భారతీయ వంతెనలకు రారాజు...పాంబన్ దీవిని మరియు రామేశ్వరాన్ని కలిపే మహా రైలు వంతెన

Written By:

ఇండియాలోని సముద్ర వంతెనలలో అద్బుతం పాంబన్ వంతెన. ఇది పాంబన్ దీవిని మరియు భారత భూ బాగాన్ని కలుపుతూ నిర్మించబడింది. ఆంగ్లేయుల కాలంలోనే నిర్మించబడిన ఈ వంతెన సుమారుగా 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. కాని ఇంత వరకు ఏ మాత్రం చెక్కు చెదరకుండా సేవలందిస్తోంది.

పాక్ జలసంధి మీదుగా మన్నార్ దీవులను కలుపుతూ పాంబన్ వంతెన మన్నార్ ద్వీపానికి అతి దగ్గరా ఉండే విధంగా గత శాతబ్దంలోనే నిర్మించారు. దీనికి వినియోగించి సాంకేతికత కూడా ఎంతో అద్బుతం. అన్నింటికన్నా ఈ వంతెన క్రింద నౌకలు వెళ్లే సమయంలో వంతెన రెండుగా విడిపోతుంది. ఈ పాంబన్ వంతెన గురించి మరిన్ని వివరాలు క్రింది కథనంలో తెలుసుకుందాం రండి.

ప్రారంభం

ప్రారంభం

తమిళనాడుకు అనుసంధానంగా ఉన్న పాంబన్‌ ద్వీపానికి రామేశ్వరం నుండి సుమారుగా 2.3 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రైల్వే వంతెనను ఆంగ్లేయులు 1914 ప్రారంభించారు.

100 ఏళ్లు

100 ఏళ్లు

2016 ఫిబ్రవరి 24 నాటికి ఈ వంతెన సేవలు ప్రారంభించి సరిగ్గా 102 ఏళ్లు అయింది. ఇప్పటికీ ఏ మాత్రం చెక్కు చెదరకుండా సేవలందిస్తోంది.

1870 లోనే

1870 లోనే

అయితే ఈ రెండు ప్రాంతాలను రైలు ద్వారా కలపాలి అనే ఉద్దేశ్యంతో 1870 లోనే బ్రిటీష్ అడ్మినిస్ట్రేషన్ వారు ప్రతి పాదించారు. కాని అప్పట్లో వెంట వెంటనే వచ్చే తుఫానుల కారణంగా సాధ్యం కాలేకపోయింది.

బేస్కూల్ వంతెన

బేస్కూల్ వంతెన

పాంబన్ దీవి మరియు రామేశ్వరం పట్టణానికి మధ్య ఉన్న పాంబన్ వంతనె మీద బేస్కూల్ వంతెనను అమర్చారు. ఇది ఉండటం వలన ఈ వంతెన క్రింది భాగం గుండా భారీ నౌకలు వెళ్లడానికి మార్గం ఏర్పడింది. బేస్కూల వంతెన అనగా పెద్ద పెద్ద నైకలు వంతెన దాటడానికి వంతెన రెండు భాగాలుగా విడిపోయి మళ్లీ యధాస్థానికి వచ్చి చేరుతుంది.

మీటర్ గేజ్ రైళ్లు

మీటర్ గేజ్ రైళ్లు

ఈ రైలు వంతెన అందుబాటులోకి వచ్చిన తరువాత పాంబన్ దీవికి రామేశ్వరం నుండి మీటర్ గేజ్ రైలు పట్టాల ద్వారా రైళ్లను నడిపేవారు.

బ్రాడ్‌గేజ్ మార్గం

బ్రాడ్‌గేజ్ మార్గం

ఈ పాంబన్ వంతెన మీద మీటర్‌ గేజ్‌ నుండి బ్రాడ్‌ గేజ్‌ రైలు మార్గంగా మార్చబడిన ట్రాక్ మీద 2007 ఆగష్టు 7 నుండి ఇండియన్ రైల్వే రైళ్లను నడపడం ప్రారంభించింది.

నౌకా మార్గం

నౌకా మార్గం

ఈ వంతెన నౌకా మార్గానికి అడ్డుకాకుండా వంతెనను రెండు భాగాలుగా వేరు చేసి నౌకలు వంతెనను దాటిని తరువతా తిరిగి వంతెనను ఒకటి చేసే వారు. ఈ మార్గంలో కార్గో క్యారియర్ నౌకలు, కోస్ట్ గార్డ్ షిప్‌లు, ఫినిషింగ్ వెసల్స్ మరియు ఆయిల్ ట్యాంకర్లు ఈ వంతెన క్రింద నుండి వేళ్లే విధంగా రూపొందించారు.

ధనుష్కోటికి అనుసంధానంగా

ధనుష్కోటికి అనుసంధానంగా

పాంబన్‌ దీవికి కొనసాగింపుగా శ్రీలంక వైపునకు చివరిగా ఉన్న ధనుష్కోటి వరకు రైలు మార్గాన్ని కొవసాగించారు. 1915 నుండి 1964 వరకు మద్రాస్-ఎగ్మోర్ మార్గాన్ని ధనుష్కోటి వరకు బోట్ మొబైల్ అనే రైలును నడిపారు.

