మోడీ వినియోగిస్తున్న ఎయిర్‌ ఇండియా వన్‌ విమానం ఎంత శక్తివంతమైనదో తెలుసా..?

భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 21 నుంచి 24 వరకు అగ్రరాజ్యంలో వివిధ కార్యక్రమాల్లో మోడీ పాల్గొంటారు. 2023 సంవత్సరంలో మోడీ తొలిసారిగా అమెరికాలో పర్యటిస్తున్నారు. మోడీ ప్రధాని అయ్యాక అమెరికాలో ఇది ఆరో పర్యటన.

మోడీ ప్రధాని అయ్యాక 2014 నుంచి 2019 మధ్య కాలంలో 54 దేశాల్లో 95 పర్యటనలు చేశారు. ఇందుకోసం సుమారుగా రూ.518 కోట్లు ఖర్చయింది. అయితే మోడీ పర్యటనలకు వెళ్లే విమానం "ఎయిర్‌ ఇండియా వన్‌" అత్యంత భద్రతతో కూడుకున్నది. అంతే కాకుండా ఎన్నో విశిష్టతలు ఈ విమానం సొంతం.

interesting facts about indias VVIP aircraft air india one

భారత్ దేశంలోని వీవీఐపీల ప్రయాణ అవసరాలు తీర్చేందుకు రెండు బోయింగ్‌ 777-300ER విమానాలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఇటీవల రూ.8,400 కోట్లు వెచ్చించింది. భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని పర్యటనలను దృష్టిలో పెట్టుకొని ఈ విమానాలను సమకూర్చారు. కేవలం వారు మాత్రమే ఎయిర్‌ ఇండియా వన్‌లో ప్రయాణం చేస్తారు.

ఎయిర్‌ ఇండియా వన్‌ విమానం ఒక్కసారి ఇంధనం నింపుకుంటే 17 గంటలపాటు నిరంతరంగా ప్రయాణం చేయగలదు. ఈ విమానానికి ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ప్రత్యేక భద్రతను కల్పిస్తుంది. ఎయిర్‌ ఇండియా వన్‌ విమానాన్ని భారత్‌ వైమానిక దళానికి (ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్) చెందిన అత్యుత్తమ పైలెట్లు నడిపిస్తారు. వారంతా ఎయిర్‌ ఇండియా వన్‌ కోసం ప్రత్యేక శిక్షణ పొందుతారు.

ఎయిర్‌ ఇండియా వన్‌ విమానంలో అత్యంత అధునాతన క్షిపణి రక్షణ వ్యవస్థ మరియు కమ్యూనికేషన్‌ వ్యవస్థలు అమర్చబడి ఉంటాయి. అమెరికా అధ్యక్షుడి ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ తరహా రక్షణ వ్యవస్థ ఎయిర్‌ ఇండియా వన్‌లోనూ ఉంటుంది. ఈ విమానం శత్రు రాడార్‌ సిగ్నల్‌లను జామ్‌ చేయగలదు. మరియు క్షిపణుల దిశకు కూడా మార్చగల సామర్థ్యం ఎయిర్‌ ఇండియా వన్‌ విమానం సొంతం.

ఎయిర్‌ ఇండియా వన్‌లో వీవీఐపీ క్యాబిన్‌ మరియు మెడికల్‌ సెంటర్‌, సమావేశాల నిర్వహణకు ప్రత్యేక గది ఉంటుంది. అలాగే ఆపరేషన్‌ థియేటర్‌, విలాసవంతమైన లాంజ్‌ మరియు విశాలమైన బెడ్‌రూం ఉన్నాయి. ఎయిర్‌ ఇండియా వన్ విమానం సుమారు 2000 మందికి ఆహారాన్ని నిల్వ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

interesting facts about indias VVIP aircraft air india one

ఎయిర్‌ ఇండియా వన్‌ విమానంలో ఆడియో, వీడియో కాల్స్‌ చేసుకొనేందుకు వీలుగా ప్రత్యేక కమ్యూనికేషన్‌ వ్యవస్థ ఉంటుంది. ఈ సంభాషణను ఎవరూ హ్యాక్‌ చేయలేరు. SPS అని పిలిచే స్వీయ రక్షణ సూట్‌తో వచ్చిన తొలి భారతీయ విమానం ఎయిర్‌ ఇండియా వన్‌. లార్జ్‌ రేంజ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇన్‌ఫ్రారెడ్‌ కౌంటర్‌ మెజర్స్‌ మరియు అడ్వాన్సడ్‌ ఇంటిగ్రేటెడ్‌ ఢిఫెన్స్ ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌ సూట్‌ ఉంటాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, June 19, 2023, 18:11 [IST]
English summary
Interesting facts about air india one in which pm modi flying to us
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+