మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా..?

మీలో చాలా మందికి మహీంద్రా కార్ల గురించి తెలిసే ఉంటుంది. ప్రత్యేకించి యుటిలిటీ వాహనాలను మాత్రమే తయారు చేస్తున్న మహీంద్రా అసలు ఈ వ్యాపారంలోకి ఎలా ప్రవేశించిందో తెలుసా? మహీంద్రా కార్ల వ్యాపారంలోకి రాక ముందు ఏం చేసేదో తెలుసా? అసలు ఈ కంపెనీని స్థాపించిన వ్యక్తులలో ఒకరు పాకిస్థాన్ కు చెందిన వారు అని మీకు తెలుసా? మహీంద్రా కంపెనీకి సంబంధించిన ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా..?

భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందే..

మహీంద్రా కంపెనీ భారతదేశానికి స్వాంత్ర్యం రాక ముందే ప్రారంభమైంది. నిజానికి మహీంద్రా ప్రారంభంలో కార్లను తయారు చేసేది కాదు. మొదట్లో ఈ కంపెనీ ఓ స్టీల్ ట్రేడింగ్ సంస్థగా వ్యాపారం ప్రారంభించింది. 1945లో మహీంద్రా సోదరులు కైలాష్ చంద్ర మహీంద్రా మరియు జగదీష్ చంద్ర మహీంద్రాలతో పాటుగా మాలిక్ గులాం ముహమ్మద్ అనే ముగ్గురు వ్యక్తులు కలిసి ఈ సంస్థను ప్రారంభించారు.

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా..?

మహీంద్రా అండ్ మహీంద్రా అసలు పేరు 'మహీంద్రా అండ్ మహమ్మద్'..

ప్రస్తుతం మహీంద్రా అండ్ మహీంద్రాగా పరిచయం అయిన ఈ కంపెనీ అసలు పేరు 'మహీంద్రా అండ్ మహమ్మద్' (Mahindra & Muhammad). భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన, పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడిన తరువాత, మాలిక్ గులాం మహమ్మద్ పాకిస్తాన్‌కు వలస వెళ్ళి, ఆ దేశ పౌరసత్వాన్ని పొందాడు. ఆ తర్వాత పాకిస్తాన్ మొదటి ఆర్థిక మంత్రి అయ్యారు ఆ తర్వాత అతను 1951 నుండి 1956 వరకు పాకిస్తాన్ గవర్నర్ జనరల్‌గా కూడా పనిచేశారు. మహీంద్రా అండ్ మహమ్మద్ గ్రూప్ నుండి ఆయన నిష్క్రమించిన తర్వాత 1948లో ఈ కంపెనీ పేరును మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) మార్చారు.

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా..?

మొట్టమొదటి విల్లీస్ జీప్స్ గుర్తున్నాయా..?

ఈ కంపెనీ నుండి మహమ్మద్ నిష్క్రమించి పాకిస్థాన్ కు వెళ్లిన తర్వాత నుండి మహీంద్రా సోదరులే ఈ కంపెనీ నిర్వహించడం ప్రారంభించారు. ఆ తర్వాత మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ 1954 లో కార్ల వ్యాపారంలోకి ప్రవేశించింది. భారతదేశంలో విల్లీస్ జీప్ యొక్క లైసెన్స్ క్రింద మహీంద్రా వాహనాలను అసెంబ్లింగ్ చేయడం ప్రారంభించింది. అతి తక్కువ సమయంలోనే మహీంద్రా అండ్ మహీంద్రా భారతదేశంలో ప్రముఖ జీప్ తయారీదారుగా అవతరించింది. ఆ తరువాత తేలికపాటి వాణిజ్య వాహనాలను మరియు వ్యవసాయ ట్రాక్టర్లను తయారు చేయటం ప్రారంభించింది.

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా..?

ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాక్టర్ తయారీదారు..

మహీంద్రా సంస్థ 1999లో, గుజరాత్ ప్రభుత్వం నుండి 100 శాతం గుజరాత్ ట్రాక్టర్‌లను కొనుగోలు చేసింది మరియు 2017లో మహీంద్రా కొత్త బ్రాండ్ వ్యూహంలో భాగంగా గ్రోమ్యాక్స్ అగ్రి ఎక్విప్‌మెంట్ లిమిటెడ్‌గా పేరు మార్చింది. అలాగే, మహీంద్రా అండ్ మహీంద్రా 2007లో పంజాబ్ ట్రాక్టర్ లిమిటెడ్ (PTL)ని కొనుగోలు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాక్టర్ తయారీదారుగా అవతరించింది. ఈ టేకోవర్ తర్వాత, మాజీ పంజాబ్ ట్రాక్టర్ లిమిటెడ్ మహీంద్రా సంస్థలో విలీనం చేయబడింది మరియు 2009లో మహీంద్రా అండ్ మహీంద్రా యొక్క 'స్వరాజ్' విభాగంగా రూపాంతరం చెందింది.

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా..?

మహీంద్రా జీప్ సిజె3 తో ఆటోమోటివ్ ప్రయాణం షురూ..

