పఠాన్ కోట్‌ దాడిలో ‌టెర్రిస్ట్‌లను వెతకడానికి సహాయపడిన హెరాన్ డ్రోన్

By Anil

పఠాన్ కోట్ లో భారతీయ సైన్యం మీదకు పాక్ మూకలు ఎంతో భయంకరంగా విరుచుకుపడ్డాయి. అయితే పాక్ టెర్రరిస్ట్‌లను మన భారత సైన్యం వెంటాడి మరీ తుద ముట్టించింది. పాక్ టెర్రరిస్ట్‌లు పఠాన్ కోట్‌ గగన తలంలో ఉన్న భారత స్థావరాలనే లక్ష్యంగా పెట్టుకుని అక్రమంగా మన భూ భాగంలోకి ప్రవేశించారు. అయితే హెరాన్ అనే డ్రోన్ వారిని వెతికి మరి మన సైన్యానికి అందించింది. టెర్రరిస్ట్‌లను వెతికేపనిలో హెరాన్ డ్రోన్ ఒక అత్భుతం అని చెప్పవచ్చు.

దాదాపుగా 2,000 వేల ఎకరాల విస్తీర్ణం గల పఠాన్ కోట్ అటవీ ప్రాంతాన్ని మొత్తం జల్లెడ పట్టి పాక్ టెర్రరిస్ట్‌లను వెతికి పెట్టింది ఈ హెరాన్ డ్రోన్. ఇలా భారత సైన్యానికి ఎంతగానో ఉపయోగపడిన హెరాన్‌ డ్రోన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు క్రింద కథనంలో.....

ఇది ఎలా వెతుకుతుంది

ఇది ఎలా వెతుకుతుంది

మానవ శరీరం యొక్క ఉష్ణ్రోతలను ఈ డ్రోన్ విమానానికి అందిస్తారు. కంట్రోల్ నుండి దీనికి సమాచారం అందిన తరువాత ఇది నిర్ధేశించిన ప్రాంతంలోకి వెళ్లి వెతకడం ప్రారంభిస్తుంది.

 దీనిని ఏ దేశస్థులు రూపొందించారు

దీనిని ఏ దేశస్థులు రూపొందించారు

ఈ హెరాన్ డ్రోన్ విమానాన్ని ఇజ్రాయెల్ దేశాస్థులు తయారు చేశారు. వీటినే కాకుండా రక్షణ రంగానికి అనేక ఉత్పత్తులను వీరు సృష్టిస్తున్నారు. ఇలా గూఢఛార్యులను వెతికే డ్రోన్‌లను ప్రపంచ దేశాలకు అందిస్తోంది. అందులో భారత్ కూడా...

స్వయం చాలకంగా

స్వయం చాలకంగా

కంట్రోల్ సెంటర్ నుండి సమాచారం అందిన తరువాత ఇది దుండగులను గుర్తించడానికి ఏ సమయంలోనైనా వెళ్లిపోతుంది. మరియు దీనిని ఇదే ఎంతో సులభంగా నియంత్రించుకుంటుంది.

థర్మో గ్రాఫిక్ కెమెరా

థర్మో గ్రాఫిక్ కెమెరా

ఈ రహస్య గగన విహంగంలో థర్మో గ్రాఫిక్ కెమెరా కలదు ఇది మానవ కదలికలను స్పష్టంగా సేకరించగలదు. మరియు వారి కదలికలు, ప్రయాణించే దిశ మరియు వారి శరీర ఉష్ణ్రోగ్రతలను లెక్కించి కంట్రోల్ రూమ్ వారికి సమాచారం చేరవేస్తుంది.

ఉత్తమ పనితీరు

ఉత్తమ పనితీరు

అత్యంత ప్రతికూలమైన వాతావరణ పరిస్థితులలో కూడా ఇది చక్కగా ఎగురుతూ అందరిని పసిగడుతుంది. ఇంకా దీని ప్రత్యేకత, ఎటువంటి ఆపరేషన్స్‌లలో అయినా ఇది చురుకుగా అన్ని వేళల్లో పాల్గొంటుంది.

ఇతర అవసరాలకు

ఇతర అవసరాలకు

భారత వైమనిక దళం రెస్క్యూ విధులలో వీటిని ఉపయోగిస్తున్నారు. మానవ రహిత ఈ హెరాన్ డ్రోన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఎంతో ముఖ్యమైనది.

గాలిలో ఎగరగలిగే సమయం

గాలిలో ఎగరగలిగే సమయం

ఈ హెరాన్ డ్రోన్ దాదాపుగా 52 గంటల పాటు గాలిలో ఎగరగలదు మరియు ఇది అత్యధికంగా 10.5 కిలీమీటర్ల ఎత్తు వరకు ఎగరగలదు.

హెరాన్ డ్రోన్ కొలతలు

హెరాన్ డ్రోన్ కొలతలు

హెరాన్ డ్రోన్ 8.5 మీటర్ల పొడవు మరియు 16.60 మీటర్ల వెడల్పు ఉంటుంది. దీనిని దాదాపుగా 350 కిలో మీటర్లు వరకు నిరంతరాయంగా నడపవచ్చు.

వేగం

వేగం

హెరాన్ డ్రోన్ యొక్క అత్యధిక వేగం గంటకు 207 కిలో మీటర్లు మరియు ఈ గూఢచర్య విమానం దాదాపుగా 250 కిలోలు మోసుకెళ్లే సామర్థ్యం కలదు.

ధర

ధర

హెరాన్ డ్రోన్ ధర ఎక్కువగానే ఉంటుంది. దీని ధర 10 మిలియన్ డాలర్లు.

మరిన్ని కథనాలు
  1. భారతీయ సైన్యంలో ఉన్న శక్తివంతమైన యుద్ద వాహనాలు
  2. తీర ప్రాంతాల్లో మొహరించిన అమెరికా ఆంపిబియస్ యుద్ద ట్యాంకులు
  3. ISIS తీవ్రవాదుల సమూల నాశనానికి ఫ్రాన్స్ పథకం

More from DriveSpark

Article Published On: Tuesday, January 5, 2016, 15:33 [IST]
English summary
IAF's Heron-1 played a crucial part in search operations in recent Pathankot airbase station terrorist attack. Here are given some interesting bits about Heron drone.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+