మిస్టరీ రైలులో నార్త్ కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ రహస్య చైనా పర్యటన

తన దుర్మార్గపు చర్యలతో ప్రపంచ దేశాలను భయకంపితుల్ని చేస్తున్న నార్త్ కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ ఒక మిస్టరీ బుల్లుట్ ప్రూఫ్ రైలును ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. కిమ్ జాంగ్ ఉన్న తన బుల్లెట్ ప్రూఫ్ రైలులో

By N Kumar

వివిధ దేశాల అధ్యక్షలు బాంబర్ విమానాలు, బుల్లెట్ ప్రూఫ్ లగ్జరీ బస్సులను వినియోగించడాన్ని చూసుంటాము. కానీ, తన దుర్మార్గపు చర్యలతో ప్రపంచ దేశాలను భయకంపితుల్ని చేస్తున్న నార్త్ కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ ఒక మిస్టరీ బుల్లుట్ ప్రూఫ్ రైలును ఉపయోగిస్తున్నట్లు తెలిసింది.

కిమ్ జాంగ్ ఉన్న తన బుల్లెట్ ప్రూఫ్ రైలులో చైనాకు అత్యంత రహస్య పర్యటన చేశాడనే వార్త ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిపోయింది.

కిమ్ జాంగ్ ఉన్ మిస్టరీ రైలు

నార్త్ కొరియా అధ్యక్షుడు చైనా పర్యటన వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు ఎన్నో కథనాలు వచ్చాయి. అయితే, ఎట్టకేలకు కిమ్ జాంగ్ తన చైనా పర్యటన పూర్తి చేసుకున్నాడు. కిమ్ జాంగ్ తన వ్యక్తిగత మిస్టరీ రైలులో అత్యంత రహస్యంగా చైనా పర్యటను ముగించుకున్నాడు.

కిమ్ జాంగ్ ఉన్ మిస్టరీ రైలు

కిమ్ జాంగ్ ఉన్ దుందుడుకు చర్యలతో ఆయన మీద ప్రపంచ దేశాలు కోపంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే భద్రత దృష్ట్యా బుల్లెట్ ప్రూఫ్ ప్రత్యేక రైలును తన రహస్య చైనా పర్యటనకు ఉపయోగించినట్లు తెలిసింది.

కిమ్ జాంగ్ ఉన్ మిస్టరీ రైలు

అంతే కాకుండా, కిమ్ భద్రత కోసం ఆయన ప్రయాణించే పెట్టెకు ఇరువైపులా భద్రత కోసం సుమారుగా 90 మంది సెక్యూరిటీ సిబ్బందికి సీటింగ్ ఏర్పాటు చేశారు.

కిమ్ జాంగ్ ఉన్ మిస్టరీ రైలు

ఉత్తర కొరియా అధ్యక్షుడి కోసం మొత్తం మూడు రైళ్లు ఉంటాయి. వాటిలో, అడ్వాన్స్‌డ్ సెక్యురీటి రైలు, అధ్యక్షుడి రైలు మరియు మూడవ రైళును భద్రత బలగాల రవాణా మరియు ఇతర వస్తువుల సరఫరా అవసరాల కోసం ఉపయోగిస్తారు.

కిమ్ జాంగ్ ఉన్ మిస్టరీ రైలు

కొరియా మరియు సమీప ఇతర దేశాలకు రహస్యంగా ప్రయాణించడానికి కిమ్ జాంగ్ ఉన్ ఇదే హై సెక్యూరిటీ రైలును ఉపయోగిస్తాడని తెలిసింది. ఇదే క్రమంలో చైనా అధికారులను రహస్యంగా కలవడానికి వచ్చిన కిమ్ రైలు డార్క్ గ్రీన్ కలర్‌లో ఉండటాన్ని గుర్తించారు.

కిమ్ జాంగ్ ఉన్ మిస్టరీ రైలు

ఈ రైలును కొరియా నియంత భద్రత కోసం బుల్లెట్ ప్రూఫ్ సౌకర్యాలతో నిర్మించారు. సౌకర్యం మరియు విలాసం కోసం శాటిలైట్ ఫోన్ మరియు అత్యవసర పరిస్థితుల్లో ఆర్డర్లను జారీ చేయడానికి ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ వంటి వ్యవస్థలు ఉన్నాయి.

