విశ్వంలో ఉన్న అతి పెద్ద విమానం ఎయిర్‌బస్ ఎ380 గురించి ఆసక్తికర విషయాలు
ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద ప్యాసింజర్ విమానం అనగా లగ్జరీ, వసతులు మరియు ఇంటీరియర్ వంటి అన్ని విషయాల పరంగా అతి పెద్దది. ఎయిర్‌బస్ సంస్థ 2007 వ సంవత్సరంలో దీనిని ప్రపంచానికి పరిచయం చేసింది. ఎయిర్‌బస్ ఎ380 అనే పేరు గల ఈ విమానంలో మనం ఊహించని అశ్చర్యకరమైన విశయాలు ఉన్నాయి. వాటి గురించి తెలుగు డ్రైవ్‌స్పార్క్ క్రింది కథనం ద్వారా మీకు తెలియజేస్తోంది.

తొలి పరిచయం
ప్రముఖ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్ ఎ380 అనే ఈ అతి పెద్ద విమానాన్ని 2005 ఏప్రిల్ 27 న విజయంవంతగా తొలి సారిగా విజయవంతంగా నడిపారు. తరువాత అధికారింగా 2007 లో సింగపూర్ ఎయిర్‌లైన్స్ దీని ద్వారా సేవలు అందించింది.

3600 లీటర్లు
3600 లీటర్లు ఇంధనం అనుకుని పొరబడేరు. ఈ విమానం బాహ్య భాగానినికి రంగులు అద్దాలి అనుకుంటే సుమారుగా 3,600 లీటర్ల పెయింట్ కావాలి మరి.

ఎగిరే ఏనుగు
దీని కొలతల గురించి విన్నారంటే మీరు కూడా ఎగిరే ఎనుగు అని ఒప్పుకోవాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద ప్యాసింజర్ విమానంగా పేరు సాధించిన ఈ విమానం 24.1 మీటర్లు ఎత్తు, 80 మీటర్లు వెడల్పు మరియు 72.7 మీటర్ల పొడవు కలదు మరియు దీని బరువు సుమారుగా 590 టన్నులుగా ఉంది.

భారీ రెక్కలు
ఏ విమానానికి అయినా ఒక పరిమితితో కూడా పొడవున్న రెక్కలు ఉంటాయి. కాని ఇందులోని రెక్కలు బోయింగ్ 747 ఎయిర్‌క్రాఫ్ట్ రెక్కల పొడవు కన్నా 54 శాతం కంటే ఎక్కువ పొడవుతో ఉన్నాయి.

ప్రయాణికుల సంఖ్య
ఇందులోని ఇంటీరియర్ స్పేస్‌లో సుమారుగా 3000 వరకు ట్రంకు పెట్టెలు మరియు 525 మంది వరకు ప్రయాణించవచ్చు.

515 కిలోమీటర్లు పొడవు
ఇందులోని వైరింగ్ వ్యవస్థలో వినియోగించిన అన్ని వైర్లను ఒక దాని వెంట ఒకటి కలిపితే సుమారుగా 320 మైళ్లు అనగా 515 కిలోమీటర్ల పొడవు ఉంటుంది.

1,40,000 గంటలు
ఎయిర్‌బస్ సంస్థ దీనిని 1,40,000 గంటల పాటు నిర్విరామంగా ప్రయాణించే విధంగా డిజైన్ చేశారు.

పర్యావరణహితమైనది
ఇంత భారీ స్థాయిలో ఉన్న విమానం కాలుష్య కారకాలను కూడా అంతే స్థాయిలో విడుదల చేస్తుంది అని అనుకుంటున్నారు కదా. కాని మీ అంచనాలకు ఇది పూర్తిగా వ్యతిరకం ఎందుకంటే ఇందులో వినియోగించిన పర్యావరణహితమైన పరికరాలు మరియు తక్కువ బరువున్న పరికరాల వినియోగించడం ద్వారా అన్నింటి కంటే ఇది తక్కువగా ఉద్గారాలను విడుదల చేస్తుంది.

వివిధ దేశాలలో తయారైన పరికరాలు
ఎయిర్‌బస్ ఎ380 విమానంలో వినియోగించే ఇంజన్ మరియు రెక్కలను ఇంగ్లాండులో అధేవిదంగా తోక మరియు విమానం మధ్యలో ఉన్న క్యాబిన్ లను స్పెయిన్ మరియు జర్మనీలలో తయారు చేశారు. అన్నింటిని అనుసంధానించి పూర్తి స్థాయిలో విమానాన్ని తీర్చిదిద్దడానికి అన్ని భాగాలను ఫ్రాన్స్‌కు తరలిస్తారు.

