బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

ఎన్నో అవరోధాలను దాటుకొని జో బైడెన్ అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన సంగతి మనందరికీ తెలిసినదే. అమెరికా చరిత్రలోనే డెమోక్రాట్లు అత్యధిక మెజారిటీని సాధించి, 46వ అధ్యక్షునిగా జో బైడెన్‌ను తమ దేశాధ్యక్షునిగా ఎన్నుకున్నారు.

బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

ఇతర అమెరికా అధ్యక్షుల మాదిరిగానే, ఈ కొత్త అధ్యక్షుడైన జో బైడెన్‌కు కూడా ఆ దేశ సీక్రెట్ సర్వీస్ విభాగం భారీ భద్రతను కల్పిస్తుంది. ప్రయాణాల్లో ఎల్లప్పుడూ అమెరికా అధ్యక్షుడుని రక్షణ కవచంలా కాపాడేది ఆయన అధికారిక అధ్యక్ష వాహనం.

బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

అమెరికా సైన్యం ఈ కారుని ముద్దుగా బీస్ట్ అని పిలుస్తుంది. తెలుగులో బీస్ట్ అంటే 'మృగం' అని అర్థం. సాధారణంగా చాలా క్రూరంగా ప్రవర్తించే జంతువులను లేదా వ్యక్తులను మనం మృగం అని పిలుస్తుంటాం. ఈ కారు కూడా అలాంటిదే.

చూడటానికి చాలా అందంగా కనిపించినప్పటికీ, ఇందులో అనేక క్రూరమైన అంశాలు దాగున్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి.

MOST READ:ఇండియా To సింగపూర్ : బస్‌లో వెళ్లి వచ్చేద్దామా.. మీరు విన్నది నిజమే.. చూడండి

బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

ప్రతిదేశం కూడా తమ దేశాధ్యక్షుల భద్రత కోసం అధునాతన వాహనాలను ఉపయోగిస్తుంది. కానీ అమెరికా అధ్యక్షుడి కోసం ఉపయోగించే కారు మాత్రం చాలా విశిష్టమైనది. దీనిని ఓ యుద్ధ ట్యాంక్ మాదిరిగా తయారు చేశారు. అమెరికాకు చెందిన జనరల్ మోటార్స్ ఈ అధ్యక్ష వాహనానికి జీవం పోసింది.

బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

అయితే, ఇందులోని పరికరాలు, సాంకేతికతలను మాత్రం ఆదేశపు సీక్రెట్ సర్వీసెస్ రూపొందించింది. ట్రక్ లేదా ఎస్‌యూవీ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేసిన క్యాడిలాక్ వాహనం ఇది. అమెరికాలో క్యాడిలాక్ బ్రాండ్ కార్లు చాలా విలాసవంతమైనవిగా పరిణిస్తారు. వీటి ఖరీదు కూడా కోట్లలో ఉంటుంది.

MOST READ:ప్రజలపై 'గ్రీన్ టాక్స్' మోతకు కేంద్రం గ్రీన్ సిగ్నల్; ఏప్రిల్ 1 నుండి..

బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

ఈ కారు అసలు పేరు క్యాడిలాక్ వన్. ఇక్కడ క్యాడిలాక్ వన్‌లో వన్ అంటే అర్థం, ఈ కారుని కేవలం ఒకే ఒక్క యూనిట్ మాత్రమే తయారు చేయబడి ఉంటుంది. అది కూడా కేవలం యూఎస్ ప్రెసిడెంట్ కోసం మాత్రమే. ఇతరుల కోసం ఇలాంటి కారును తయారు చేయరు. అందుకే దీనిని క్యాడిలాక్ వన్ అని పిలుస్తారు.

బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

ఈ కారు ధర సుమారు 1.5 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. అంటే మన కరెన్సీలో సుమారు రూ.11 కోట్లకు పైమాటే. లీమోజైన్ రూపంలో ఉండే ఈ క్యాడిలాక్ వన్ కారును 2018 సెప్టెంబరు 24వ తేదీన అప్పటి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కోసం ప్రవేశపెట్టారు. ప్రస్తుత కారును బీస్ట్ 2.0గా పిలుస్తారు.

MOST READ:బైక్‌నే బస్సుపైకి తలపై మోసిన రియల్ బాహుబలి [వీడియో]

బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

అమెరికా అధ్యక్షుడి కోసం ఇలాంటివి రెండు కార్లు ఉంటాయి. ఇవి రెండూ ఒకేలా తయారు చేయబడ్డాయి మరియు ప్రెసిడెంట్ కాన్వాయ్‌లో ఇవి రెండూ ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ కారులోని అద్దాలను 5 అంగుళాల మందంతో కూడిన బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌తో తయారు చేశారు. ఇవి పర్మినెంట్ గ్లాస్, క్రిందికి రోల్ అవ్వవు. కేవలం డ్రైవర్ సైడ్ గ్లాస్ మాత్రమే క్రింది రోల్ అవుతుంది.

బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

అలాగే ఈ కారులోని డోర్లను 8 అంగుళాల మందంతో కూడిన మిలటరీ గ్రేడ్ స్టీల్‌తో తయారు. ఇలాంటి డోర్లను బోయింగ్ విమానాల్లో మనం చూడొచ్చు. కారు లోపల డ్రైవర్ మరియు ప్రెసిడెంట్ క్యాబిన్‌ను బ్లాక్ చేస్తూ ఓ బుల్లెట్‌ప్రూఫ్ అద్దం ఉంటుంది. దీనిని కేవలం ప్రెసిడెంట్ మాత్రమే లోపలివైపు నుంచి రోల్ చేసే అవకాశం ఉంటుంది.

MOST READ:ఎలక్ట్రిక్ కారుగా మారిన మారుతి డిజైర్ ; వివరాలు

బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

ఈ కారులోని ఇంధన ట్యాంక్ పేలిపోకుండా ఉండేందుకు ఇందులో ప్రత్యేకంగా ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఉంటుంది. ఒకవేళ దురదృష్టవశాత్తు ట్యాంక్ పేలిపోయినా, వెంటనే మంటలు ఆర్పేందుకు వీలుగా దాని చుట్టూ ఒకరకమైన ఫైర్ ప్రివెన్షన్ ఫోమ్ ఉంటుందట.

బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

ఈ కారు ఎలాంటి దాడులనైనా తట్టుకునేలా ఉంటుంది. రాకెట్ లాంచర్స్, గ్రనేడ్స్, ల్యాండ్ మైన్స్ మరియు రసాయనిక దాడులను సైతం ఇది తట్టుకుంటుందని సమాచారం. ఈ కారులో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేందుకు ఆక్సిజన్ సరఫరా, కెమికల్ మాస్కులు మరియు ప్రస్తుత అధ్యక్షుని బ్లడ్ గ్రూప్‌కి చెందిన బ్లడ్ ప్యాకెట్స్ కూడా ఉంటాయి.

బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

​ఈ కారులో అమర్చిన సాయుధ సామగ్రి గురించి అమెరికా సీక్రెట్ సర్వీసెస్‌కి తప్ప మరెవ్వరికీ తెలియదు. ఇందులో తగినన్ని షాట్ గన్లు, భాష్ప వాయువు క్యాన్లు, ఫైర్ ఫైటింగ్ సిస్టం, పొగను పీల్చుకునే స్క్రీన్ డిస్పెన్సర్లు, టియర్ గ్యాస్ గ్రనైడ్ లాంచర్లు వంటి సాయుధ సామాగ్రి ఉన్నట్లుగా చెబుతారు.

బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

ఈ కారులోని టైర్లు, రిమ్ములు చాలా ప్రత్యేకమైనవి మరియు దృఢమైనవి. ఈ టైర్లకు పంక్చర్లు పడవు, ఒకవేళ దురదృష్టవశాత్తు టైర్లు పేలిపోయినా ఇందులోని స్టీల్ రిమ్ముల సాయంతోనే కారు వేగంగా పరుగులు తీస్తుంది. ఇందులో అధునాతన జిపిఎస్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంటుంది.

బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

శాటిలైట్ సాయంతో ఈ కారు ఏ ప్రాంతంలో ఉందో ఇట్టే తెలుసుకోవచ్చు. అధ్యక్ష భవనం మరియు సైనక స్థావరాలను సంప్రదించేందుకు ఇందులో శాటిలైట్ ఫోన్ కూడా ఉంటుంది. సాధారణ డ్రైవర్లెవరూ ఈ కారుని నడపలేరు. ఇందుకోసం అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన డ్రైవర్‌ను నియమిస్తుంది.

బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

ఈ కారులో న్యూక్లియర్ కోడ్స్ కూడా ఉన్నాయని, అత్యవసర సమయాల్లో అధ్యక్షుడు ఒక్క బటన్ సాయంతో తాను కోరుకున్నచోట న్యూక్లియర్ అటాక్ చేయవచ్చని చెబుతారు. ఈ కారు సుమారు 6800 కిలోల నుండి 9100 కిలోల బరువు ఉండొచ్చని అంచనా. ఇంతటి భారీ కారును నడిపేందుకు ఇందులో శక్తివంతమైన 5-లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది.

బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

అమెరికా అధ్యక్షుడి కాన్వాయ్ కోసం ఓ ప్రత్యేకమైన కార్గో విమానం కూడా ఉంది. ఈ విమానం పేరు సి-17 గ్లోబ్ మాస్టర్. అమెరికా అధ్యక్షుడు, విమానాల్లో వేరే ప్రాంతాలకు ప్రయాణించేటప్పుడు ఆయన కంటే ముందుగా ఈ కార్లు ఆ ప్రాంతానికి చేరుకుంటాయి. గతంలో ట్రంప్ ఇండియా వచ్చినప్పుడు కూడా ఆయన కాన్వాయ్‌లో ఈ వాహనాలను ఉపయోగించడాన్ని మనం చూశాం.

Most Read Articles

English summary
Most Interesting Facts About US President Joe Biden’s Official Car, Cadillac One. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X