Recommended Video

What Does The ‘X’ On The Back Of Trains Mean? - DriveSpark
కిమ్ జాంగ్ ఉన్ మిస్టరీ రైలు

అధ్యక్షుడు రైలు ప్రయాణంలో ఉన్నపుడు ఎవరైనా దాడులు జరిపితే తిప్పికొట్టేందుకు ప్రత్యేక ఆర్మీ బృందం మరియు తుపాకీ, బాంబు దాడులు తన వరకు చేరకుండా రక్షించేందుకు రైలులో అంతర్గతంగా ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. రసాయన దాడులు జరిగితే ఎలాంటి ఇబ్బంది లేదు. రైలు ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది.

కిమ్ జాంగ్ ఉన్ మిస్టరీ రైలు

అత్యంత సురక్షితమైన రైలుగా చెప్పుకునే ఈ రైలు గరిష్ట వేగం గంటకు 61 కిలోమీటర్లు మాత్రమే. కానీ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బుల్లెట్ రైళ్ల కంటే అత్యంత మెరుగైనది. రైలు మీద దాడులు జరినపుడు అత్యవసర పరిస్థితుల్లో తప్పించుకునేందుకు రైలులో కొన్ని శక్తివంతమైన యుద్ద వాహనాలు కూడా ఉన్నాయి.

కిమ్ జాంగ్ ఉన్ మిస్టరీ రైలు

ఈ రైలు మీద చిన్న పరిమాణంలో ఉన్న హెలీకాఫ్టర్లను నిలపవచ్చు. దీంతో, కిమ్ జాంగ్ ఉన్ భద్రతకు ముప్పు వాటిల్లితే, యుద్ద వాహనాల ద్వారా తప్పించుకోవడానికి అవకాశం లేనపుడు హెలీకాఫ్టర్ ద్వారా తప్పించుకోవచ్చు.

కిమ్ జాంగ్ ఉన్ మిస్టరీ రైలు

కిమ్ జాంగ్ ఉన్ రైలు ప్రయాణం ప్రారంభానికి ముందు, సెక్యూరిటీ సిబ్బంది ఎన్నో రకాల భద్రతా తనిఖీలు నిర్వహిస్తారు. అంతే కాకుండా, కిమ్ వెళ్లే మార్గంలో పలు రకాల పరీక్షలు, రిహార్సల్స్ మరియు రూట్లను పరిశీలిస్తారు.

కిమ్ జాంగ్ ఉన్ మిస్టరీ రైలు

కింమ్ జాంగ్ ఉన్ లైఫ్ ఏ మాత్రం రిస్క్‌లో పడకుండా, దేశ సంపదతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. తన జీవిత భాగస్వామి లగ్జరీ లైఫ్ కోసం కార్లు, విమానాలు, పెద్ద పెద్ద నౌకలు ఇంకా ఎన్నో ఖరీదైన వాహనాలు ఉన్నాయి. అందులో భాగంగానే, విశ్రాంతి గదులు, పడక గదులు మరియు కిచెన్ ఇలా ఎన్నో సౌకర్యాలు ఈ రైలులో ఉన్నాయి.

కిమ్ జాంగ్ ఉన్ మిస్టరీ రైలు

రైలు ముందు నుండి చివరి వరకు ఉన్న అన్ని భోగీలలో భద్రత అధికంగా ఉంటుంది. అంతే కాకుండా, రైలులో కిమ్ జాంగ్ ఉన్ ప్రయాణించే భోగీకి దగ్గరలో ఆయన సన్నిహితులు ప్రయాణిస్తారు. రైలు ఏ మార్గంలో వెళ్లినా ఒక ప్రత్యేక నిఘా విభాగం రైలు భద్రతను పర్యవేక్షిస్తూ ఉంటుంది.

కిమ్ జాంగ్ ఉన్ మిస్టరీ రైలు

రిపోర్స్ మేరకు, ఈ రైలు గరిష్టంగా 1,100 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. సాధారణంగా ఈ మొత్తం దూరాన్ని చేధించడానికి 14 గంటల సమయం పడుతుంది. అయితే, నార్త్ కొరియా అధ్యక్షుడు ప్రయాణిస్తుండటంతో ఆయన భద్రత మరియు ఆ మార్గంలో ఉన్న రద్దీకి అనుగుణంగా ఇంకా ఎక్కువ సమయం తీసుకుంటుంది.