40 లక్షల విడి పరికరాలు
ఇందులోని ప్రధాన భాగాలన కలపడానికి దాదాపుగా 8000 వేల బోల్ట్‌ల వరకు అవసరం అవుతాయి. ఈ ఎయిర్‌బస్ ఎ380 విమానంలో సుమారుగా 40 లక్షల వరకు అతి చిన్న విడి పరికరాలు ఉంటాయి, వీటిని 1500 వరకు సంస్థలు సుమారుగా 30 దేశాలలో తయారు చేస్తారు.

3100 డిగ్రీల ఉష్ణోగ్రత
ఇందులోని ఇంజన్‌లు సుమారుగా 3100 డిగ్రీల ఉష్ణోగ్రతను విడుదల చేస్తాయి మరియు ఇందులో వినియోగించే ఇంజన్‌లు మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ కారు పొడవుకు సమానంగా ఉంటాయి.

ఇంధన సామర్థ్యం
ఎయిర్‌బస్ ఎ380 విమానంలో సుమారుగా 3,72,324 లీటర్ల ఇంధనాన్ని స్టోర్ చేసుకుంటుంది. మిగతా పెద్ద విమానాలేతో పోల్చుకుంటే ఇది 17 శాతం తక్కువ ఇంధనాన్ని వినియోగించుకుంటుంది. ఒక్క ప్రయాణికుడు 100 కిలోమీటర్లు ఇందులో ప్రయాణించడానికి నాలుగు లీటర్ల ఇంధనం అవసరం అవుతుంది.

వంటశాలలు
ఇందులో ప్రయాణించే ప్రయాణికులకు బోజనాలు మరియు ఇతర ఆహార పదార్థాలను తయారు చేయడానికి ఐదు వంట తయారీ శాలలు కలవు.

విశ్రాంతి గదులు
ఇందులో దూర ప్రాంతాలకు ప్రయాణించే విమాన ప్రయాణికుల కోసం ప్రత్యేక సదుపాయాలతో కూడిన గదులను మరియు బెడ్లును అందించారు.

ప్రయాణించే ఎత్తు మరియు వేగం
ఈ విమానం దాదాపుగా 43,000 అడుగుల ఎత్తు వరకు సుమారుగా గంటకు 640 మైళ్ల వేగం అనగా 1,029 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా 20 రన్‌వేలు మాత్రమే
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతి పెద్ద విమానం ఎయిర్‌బస్ ఎ380 ల్యాండ్ అవ్వడానికి కేవలం 20 రన్‌వేలు మాత్రమే ఉన్నాయి. అయితే మిగతా రన్‌వేలు దీనికోసం అధిక పొడవుతో లేవు మరియు సాంకేతికంగా కూడా అభివృద్ది చెందలేదు.

దీని కన్నా పెద్ద విమానం
మన ఇంత సేపు ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద ప్యాసింజర్ విమానం గురించి తెలుసుకున్నాం కదా. అయితే దీని కన్నా పెద్ద విమానం రష్యాలోని ఆంటోనోవ్ అనే సంస్థ ఏఎన్-225 అనే విమానాన్ని తయారు చేసింది. అయితే ఇది కార్గో విమానం.

విమానాలను కూడా మోసుకెళుతుంది
కార్గో అంటే చిన్ని వస్తువులను కాదు భారీ స్థాయిలో ఉండే విమానాలను మరియు రైళ్లను ఇది ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతాన్ని చేర్చుతుంది.

ఎ380 లోని ఇంజన్
ఇందులో నాలుగు ఇంజన్‌లు కలవు, అవి రోల్స్‌రాయిస్ ట్రెంట్9000 లేదా ఇంజన్ అలియన్స్ జిపి7000 వంటి వాటిని వినియోగిస్తున్నారు. అందులో రెండు ఇంజన్‌లు విమానం నేల మీద ఉన్నపుడు పనిచేస్తాయి. విమానం గాలిలోకి ఎగిరిన తరువాత మిగిలిన రెండు పనిచేస్తాయి.

