అణు బాంబులకు సైతం చెదరని, బెదరని జెల్‌జవా భూగర్భ స్థావరం

By N Kumar

ప్రపంచపు అత్యంత ఖరీదైన మిలిటరీ నమూనాలలో ఇది ఒకటి, జల్‌జవా పేరుతో ఉన్న ఈ భూగర్భ స్థావరం ఎంతటి ధృడమైనది అంటే అణు బాంబుల దాడులకు కూడా ఇది చెక్కు చెదరదు. కొండను తొలిచి దాని క్రింది భాగంలో ఈ భూగర్భ వాయుసైన్య స్థావరాన్ని అత్యంత విశాలంగా నిర్మించారు.

ప్రస్తుతం కాలంలో భూగర్బంలో కాదు కదా కనీసం భూమ్మీద నిర్మించినా పతనం అయిపోతున్నాయి. అంతర్గత నిర్మాణాలకు చిహ్మంగా నిలిచిన జల్‌జవా భూగర్భ వాయుసైన్య స్థావరం గురించి మరిన్ని వివరాలు క్రింది కథనంలో తెలుసుకుందాం రండి.

రెండవ ప్రపంచ యుద్దం

రెండవ ప్రపంచ యుద్దం

రెండవ ప్రపంచ యుద్దంలో జర్మనీ నియంత అయిన హిట్లర్ సమక్షంలో జరిగిన దాడుల్లో నాశనం అయిన వాటిలో యుగోస్లోవియా ఒకటి. రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్ మరణించాడన్న వార్త తెలుసుకున్న యుగోస్లోవియా దేశీయంగా స్వతహాగా ప్రభుత్వాన్ని ఏర్పటు చేసుకుంది.

మొదటి కర్తవ్యం

మొదటి కర్తవ్యం

యుగోస్లోవియాలో ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రభుత్వం చేసిన మొదటి కర్తవ్యం ఎంటో తెలుసా ? విదేశాల నుండి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి యుగోస్లోవియా మొత్తం సైనిక శక్తిని విస్తరించుకుంది.

భూగర్బ ఆధారిత వాయుసైన్యం

భూగర్బ ఆధారిత వాయుసైన్యం

భూగర్భంలో రహస్యంగా వాయు సైన్యాన్ని ఏర్పాటు చేయాలని యుగోస్లోవియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంలో భాగంగానే ఈ జల్‌జవా భూగర్భ వాయుసైన్య స్థావరం ఏర్పడింది.

ప్రదేశం

ప్రదేశం

ఈ జల్‌జవా భూగర్భ వాయు స్థావరం బోస్నియా దగ్గరలో ఉన్న బిహాక్ నగరానికి సమీపంలో ఉన్న కొండ ప్రాతాల క్రింద గల సొరగంలో ఏర్పాటు చేసారు.

నిర్మాణం

నిర్మాణం

objekat 505 అనే కోడ్ పేరుతో ఈ భూగర్భ వాయు సైన్య స్థావర నిర్మాణం 1948 లో ప్రారంభం చేసి 1968 లో నిర్మాణాన్ని పూర్తి చేశారు. దీని పూర్తి నిర్మాణానికి సుమారుగా రెండు దశాబ్దాల కాలం పట్టింది.

పూర్తి స్థాయి నిర్మాణ ఖర్చు

పూర్తి స్థాయి నిర్మాణ ఖర్చు

యుగోస్లోవియా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ భూగర్భ వాయు సైన్య స్థావరాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టడానికి సుమారుగా అప్పట్లో 6 బిలియన్ డాలర్లను ఖర్చు చేశారు.

అన్ని భాగాలను ఒకే చోట

అన్ని భాగాలను ఒకే చోట

వాయు సైన్య ఆధారిత గనిలో అన్ని రకాల సమాచారాన్ని చేరవేయడానికి ప్రత్యేక సమాచార వ్యవస్థను మరియు శత్రువుల దాడులకు సంభందించినన సమాచారాన్ని లోపలి ఉన్న అన్ని విభాగాలకు చేరే విధంగా నిర్మించారు. ఇందుకోసం దీనిలో తరువాత కాలంలో రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

పొడవు

పొడవు

ఈ భూగర్బ స్థావరం యొక్క పొడవు సుమారుగా 3.5 కిలోమీటర్లు, మరియు ఇందులో విభజించిన విభాగాల వారిగా విమానాలను మరియు ఎయిర్ క్రాఫ్ట్‌లను తీసుకెళ్లడానికి వీలయ్యే విధంగా విశాలమైన ద్వారాలను నిర్మించారు.

సాధారణ బాంబుల నుండి అణు బాంబుల వరకు

సాధారణ బాంబుల నుండి అణు బాంబుల వరకు

నాగసాకి నగరంలో ప్రయోగించిన బాంబు పరిమాణానికి సమానమైన బాంబును దీని మీద ప్రయోగించి చూశారు. అయితే రంగు మారింది తప్ప ఏ మాత్రం చెక్కు చెదరలేదు. దాదాపుగా 20 టన్నుల పరిమాణంలో ఉన్న బాంబును ప్రయోగించినా కూడా ఇది చెక్కుచెదరకుండా స్థిరంగా ఉంటుంది.