కిమ్ జాంగ్ ఉన్ మిస్టరీ రైలు

కిమ్ జాంగ్ ఉన్ డార్క్ గ్రీన్ కలర్ రైలు చైనాలోని బీజింగ్ నగరానికి చేరుకున్నపుడు, స్టేషన్ మొత్తం భద్రతా బలగాలు, ప్రయాణికులు, పబ్లిక్ మరియు ఇతర రైల్వే స్టేషన్ సిబ్బందితో కిక్కిరిసిపోయింది. వ్యక్తి గత సిబ్బందిని మినహాయి ఆయనకు సమీపంగా ఎవ్వరినీ అనుమంతిచలేదు.

కిమ్ జాంగ్ ఉన్ మిస్టరీ రైలు

రైల్వే స్టేషన్ నుండి వెళ్లడానికి మెర్సిడెస్ బెంజ్ ఎస్60 పుల్‌మ్యాన్ లిమోసిన్ కారును ఏర్పాటు చేశారు. 2011లో నార్త్ కొరియా అధ్యక్షుడి పదవిని చేపట్టిన తరువాత కిమ్ జాంగ్ ఉన్ తన మొదటి విదేశీ పర్యటన చేశారు.

కిమ్ జాంగ్ ఉన్ మిస్టరీ రైలు

ఒక దేశాధ్యక్షుడు వ్యక్తిగత విలాసవంతమైన బుల్లెట్ ప్రూఫ్ రైలును ఉపయోగిస్తుండటంతో ప్రపంచ మీడియా ప్రతినిధుల దృష్టిని ఆకర్షించింది. కిమ్ జాంగ్ ఉన్‌తో పాటు తన తండ్రి కిమ్ జాంగ్ ఇల్ కూడా ఈ రైలును ఉపయోగించేవాడు.

కిమ్ జాంగ్ ఉన్ మిస్టరీ రైలు

1994 నుండి 2011 వరకు కిమ్ జాంగ్ ఇల్ సేవలో మరియు 2011 నుండి ఇప్పటి వరకు కింమ్ జాంగ్ ఉన్ సేవలో ఉన్న రైలు చైనా మరియు రష్యా పర్యటనలతో పాటు మరెన్నో రహస్య పర్యటనలు చేసింది.

కిమ్ జాంగ్ ఉన్ మిస్టరీ రైలు

ఏదేమైనప్పటికీ, కిమ్ జాంగ్ ఉన్ ఫ్యామిలీ ఎప్పుడు విమానాలలో ప్రయాణించదు. దేశీయ మరియు విదేశీ ఎలాంటి పర్యటనలైనా రైళ్లను ఉపయోగిస్తారు. తండ్రీ కొడుకులు ఈ రైలులో చైనాకు చేసిన చేసిన పర్యటనలే ఎక్కువ.

Source: nytimes

కిమ్ జాంగ్ ఉన్ కార్ కలెక్షన్

కిమ్ జాంగ్ ఉన్ ప్రయాణ అవసరాలకు వినియోగించే వాహన శ్రేణి గురించి తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం. సుమారుగా 100 కు పైగా లగ్జరీ కార్లు, ఓ విలాసవంతమైన నౌక (యాచ్) మరియు ప్రత్యేకంగా మోడిఫై చేయించుకున్న వ్యక్తిగత విమానం కూడా కలదు.

కిమ్ జాంగ్ ఉన్ కార్ కలెక్షన్

ఉత్తర కొరియాలోని ఓ సాధారణ వ్యక్తికి కనీసం సైకిల్ కొనుక్కునే స్తోమత కూడా లేదు. కానీ కిమ్ జాంగ్ ఉన్ ఆ దేశ నిధులతో విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు.

కిమ్ జాంగ్ ఉన్ కార్ కలెక్షన్

కిమ్ జాంగ్ ఉన్ ఎక్కువగా మెర్సిడెస్ బెంజ్ కార్లకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చాడు. తన దేశంలోని సైనికాధికారులకు బహుమానంగా ప్రదానం చేసే దగ్గరనుండి, తన వ్యక్తిగత అవసరాల వరకు మెర్సిడెస్ కార్లకే మొగ్గు చూపుతాడు.

