ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం గురించి ఆసక్తికరమైన నిజాలు

ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి...

By N Kumar

Recommended Video

Under-Aged Rider Begs The Policewomen To Spare Him - DriveSpark

దేశ ఆర్థిక ప్రగతిలో రవాణా రంగం కీలక పాత్ర పోషిస్తోంది. దేశ ప్రజల ఆర్థిక స్థితిగతులు మరియు ప్రయాణ అవసరాలకు అనుగుణంగా ఒక్కో రవాణా వ్యవస్థ ఒక్కో విధంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. అందులో విమాయాన రంగానికి గత దశాబ్ద కాలం నుండి మంచి ఆదరణ లభిస్తోంది.

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

దేశవ్యాప్తంగా విమాన ప్రయాణం చేసే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. దేశ రాజధాని నగరం ఒక్క ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి వరుసగా రెండు సంవత్సరాల్లో ఏడాదికి 250 నుండి 400 లక్షల మంది విమాన ప్రయాణం చేశారు.

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

ప్రపంచ వ్యాప్తంగా 250 నుండి 400 లక్షల మంది రాకపోకలు సాగించిన అంతర్జాతీయ విమానాశ్రయాల్లో గత రెండేళ్ల కాలంగా ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి స్థానంలో నిలిచింది.

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని మూడవ టెర్మినల్ ప్రారంభించినపుడు భారతదేశపు రాజధాని నగరం విమాన ప్రయాణానికి మరింత అనుకూలమైనదిగా గుర్తింపు పొందింది.

Picture credit: Wiki Commons

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

రద్దీకి అనుగుణంగా ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ మూడవ టెర్మినల్ విస్తరణతో మరింత ఆకర్షణీయంగా రూపాంతరం చెందింది. చూడటానికి అందంగా కనువిందు చేసే భారతదేశపు అందమైన ఎయిర్‌పోర్టుల సరసన చేరింది.

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

దేశ ఆర్థికాభివృద్దికి విమానాశ్రయాలు సూచనీయంగా ఉన్నట్లయితే, ప్రపంచ దేశాల్లో భారతదేశం మొదటి స్థానంలో నిలుస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇందుకు ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రాయలు మరియు వాటి సేవలే ఇందుకు ప్రామాణికం.

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి...

ఎయిర్‌పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్(ACI) మరియు ఎయిర్‌పోర్ట్ సర్వీస్ క్వాలిటీ(ASQ) బెంచ్ మార్క్‌ నుండి 300 మందితో ఎయిర్‌పోర్ట్ సర్వీస్ క్వాలిటీ పరంగా నిర్వహించిన ప్రోగ్రాంలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ 5 కు గాను 4.90 పాయింట్లు నమోదు చేసుకుంది.

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

2014 మరియు 2015 సంవత్సరాల్లో 58 దేశీయ మరియు 62 అంతర్జాతీయ గమ్యస్థానాలకు ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి విమానాలు నడిచాయి.

Trending On DriveSpark Telugu:

ఇండియన్ ఎయిర్ ట్రావెల్ గురించి ఆశ్చర్యగొలిపే నిజాలు

మితిమీరిన వేగంతో బీభత్సం సృష్టించిన కారు: వీడియో

లక్షద్వీప్ దీవుల్లో అద్భుతాన్ని నిర్మిస్తున్న భారత్

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

2014-2015 మధ్య కాలంలో ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌నుండి సుమారుగా 4 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు.

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఆరు దేశీయ ఎయిర్‌లైన్స్ మరియు 56 అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌ను నిర్వహిస్తోంది.

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

అతి పెద్ద విమానం ఎయిర్‌బస్ ఏ380 ఎయిర్‌క్రాఫ్ట్‌ను హ్యాండిల్ చేసే సమామర్థ్యం కూడా ఢిల్లీ విమానాశ్రయానికి ఉంది.

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పడానికి ముందు ఢిల్లీ విమానాశ్రయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహించేది. తరువాత మే 2006లో, ఈ ఎయిర్‌పోర్ట్ నిర్వహణ ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్(DIAL) పేరుతో జిఎమ్‌ఆర్ గ్రూప్‌కు అప్పగించారు.

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానాల టేకాఫ్ మరియు ల్యాండింగ్‌లు ఊహించిన విధంగా మరియు సకాలంలో జరిగేందుకు ఎయిర్‌పోర్ట్ కొలాబరేటివ్ డిసిషన్ మేకింగ్(A-CDM) అనే అడ్వాన్స్‌డ్ సిస్టమ్ ఉపయోగిస్తున్నారు.

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

2010 సంవత్సరంలో టెర్మినల్ 3 ప్రారంభంతో ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశ మరియు దక్షిణాసియా యొక్క అతి పెద్ద ఏవియేషన్ హబ్‌గా నిలిచింది.

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

ప్రస్తుతం ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రయాణికుల వార్షిక నిర్వహణ సామర్థ్యం 6.20 కోట్లుగా ఉంది. 2030 నాటికి ఈ విమానాశ్రయం 10 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందించే దిశగా ఎయిర్‌పోర్ట్ విస్తరణ చేపట్టే ఆలోచనలో ఉంది.

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

2014లో 3 కోట్ల 97 లక్షల మందికి విమానయాన సేవలందించి ప్రపంచ వ్యాప్తంగా అత్యంత రద్దీతో కూడిన టాప్ 30 అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ చోటు దక్కించుకుంది.

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

ఈ విమానాశ్రయం మునుపటితో పోల్చుకుంటే ఒక్క 2014 ఏడాదిలోనే ప్రయాణికుల రాకపోకల్లో 7.8 శాతం వృద్దిని నమోదు చేసుకుంది.

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

2014లో 15 నుండి 25 మిలియన్ ప్రయాణికులకు సేవలందించిన విభాగంలో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచ వ్యాప్తంగా నాలుగవ అత్యుత్తమ విమానాశ్రయంగా గుర్తింపు తెచ్చుకుంది.

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

ఆసియా-పసిఫిక్ రీజియన్‌లో బాగా అభివృద్ది చెందిన విమానాశ్రయంగా ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ నుండి అవార్డ్ గ్రహించింది.

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

అంతే కాకుండా, 2015లో ఏడాదికి 25 నుండి 40 మిలియన్ ప్రయాణికుల నిర్వహణ కెటగిరీలో ప్రపంచ వ్యాప్తంగా బెస్ట్ ఎయిర్‌పోర్టుగా ఢిల్లీ విమానాశ్రయం మొదటి స్థానంలో నిలిచింది.

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

2015లో ప్రతిష్ఠాత్మక స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌పోర్ట్ అవార్డుల్లో ఆసియా/ఇండియాలో బెస్ట్ ఎయిర్‌పోర్ట్‌గా మరియు ఆసియా/ఇండియా బెస్ట్ ఎయిర్‌పోర్ట్ స్టాఫ్ అవార్డులను ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ దక్కించుకుంది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Most Read Articles

English summary
Read In Telugu: Interesting facts about Indira Gandhi International Airport
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X