మహీంద్రా 1954లో జీప్ సిజె3 ఎస్‌యూవీని మరియు 1965లో తేలికపాటి వాణిజ్య వాహనాలను అసెంబ్లింగ్ చేయడం ప్రారంభించింది. ఆ రోజుతో ప్రారంభమైన మహీంద్రా ఆటోమొబైల్ ప్రయాణం ఇప్పటికీ విజయవంతంగా సాగుతోంది. ప్రస్తుతం, ఈ కంపెనీ నుండి బొలెరో, స్కార్పియో, ఎక్స్‌యూవీ300, ఎక్స్‌యూవీ500 మరియు ఎక్స్‌యూవీ700 వంటి మరెన్నో పాపులర్ యుటిలిటీ వాహనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మహీంద్రా వెరిటో (గతంలో రెనో లోగాన్) ద్వారా కంపెనీ సెడాన్ వ్యాపారంలోకి ప్రవేశించినప్పటికీ, మహీంద్రా యుటిలిటీ వాహనాలకు లభించిన ఆదరణ ఈ సెడాన్ కు లభించలేదు.

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా..?

CRDe ఇంజన్‌ను మొదటిసారిగా పరిచయం చేసిన కంపెనీ..

మహీంద్రా భారతదేశంలో కామన్ రైల్ డీజిల్ ఇంజన్ (CRDe) అని పిలువబడే మోటారును పరిచయం చేసిన మొదటి కంపెనీ. దేశంలో తొలిసారిగా 2005లో ఈ ఇంజన్‌ను ప్రవేశపెట్టారు. దీన్ని అందుకున్న మొదటి ఉత్పత్తి మహీంద్రా స్కార్పియో (Mahindra Scorpio). మహీంద్రా స్కార్పియోను భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వాహనంగా మార్చడంలో ఈ ఇంజన్ గొప్ప సహాయాన్ని అందించింది.

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా..?

ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో తనదైన పాదముద్ర..

ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో కూడా మహీంద్రా తనదైన పాదముద్ర వేసుకుంది. నిజానికి, భారతదేశంలో మొదటి 4-సీటర్ ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టిన ఘనత కూడా మహీంద్రాకే దక్కుతుంది. గత 2010లో మహీంద్రా అండ్ మహీంద్రా రేవా (REVA) ఎలక్ట్రిక్ కార్ కంపెనీలో 55 శాతం వాటాను కొనుగోలు చేయడం ద్వారా ఈ వ్యాపారంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత 2016లో, పూర్తిగా 100 శాతం వాటాను కొనుగోలు చేసి మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్‌గా పేరు మార్చారు. ప్రస్తుతం, ఈ కంపెనీ లేటెస్ట్ ఎలక్ట్రిక్ కార్లను అభివృద్ధి చేయడంపై పనిచేస్తోంది.

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా..?

అత్యంత సురక్షితమైన మహీంద్రా కార్లు..

మహీంద్రా అండ్ మహీంద్రా తయారు చేస్తున్న లేటెస్ట్ కార్లు ఇప్పుడు సేఫ్టీలో కూడా ది బెస్ట్ అనిపించుకుంటున్నాయి. ఈ కంపెనీ తయారు చేస్తున్నా కార్లు ఇప్పుడు అత్యుత్తమ సేఫ్టీ రేటింగ్ లను దక్కించుకుంటున్నాయి. గ్లోబల్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్టులో మహీంద్రా ఎక్స్‌యూవీ300 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందగా, మహీంద్రా మరాజో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను, మహీంద్రా థార్ 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను మరియు మహీంద్రా ఎక్స్‌యూవీ700 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లను పొందాయి.

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా..?

ప్రస్తుత చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఎవరు..?

ప్రస్తుతం మహీంద్రా గ్రూపుకి చైర్మన్ గా ఉన్న ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) జగదీష్ చంద్ర మహీంద్రా (J.C. Mahindra) కి మనవడు. మహీంద్రా గ్రూప్ ప్రస్తుతం 22 పరిశ్రమలలో 150 కి పైగా కంపెనీలను కలిగి ఉంది. వీటిలో ఐటి, ఆటోమొబైల్స్, అగ్రికల్చర్ మరియు వ్యవసాయ పరికరాలు, విమానయానం, విడిభాగాలు, పడవలు, సోలార్ ఎనర్జీ, కన్స్‌స్ట్రక్షన్ పరికరాలు, రక్షణ రంగం కోసం వాహనాలు, ఆతిధ్య రంగం (హాస్పిటాలిటీ), రవాణా (లాజిస్టిక్స్), ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, రీటైల్ బిజినెస్, పవర్ బ్యాకప్ (జనరేటర్స్), స్టీల్, ట్రక్కులు మరియు బస్సులు, ద్విచక్ర వాహనాలు, ఫైనాన్సింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టే అవుతుంది.

Most Read Articles

English summary
Interesting facts and history of mahindra and mahindra limted
Story first published: Monday, December 13, 2021, 12:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X