ప్రపంచ విమానయాన రంగం గురించి 25 ఆసక్తికరమైన నిజాలు
ఆధునిక ప్రపంచానికి ఆటోమొబైల్స్ యొక్క ఆవశ్యకత ఎంత ఉందో, విమానయాన రంగం ఆవశ్యకత కూడా అంతే ఉంది. రెండు మూడు దశబ్దాల క్రింత ఆటోమొబైల్స్ మీద తీవ్ర ప్రయోగాలు జరిగి సఫలం చెందాయి. కాని విమానయాన రంగాన్ని వస్తే క్రీస్తు పూర్వ కాలంలోనే గాలిలో ఎగిరే వస్తువుల రూపకల్పనకు శ్రీకారం చుట్టినట్లు తెలస్తోంది. కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగిన విమానయాన రంగం నేడు ఎన్నో కొత్త పుంతలు తొక్కుతోంది. ఇలాంటి ఏవియేషన్ రంగం గురించి అత్యంత ఆసక్తికరమైన 25 ఫన్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం.

1919
విమానాల మీద ఎన్నో ఏళ్ల నుండి ప్రయోగాలు జరిగినప్పటికీ కెఎల్‌ఎమ్ అనే ఎయిర్ లైన్స్ మొట్టమొదట సారిగా విమాన సేవలను ప్రారంభించింది. 1919 లో ప్రారంభించబడిన ఇది ప్రపంచపు అతి పురాతణమైన ఎయిర్‌లైన్స్‌గా నిలిచింది.

1920
రెండవ అత్యంత పురాతణమైన ఎయిర్ లైన్స్ సంస్థ క్వాంటాస్.

40,000 అమెరికా డాలర్లు
1987 సంవత్సరంలో అమెరికాకు చెందిన ఎయిర్ లైన్స్‌లోని విమానాలలో గలల మొదటి తరగతి శ్రేణిలో ప్రయాణికులకు సర్వ్ చేసే సలార్డ్‌లో ఒక్క ఆలివ్‌ను తొలగించినందుకుగాను. సుమారుగా 40,000 అమెరికన్ డాలర్లను మిగిలించుకుంది.

ప్రతి 37 సెకండ్లకు
చికాగోలోని ఒ'హరేస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రతి 37 సెకండ్లకు ఒక ఎయిర్ క్రాఫ్ట్ టేకాఫ్ లేదా ల్యాండింగ్ అవుతూ ఉంటుంది.

రెక్కల పొడవు
ఏ380 అనే ఎయిర్ క్రాఫ్ట్ బాడీ పొడవు కన్నా దాని రెండు రెక్కల పొడవు ఎక్కువగా ఉంటుంది. బాడీ పొడవు 72.7 మీటర్లు ఉండగా, వింగ్ స్పాన్ (రెండు రెక్కల పొడవు) 80 మీటర్లుగా ఉంది.

700మిలియన్ డాలర్లు
సింగపూర్ ఎయిర్‌లైన్స్ ప్రతి ఏడాది కూడా ఆహారం కోసం 700 మిలియన్ డాలర్లు మరియు మద్యం కోసం 16 మిలియన్ డాలర్లను ఖర్చు చేస్తోంది.

1.5 లీటర్ల నీరు
సగటున 3 గంటల మేర విమానం ద్వారా ప్రయాణం చేసినపుడు మానవ శరీరం నుండి 1.5 లీటర్ల నీరు ఆవిరైపోతుంది.

జెఎఫ్‌కె ఎయిర్ పోర్ట్
న్యూయార్క్‌లోని జెఎఫ్‌కె ఎయిర్ పోర్ట్ అసలు పేరు ఐడిల్‌విల్డ్ ఎయిర్ పోర్ట్. 1963 లో 35 వ అమెరికా అధ్యక్షుడికి గుర్తుగా ఆయనపేరు జాన్ ఎఫ్. కెన్నెడీ మీదుగా జెకెఎఫ్‌గా మర్పు చెందింది.

10 టన్నులు
ప్రపంచంలో అత్యంతధికంగా చేప గుడ్లను కొనుగోలు చేస్తున్నది లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్. ఏడాదికి సుమారుగా 10 టన్నుల చేప గుడ్లను కొనుగోలు చేస్తోంది.

120 అడుగులు
బోయింగ్ 747 విమానం యొక్క రెక్కల మొత్తం పొడవు (195 అడుగులు) రైట్ బ్రదర్స్ సృష్టించిన మొదటి విమానం యొక్క రెక్కల పొడవు (120 అడుగులు) కన్నా ఎక్కువగా ఉంటుంది.

