Just In
- 3 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 13 hrs ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 16 hrs ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 17 hrs ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- News
ఖమ్మంలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం: తాట తీస్తాం: ఫ్యాన్స్ ఫైర్: ఘాటుగా స్పందించిన షర్మిల
- Finance
ఏప్రిల్ 1 నుండి ఆ IFSC కోడ్స్ మారుతున్నాయి: కొత్త కోడ్‌ను ఇలా తెలుసుకోండి
- Movies
తండ్రైన సుడిగాలి సుధీర్.. ఏకంగా బిడ్డతోనే: వాళ్లను అలా అడగడం వల్లే అంటూ రష్మీ సంచలన వ్యాఖ్యలు
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Sports
India vs England: బెయిల్ దాచేసిన రిషబ్ పంత్.. వెతికిన అంపైర్, ఆటగాళ్లు! చివరకు!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మీకు తెలుసా.. జో బైడెన్ ప్రయాణించే విమానం, విమానం మాత్రమే కాదు.. రక్షణ కవచం
ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందిన దేశం మాత్రమే కాకుండా, ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలలో ఒకటైన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం అందరికి తెలిసిందే. అమెరికా అధ్యక్షుని నివాసం మాత్రమే కాకుండా, అధికారిక కారు, విమానం మరియు హెలికాప్టర్ వంటి వాటివి కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అధ్యక్షునికి భద్రతను కల్పిస్తారు.

అగ్ర రాజ్యమైన అమెరికా, తమ దేశ అద్యక్షుడి రక్షణ కోసం వందల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తుంది. యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ ఉపయోగించే బీస్ట్ కార్ మరియు ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడికి లేని అధునాతన సాంకేతిక పరిజ్ఞానం మరియు భద్రతా లక్షణాలను అందిస్తున్నాయి.

అమెరికా అధ్యక్షుడు, అమెరికా నుంచి ఇతర దేశాలకు వెళ్లాల్సి వస్తే ఎయిర్ ఫోర్స్ వన్ విమానాలను ఉపయోగిస్తారు. అంతే కాకుండా అమెరికా ప్రెసిడెంట్ హౌస్ అయిన వైట్ హౌస్ నుండి విమానాశ్రయానికి చేరుకోవడానికి మెరైన్ వన్ కోడ్ నేమ్ హెలికాప్టర్ ను ఉపయోగిస్తున్నారు.
MOST READ:ఒక ఛార్జ్‌తో 130 కి.మీ.. డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేని కొత్త ఒకినవ స్కూటర్

అమెరికా ప్రెసిడెంట్ ఎక్కడికెళ్లినా, బీస్ట్ కార్ వారితోనే ఉంటారు. వారు ఏ ప్రావిన్స్‌కి వెళ్లినా, విదేశాలకు వెళ్లినా బీస్ట్ కారును తప్పనిసరిగా ఉపయోగిస్తారు. దీని కోసం ప్రత్యేకంగా వారి 9 టన్నుల బీస్ట్ కారును సి 5 గెలాక్సీ కార్గో అనే కార్గో విమానంలో ముందే లోడ్ చేసి తరలిస్తారు.

ఇవి ఎక్కువగా బోయింగ్ 747 లో తరలిస్తారు. అందుకుగాను బోయింగ్ 747 విమానం యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడికి అవసరమైన వివిధ సౌకర్యాలు మరియు భద్రతా సాంకేతికతలతో అనుకూలీకరించబడింది. అమెరికా అధ్యక్షుడి కోసం మొత్తం రెండు విమానాలు కేటాయించబడ్డాయి.
MOST READ:బువ్వ తిను, బుల్లెట్ బైక్ పట్టుకెళ్లు: రాయల్ ఎన్ఫీల్డ్ 'బుల్లెట్' థాలి ఛాలెంజ్

ఒక వేళా ఒక విమానంలో సమస్య ఉంటే, ఆ సమయంలో మరొక విమానం ఉపయోగించబడుతుంది. బోయింగ్ 747 సైనిక శక్తితో పనిచేసే వీసీ-25 పై ఆధారపడింది. విసి 25 ఎ బోయింగ్ 747 200 బి ఆధారంగా ఉంటుందని, విసి 25 బి బోయింగ్ 747-8 విమానం ఆధారంగా ఉంటుందని చెబుతున్నారు.

రెండు విమానాలు 1990 లలో వాడుకలో ఉన్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ కొత్త విమానం నిర్మించే ప్రణాళికలను ప్రకటించారు. ఇక్కడ విశేషమేమంటే అతని భార్య నాన్సీ రీగన్ విమానం లోపలి డిజైన్‌ను సూచించారు. ఈ విమానాలు 4,000 చదరపు అడుగుల అంతర్గత వైశాల్యాన్ని కలిగి ఉన్నాయి.
MOST READ:వామ్మో.. ఆరుగురు పర్యాటకులున్న కారుని నోటితో లాగేసిన పులి [వీడియో]

ఈ విమానాలు ప్రపంచంలోని ఏ మూలనైనా ఫోన్ ద్వారా కమ్యూనికేట్ చేయడానికి అధునాతన రాడార్ సాంకేతికతను కలిగి ఉంటాయి. ఈ విమానాలలో యాంటీ మిసైల్ షీల్డ్ ఉంటుంది. అమెరికా అద్యక్షుడికోసం ఏర్పాటైన ఈ విమానంలో బ్లడ్ బ్యాంక్, ఒక చిన్న ఆపరేటింగ్ థియేటర్ మరియు విశ్రాంతి గదులు ఉన్నాయి.

జనరల్ ఎలక్ట్రిక్ యొక్క 4 ఇంజిన్‌తో నడిచే ఈ విమానం గంటకు 930 కి.మీ వేగంతో ప్రయాణించగలదు. అదనంగా 12,600 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యం కూడా దీనికి కల్పించబడింది. విమానానికి మార్గం మధ్యలో కూడా ఇంధనం నింపవచ్చు. యుఎస్ ఇంటెలిజెన్స్ విభాగం శిక్షణ పొందిన ఇద్దరు పైలట్లు, ఒక ఇంజనీర్ మరియు మార్గదర్శక నిపుణుడు ఈ విమానాన్ని నడుపుతారు.
MOST READ:కార్లపై స్పెషల్ ఆపరేషన్ స్టార్ట్ చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా ?

అమెరికా ప్రెసిడెంట్ కోసం ఉపయోగించే ఈ విమానాలకు అయ్యే ఖర్చు గంటకు 2.10 మిలియన్ డాలర్లు. అమెరికా అధ్యక్షుడి భద్రత కోసం అమెరికన్ గవర్నమెంట్ ఎక్కువమొత్తంలోనే ఖర్చు చేస్తుంది. ఒక్క అమెరికా దేశంలో మాత్రమే కాకుండా ప్రతి దేశం తమ దేశం అధ్యక్షుడికి కట్టుదిట్టమైన భద్రతలను ఏర్పాటు చేస్తాయి.