మిశ్రమ లోహపు బాగాలతో
ఈ విమానం బాడీ మరియు ఇతర విడి భాగాలను వివిధ రకాల లోహాల మిశ్రమాలతో డిజైన్ చేశారు. తద్వారా ఇది ఎంతో సురక్షితంగా ఉంటుంది. అయితే ఇందులో ప్రయాణించిన ప్రయాణికుడు మాట్లాడుతూ ఇందులో ప్రయాణం ఎంతో చక్కటి అనుభూతిని ఇచ్చిందని తెలిపాడు.

దేశీయంగా దీని కోసం ఉన్న రన్‌వేలు
మన ఇండియాలో ఎయిర్‌బస్ ఎ380 విమానానికి నాలుగు విమానాశ్రయాలలో రన్‌వేలు కలవు అవి హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు మరియు ముంబాయ్‌లలో

ఏవియానిక్ సిస్టమ్
ప్రపంచ వ్యాప్తపు అతి పెద్ద విమానం ఎయిర్‌బస్ ఎ380లో లాక్‌హీడ్ మార్టిన్ వారి ఎఫ్-22 రాప్తర్ మరియు దస్సాల్ట్ రాఫెల్ యుద్ధ విమానంలో వినియోగించిన ఆధునిక కంట్రోల్ సిస్టమ్‌ను ఇందులో వినియోగించారు. ఇది ఇద్దరు పైలట్లు చేత నడపబడుతుంది.

విమాన సిబ్బంది
ఈ విమానంలో 21 మంది విమాన సిబ్బంది ఉంటారు మరియు వీరి కోసం ప్రత్యేకంగా విశ్రాంతి గదులను కూడా ఏర్పాటు చేశారు అధేవిదంగా పైలట్లు పడుకోవడానికి కాక్‌పిట్‌కు దగ్గరలో విశ్రాంతి బెడ్లును అందుబాటులో ఉంచారు.

కెమెరా ఫీచర్
ఇందులో విమాన చక్రాలకు దగ్గరలో కెమెరాలను అమర్చారు. తద్వారా విమానం ల్యాండింగ్ మరియు టేకాఫ్ సమయంలో విమాన చక్రాలను చూస్తూ బాగా ఎంజాయ్ చేయవచ్చు.

ప్రత్యేక నియంత్రికలు
సాధారణంగా విమానం టేకాఫ్ తీసుకున్న రెండు నిమిషాల అనంతరం మరొక విమానాన్ని అనుమతిస్తారు. అయితే ఈ విమానానికి మాత్రం మూడు నిమిషాల వ్యవధి ఉంటుంది. అంతే కాకుండా ఈ సంకేతాలు విమానం నుండి విమానాశ్రయానికి చేరుతాయి.

ధర
ఎయిర్‌బస్ ఎ380 విమానం ధర సుమారుగా 2,733 కోట్లుగా ఉంది

ఫ్లాప్ అయిన మోడల్
విభిన్న ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిన ఈ విమాన అమ్మకాల పరంగా అపజయం పాలైంది. దీనిని అభివృద్ది చేసిన ప్రారంభంలో సుమారుగా 1500 విమానాల అమ్మకాలు చేపట్టాలని ఎయిర్‌బస్ నిర్ణయించుకుంది. కాని కేవలం 315 విమానాలకు మాత్రమే ఆర్డర్ లభించింది అందులో 165 విమానాలను తయారు చేశారు.

ఆగిపోతున్న ఉత్పత్తి...?
ఎయిర్‌బస్ సంస్థ వీటి ఉత్పత్తిని 2018 నాటికి నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి కారణం బోయింగ్ సంస్థ ఈ ఎ380 విమానానికి పోటిగా విమనాన్ని తయారు చేయడం అని తెలిసింది.

బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్
బోయింగ్ సంస్థ ఎయిర్‌బస్ ఎ380 విమానానికి ప్రత్యక్ష పోటీని సృష్టిస్తూ బోయింగ్ 787 అనే ఎయిర్‌క్రాఫ్ట్ అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఎ380 విమానంతో పోల్చితే బోయింగ్ 787 ఎక్కువ అమ్మకాలను సాధించింది.

పైలట్ మరియు విమాన సిబ్బంది చేసే 20 చీకటి పనులు
భారత్‌లో అత్యంత రద్దీ గల టాప్-10 అంతర్జాతీయ విమానాశ్రయాలు
భారత్‌లో గల టాప్-10 బెస్ట్ ఎయిర్‌లైన్స్: ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications








