకారం నేరం. చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేనట్లయితే, బీమా కంపెనీలు వాహన ప్రమాద క్లెయిమ్‌ను తిరస్కరించవచ్చు. అలాగే, సెక్షన్ 39 మరియు సెక్షన్ 192 ప్రకారం, చెల్లుబాటు అయ్యే వాహన రిజిస్ట్రేషన్ లేకుండా సదరు వాహనాన్ని నడపటం కూడా చట్టరీత్యా నేరం.

సరైన వాహన రిజిస్ట్రేషన్ లేకపోతే బీమా క్లెయిమ్ రాదు: సుప్రీం కోర్టు

చెల్లుబాటు అయ్యే పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా వాహనం నడిపితే రూ.10,000 జరిమానా!

సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ 1989 ప్రకారం, భారత రోడ్లపై తిరిగే వాహనాలు తప్పనిసరిగా పియుసి (పొల్యూషన్ అండర్ కంట్రోల్) సర్టిఫికెట్ ను కలిగి ఉండాలి. ఏదైనా వాహనానికి సంబంధించిన పత్రాలలో రిజిస్ట్రేషన్ మరియు ఇన్సూరెన్స్ పత్రాలు ఎంత మఖ్యమో, దాని పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పియుసి) సర్టిఫికెట్ కూడా అంతే ముఖ్యం.

సరైన వాహన రిజిస్ట్రేషన్ లేకపోతే బీమా క్లెయిమ్ రాదు: సుప్రీం కోర్టు

ట్రాఫిక్ స్టాప్స్ సమయంలో ట్రాఫిక్ అధికారులు తనిఖీ చేసే వాహన పత్రాలలో పియుసి సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి, అలా లేకపోయినట్లయితే సదరు వాహన యజమాని నిర్ణీత జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కాగా, దేశ రాజధాని ఢిల్లీలో సరైన పియుసి సర్టిఫికెట్ లేని వాహనాలపై భారీ జరిమానాలు విధిస్తున్నారు. చెల్లుబాటు అయ్యే పియుసి లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడిన వారిపై గరిష్టంగా రూ. 10,000 వరకూ జరిమానాను విధిస్తున్నారు.

Most Read Articles

English summary
Insurance companies may deny you claim if vehicle registration found invalid details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X