చెక్-ఇన్
ఇంటర్నెట్ మరియు ఆన్ లైన్‌లలో ఎక్కువగా కనబడే చెక్-ఇన్ అనే పదాన్ని మొదటి సారిగా 1999 లో అలస్కా ఎయిర్ లైన్స్ వారు పరిచయం చేశారు.

2.4 మీటర్లు
ఎయిర్ బస్ ఏ380-200 విమానాలలో రెక్కల చివరలో ఉన్న తోక భాగంలో మరియు విమానం వెనుకన ఉన్న తోక భాగంలో పై వైపుకు ఉన్న రెక్కల ఎత్తు ప్రపంచంలో అత్యంత పొడవున్న మనిషి (2.4 మీటర్లు) ఎత్తుకు సమానం.

4,80,000
747-8 విమానంలో ఉండే మొత్తం విద్యుత్ శక్తిని 32 ఇంచుల తెర గల 4,80,000 టీవీలకు సప్లే చేయవచ్చు.

78 బిలియన్
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మొత్తం 747 విమానాలు సుమారుగా 78 బిలియన్ కిలోమీటర్ల మేర నడిచాయి. అంటే ఇది భూమి నుండి చంద్రునికి 1,01,500 సార్లు వెళ్లి వచ్చే దానికి సమానం.

80 శాతం
747 కుటుంబంలోని మొత్తం విమానాలు ఇప్పటి వరకు 5.6 బిలియన్ ప్రజలకు ప్రయాణాన్ని కల్పించాయి. అంటే ఇది ప్రపంచంలోని 80 శాతం జనాభాకు సమానం.

61,000 మంది ప్రజలు
అమెరికాలో 24 గంటల్లో ఏ గడియలోనైనా సుమారుగా 61,000 మంది వాయు మార్గంలో ప్రయాణిస్తుంటారు.

70 శాతం కన్నా ఎక్కువ
1960 కాలం నాటి జెట్‌ల కన్నా నేడు ఉన్న 70 శాతం విమానాలు 70 శాతం కన్నా ఎక్కువ ఇంధన సామర్థ్యాన్ని (కిలోమీటర్/సీట్) కలిగి ఉన్నాయి.

1979
మీకు తెలుసా మొదటి బిజినెస్ క్లాస్ ను క్వాంటాస్ తమ విమానాలలో 1979 లో పరిచయం చేసింది.

అత్యంత పొడవైన విమానం ప్రయాణం
ప్రపంచంలో అత్యంత దూరం ప్రయాణించే విమానం క్వాంటాస్ వారి ఏ380. సిడ్నీ నుండి డల్లాస్‌కు ప్రయాణిస్తుంది.

ఐప్యాడ్
అమెరికన్ ఎయిర్ లైన్స్ వారు పేపర్ ద్వారా మ్యాన్యువల్స్ వాడకాన్ని ఐప్యాడ్ రూపంలోకి మార్చుకోవడం ద్వారా 1.2 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన ఇంధనాన్ని సేవ్ చేశారు.

240 కిలోమీటర్లు
747 విమానాలలో సగటున 240 నుండి 280 కిలోమీటర్ల పొడవైన వైరింగ్ కలదు.

30,000
అమెరికాలో సుమారుగా 20 లక్షల మంది ప్రజలు విమాన ప్రయాణం చేస్తున్నారు. అందుకోసం సుమారుగా 30,000 విమానాలను ప్రతి రోజూ నడుపుతున్నారు.

భోజనాలు
పైలట్లు మరియు కో-పైలట్లకు ఒకే విధమైన ఆహారాన్ని అందివ్వకుండా వేర్వేరు ఆహారాలను అందిస్తారు. ఒక వేళ విషఆహారం కలిసి ఉంటే ప్రమాదం అని దీనిని పాటిస్తారు.

రుచి
విమానంలో ప్రయాణంలో సుమారుగా మూడవ వంతు ఆహార పదర్థాలను రుచించలేరు.

800 కిలోమీటర్లు/గంటకు
ఒక కమర్షియల్ విమనం యొక్క సగటు వేగం గంటకు 800 కిలోమీటర్లుగా ఉంటుంది.

బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ వీడినట్లేనా ?
కేవలం రెండే గంటల్లో ప్రపంచంలోని ఏ మూలకైనా చేరుకోగలదు


Click it and Unblock the Notifications