కిమ్ జాంగ్ ఉన్ కార్ కలెక్షన్

కిమ్ జాంగ్ ఉన్ ప్రస్తుతం వినియోగిస్తున్న మెర్సిడెస్ బెంజ్ కారును తన తండ్రి వద్ద నుండి పొందాడు.

కిమ్ జాంగ్ ఉన్ కార్ కలెక్షన్

ప్రస్తుతం కిమ్ జాంగ్ ఉన్ వద్ద ఉన్న 100 లగ్జరీ కార్లలో అత్యంత ప్రాధాన్యం గల కారు మెర్సిడెస్ బెంజ్ పుల్‌మ్యాన్ గార్డ్ లిమోసిన్.

కిమ్ జాంగ్ ఉన్ కార్ కలెక్షన్

కిమ్ జాంగ్ ఉన్ తండ్రి కిమ్ జాంగ్ ఇల్ దీనిని 2009లో చైనా నుండి కొనుగోలు చేసి, దిగుమతి చేసుకున్నాడు. అయితే కిమ్ జాంగ్ ఇల్ మరణించిన తరువాత ఇప్పుడు కిమ్ జాంగ్ ఉన్ ఉపయోగిస్తున్నాడు.

కిమ్ జాంగ్ ఉన్ కార్ కలెక్షన్

ఈ కారు కోసం కిమ్ జాంగ్ సుమారుగా 3.1 మిలియన్ అమెరికన్ డాలర్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. మన ఇండియన్ కరెన్సీలో దీని విలువ రూ. 20 కోట్లుగా ఉంది.

కిమ్ జాంగ్ ఉన్ కార్ కలెక్షన్

ఈ మెర్సిడెస్ బెంజ్ పుల్‌మ్యాన్ గార్డ్ లిమోసిన్ కారును చైనా రిజిస్ట్రేషన్ నెంబర్‌తో కొనుగోలు చేసి, ఆ తరువాత ఉత్తర కొరియాకు దిగుమతి చేసుకున్నారు. నిజానికి ఉత్తర కొరియా నెంబర్ ప్లేటుతో దీనిని మార్చేయాల్సి ఉంది. అయితే అధ్యక్షుడి కారు కావడంతో అలాగే వినియోగిస్తున్నారు.

కిమ్ జాంగ్ ఉన్ కార్ కలెక్షన్

సాంకేతికంగా పుల్‌మ్యాన్ గార్డ్ లిమోసిన్ కారులో 5.5-లీటర్ సామర్థ్యం ఉన్న వి12 టుర్బో ఛార్జ్‌డ్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 515బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది.

కిమ్ జాంగ్ ఉన్ కార్ కలెక్షన్

నిజానికి కిమ్ జాంగ్ ఉన్ హాలిడే ట్రిప్స్ మీద దృష్టి సారిస్తే, ఈ కారు విలువ ఎక్కువ అనిపించకపోవచ్చు.

కిమ్ జాంగ్ ఉన్ కార్ కలెక్షన్

ఉత్తర కొరియాలోని సైనికులకు మరియు సైనికాధికారులకు కిమ్ జాంగ్ ఉన్ తరచూ బహుమానాలు ఇస్తుంటాడు. అందుకోసం ఎక్కువగా మెర్సిడెస్ బెంజ్ కార్లను ప్రధానం చేస్తుండటం మరింత ఆశ్చర్యకరమైన విషయం.

కిమ్ జాంగ్ ఉన్ కార్ కలెక్షన్

రిపోర్ట్స్ ప్రకారం, కిమ్ జాంగ్ ఉన్ ప్రధాని అయినప్పటి నుండి 2012 వరకు సుమారుగా 160కి పైగా మెర్సిడెస్ బెంజ్ కార్లను సైన్యాధికారులకు బహుమానంగా ప్రధానం చేసినట్లు తెలిసింది.

కిమ్ జాంగ్ ఉన్ కార్ కలెక్షన్

ఉత్తర కొరియా దేశాధ్యక్షుడి నుండి కార్లను బహుమానంగా పొందిన వారిలో ఖండాతర బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ది చేసిన ఇంజనీర్లే ఎక్కువగా ఉన్నారు.