ధనుష్కోటి తుఫాన్

ధనుష్కోటి తుఫాన్

1964 లో వచ్చిన ధనుష్కోటి అనే తుఫాను కారణంగా పాంబన్ జంక్షన్ నుండి ధనుష్కోటి వరకు ఉన్న మీటర్ గేజ్ రైలు మార్గం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. అంతటితో అదే ధనుష్కోటి ప్రాంతానికి చివరి రైలు మార్గం అయింది.

ధనుష్కోటి నుండి శ్రీలంకు

ధనుష్కోటి నుండి శ్రీలంకు

నేడు శ్రీలంకగా పిలువబడుతున్న అప్పటి సైలోన్ ని చేరుకోవడానికి పాంబన్ నుండి ధనుష్కోటికి చేరుకునే ప్రజలు ధనుష్కోటి నుండి సైలోనికి ఓడల ద్వారా చేరుకునే వారు.

పాంబన్ దీవిని, రామేశ్వర నగరాన్ని కలిపే మహా రైలు వంతెన...

2013 లో ఇండియన్ రైల్వే ఈ వంతెనను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడానికి యునెస్కోకు రిపోర్ట్‌ చేసింది.

100 ఏళ్లుగా అత్యంత పొడవైన సముద్ర వంతెనగా

100 ఏళ్లుగా అత్యంత పొడవైన సముద్ర వంతెనగా

ఇది ప్రారంభించినబడిన సంవత్సరం 1914 నుండి 2010 వరకు భారత దేశపు అత్యంత పొడవైన సముద్ర వంతెనగా ఉండేది. కాని 2010 లో ప్రారంభమైన మహరాష్ట్రలోని బాంద్రా-వొర్లి సీ లింక్ వంతెన అత్యంత పొడవైన సముద్ర వంతెనగా నిలిచింది. పాంబన్ సముద్ర వంతెన పొడవు సుమారుగా 2.3 కిమీలు ఉండగా బాంద్రా-వొర్లి సముద్రం వంతెన 5.6 కిమీలుగా ఉంది.

1988 వరకు ఏకైక సముద్ర వంతెనగా ఉన్న పాంబన్ వంతెన

1988 వరకు ఏకైక సముద్ర వంతెనగా ఉన్న పాంబన్ వంతెన

1988 వరకు సముద్రం మార్గం గుండా భారత భూబాగానికి ఉన్న ఏకైక వంతెనగా ఈ పాంబన్ బ్రిడ్జి ఉండేది. అయితే 1988 లో ఈ పాంబన్ వంతెనకు సమాతరంగా రోడ్డు వంతెనను నిర్మించారు.

భారతదేశపు మొట్టమొదటి కాంటిలీవర్ బ్రిడ్జి

భారతదేశపు మొట్టమొదటి కాంటిలీవర్ బ్రిడ్జి

పాంబన్ వంతెను నౌకలు దాటడానికి దీనిని రెండు భాగాలుగా విడిపోయే విధంగా డిజైన్ చేసారు. దీనిని కాంటివీలర్ వంతెన అంటారు. దేశ వ్యాప్తంగా ఇలాంటిది కేవలం ఈ వంతెన మీద మాత్రమే ఉంది.

తుఫాన్‌ను కూడా తట్టుకోగలదు.

తుఫాన్‌ను కూడా తట్టుకోగలదు.

ఈ వంతెన తుఫాను కారణంగా కొన్ని చోట్ల డ్యామేజ్‌కు గురయ్యింది, కాని కేవలం 46 రోజుల్లోనే ఈ వంతెనను రిపేరి చేసారు. అంటే ఎంతటి తుఫాన్‌ను అయినా తట్టుకునే సామర్థ్యం ఉన్నట్లు నిరూపించబడింది.

 దాదాపుగా మూసివేత దిశగా

దాదాపుగా మూసివేత దిశగా

పాంబన్ వంతెన మీద మీటరు గేజ్‌ ఉన్నపుడు ఈ మార్గంలో రైలు సర్వీసులను నిలిపివేయాలని 2006లో నిర్ణయించారు. కాని అప్పటి అధ్యక్షుడు ఎపిజె అబ్దుల్ కలాం గారు ఈ వంతెనను సందర్శించి, దీని ధృడత్వాన్ని ప్రశసించారు. అబ్దుల్ కలాం గారి ప్రోబ్దలంతో ఈ మార్గంలోని మీటర్ గేజ్‌ను బ్రాడ్ గేజ్‌గా మార్చాలని ఆదేశించారు.

ఆశ్చర్యం కలిగించే ధృడం

ఆశ్చర్యం కలిగించే ధృడం

2013 లో ఈ వంతెన వద్ద సుమారుగా 220 టన్నుల బరువున్న నౌక ఒకటి ఢీకొట్టింది. అయినప్పటికి వంతెనకు ఏ మాత్రం నష్టం వాటిల్లలేదు. కేవలం విడిపోయే వంతెన జాయింట్లు స్వల్పంగా డ్యామేజ్‌కు గురయ్యాయి. ఆ వెంటనే దానిని రిపేరి కూడా చేసారు.ఇండియాలోని అద్బుతమైన వంతెన నిర్మాణాలలో ఇది ఒకటి.

 
English summary
Interesting Facts About Pamban Rail Bridge
Please Wait while comments are loading...

Latest Photos