ప్రత్యేక నిర్మాణం

ప్రత్యేక నిర్మాణం

ఎటువంటి శక్తివంతమైన బాంబు దాడులు జరిగినా కూడా చెక్కుచెదరకుండా దీనిని ప్రత్యేక నిర్మాణ శైలిలో నిర్మించారు. అంతే కాకుండా లోపల ఉన్న ప్రతి ఒక విభాగాన్ని కూడా ప్రత్యేకమైన ద్వారాలతో మూశారు. ఇవి అత్యంత భయంకరమైన దాడులను కూడా తట్టుకుంటాయి.

కాంక్రీట్ పూత

కాంక్రీట్ పూత

ఈ భూగర్భ స్థావరానికి పైన, క్రింది మరియు అన్ని వైపుల కూడా కాంక్రీట్ పూత పూశారు. అలాంటి ఇలాంటి పూత కాదు. బాంబు దాడులను సైతం తట్టుకునే విధంగా కాంక్రీట్ వినియోగించారు.

ఆహారం మరియు త్రాగునీరు

ఆహారం మరియు త్రాగునీరు

ఇందులో దాదాపుగా 1,000 మంది వరకు ఉద్యోగులు పని చేశారు. వారికి సుమారుగా నెల రోజులకు సరిపడే ఆహారం మరియు త్రాగు నీరు అందుబాటులో ఉంచేవారు. మరియు విద్యుత్ కోసం రెండు జనరేటర్లను అందుబాటులో ఉంచారు.

ఇంధన సరఫరా

ఇంధన సరఫరా

ఇందులోని సాయుధ వాహనాలకు కావాల్సిన ఇంధనాని పైపు లైన్ ద్వారా స్థావరంలోనికి సరఫరా చేసే వారు.

రన్‌వేలు

రన్‌వేలు

ఎయిర్ ఫోర్స్ వారు ఈ స్థావరం మీద ఐదు రన్‌వేలను నిర్మించారు. ఈ రన్‌వేలకు ఒక వైపు చివరన స్థావరంలోనికి ప్రవేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ నుండి శత్రువుల విమానాలను, మిస్సైల్స్ మరియు ఇతర అనధికార కార్యకలాపాలను గుర్తించడానికి ప్రత్యేక విభాగం ఉండేది.

ఫైరింగ్ అనుమతులు

ఫైరింగ్ అనుమతులు

ఈ స్థావరం లోపల మరియు బయటి వైపుల కాల్పులు లేదా దాడులు జరపాలన్నా ముందుగా సంభందిత అధికారుల నుండి అనుమతులు పొందాల్సి ఉంటుంది

కూలిపోయిన నిర్మాణం

కూలిపోయిన నిర్మాణం

ఈ భూగర్భ వాయుసైన్య స్థావరం నుండి బోస్నియా, క్రోయాటియా, హర్జిగోవానియా వంటి దేశాల మీద దాడులు కూడా నిర్వహించారు. కొన్నేళ్లకు ప్రభుత్వ పతనం తరువాత జరిగిన కొన్ని భయంకరమైన దాడుల వలన కొన్ని చోట్ల ఇది కూలిపోయింది.

ప్రస్తుతం

ప్రస్తుతం

ప్రస్తుతం ఇది దెయ్యాల గుహలా మారిపోయింది. ఒకానొక కాలంలో అనేక రకాల సేవలందించిన ఈ భూగర్భ వాయుసైన్య స్థావరం ఇప్పుడు పాతపడిపోయింది. దీనికి గురించి తెలిసిన వారు అప్పుడప్పుడు సందర్శనలకు కూడా వెలుతున్నారు.

పునఃవినియోగం దిశగా అడుగులు

పునఃవినియోగం దిశగా అడుగులు

ఈ స్థావరానికి దగ్గరలో ఉన్న బిహక్ నగరంలో ఉన్న ఎయిర్ పోర్ట్ రద్దీగా ఉంటే వాణిజ్యపరమైన విమానాలను ఇక్కడ ల్యాండింగ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్న రన్‌వేలను తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు బిహక్ పురపాలక నగరం ఆలోచిస్తోంది.

అణు బాంబులకు సైతం చెదరని జెల్‌జవా భూగర్భ స్థావరం

నాగసాకి మరియు హిరోషిమా నగరాల మీద దాడులకు తెగబడిన యుద్ద విమానం గురించి రహస్య వివరాలు

అణు బాంబులకు సైతం చెదరని జెల్‌జవా భూగర్భ స్థావరం

భారత సైన్యంలో ఉన్న 45 శక్తివంతమైన యుద్ద వాహనాలు

More from DriveSpark

Article Published On: Monday, April 25, 2016, 17:29 [IST]
English summary
Interesting Facts About Zeljava Underground Air Base
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+