కిమ్ జాంగ్ ఉన్ కార్ కలెక్షన్

లగ్జరీ కార్లు మరియు విమానం తరువాత మిగిలింది సౌకర్యంవతమైన లగ్జరీ యాచ్. 100 అడుగులు పొడవున్న ఈ యాచ్‌ను ప్రిన్సెస్ అనే సంస్థ తయారు చేసింది.

కిమ్ జాంగ్ ఉన్ కార్ కలెక్షన్

నిజానికి ప్రిన్సెస్ యాచ్ మ్యానుఫాక్చరింగ్ సంస్థ ఫ్రెంచ్‌కు చెందిన దిగ్గజ లగ్జరీ ఉత్పత్తుల తయారీ సంస్థ ఎల్‌విఎమ్‌హెచ్(LVMH) గ్రూపునకు చెందినది. LVMH అనగా Louis Vuitton Moet Hennessy.

కిమ్ జాంగ్ ఉన్ కార్ కలెక్షన్

లగ్జరీ ఉత్పత్తుల తయారీ బ్రాండ్ LVMH కు చెందిన ప్రిన్సెస్ సంస్థ తయారు చేసిన ఈ లగ్జరీ యాచ్ ధర సుమారుగా 5.6 మిలియన్ యూరోలుగా ఉంది.

కిమ్ జాంగ్ ఉన్ కార్ కలెక్షన్

ఉత్తర కొరియాకు చెందిన కొరియన్ న్యూస్ ఏజెన్సీ (KCNA) సంస్థ ఆ దేశ ఆధ్యక్షుడు ఈ యాచ్‌లో ట్రిప్‌కు వెళ్లినపుడు, దాని తాలుకు ఫోటోలను రివీల్ చేసింది.

కిమ్ జాంగ్ ఉన్ కార్ కలెక్షన్

కిమ్ జాంగ్ ఉన్ విలాసవంతమైన లైఫ్ స్టైల్‌లో ఓ విమానం కూడా ఉంది. ఇతను అత్యవసరం సమయంలో దేశంలో ఎక్కడికైనా చేరుకోవడానికి ఉత్తర కొరియా మొత్తం అనేక రన్‌వే లను నిర్మించారు.

కిమ్ జాంగ్ ఉన్ కార్ కలెక్షన్

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ రాజధానికి నగరం ప్యోంగ్యాంగ్‌లో ఆ దేశ అభివృద్ది పనులను తన వ్యక్తిగత విమానంలో నుండే పర్యవేక్షిస్తున్నపుడు సేకరించిన ఫోటోలను కెసిఎన్ఎ న్యూస్ ఏజెన్సీ విడుదల చేసింది.

కిమ్ జాంగ్ ఉన్ కార్ కలెక్షన్

సోవియట్ల కాలానికి చెందిన ఇల్యూషన్ ఐఎల్-62 అనే వ్యక్తిగత విమానానికి కస్టమైజషన్స్ చేయించి వినియోగిస్తున్నాడు కిమ్ జాంగ్ ఉన్. ఈ కస్టమైజ్డ్ ఇల్యూషన్ ఐఎల్-62 విమానానికి చామ్‌మే - 1 అనే పేరును పెట్టారు.

కిమ్ జాంగ్ ఉన్ కార్ కలెక్షన్

కిమ్ జాంగ్ ఉన్ అభీష్టం మేరకు చామ్‌మే - 1 వ్యక్తిగత విమానంలోని ఇంటీరియర్ మొత్తాన్ని లెథర్‌తో మోడిఫై చేశారు. ఇందులో సకల సదుపాయాలను కల్పించేందుకు అనుగుణంగా మోడిఫై చేయించారు. చామ్‌మే - 1 విమానంలోని లగ్జరీ వసతుల కోసం నిర్వహించిన మోడిఫికేషన్స్‌కు ఉత్తర కొరియా సుమారుగా 1.5 మిలియన్ అమెరికన్ డాలర్లను ఖర్చు చేసింది.

Most Read Articles

English summary
Read In Telugu: Intresting things about kim jong un's mystery train
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X