హెచ్‌టిటి-40 శిక్షణ విమానం తయారు చేసిన హెచ్‌ఎల్‌: ప్రత్యేకతలు

By Anil

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ప్రాథమిక శిక్షణ విమానంగా ఉన్న హెచ్‌పిటి - 32 దీపక్ విమానం స్థానంలోకి, హెచ్‌ఎల్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన స్వదేశీ నిర్మిత మొదటి ప్రాథమిక శిక్షణ విమానం హెచ్‌టిటి-40 ని అందుబాటులోకి తెచ్చింది.జూన్ 1, 2016 న దీనిని విజయవంతంగా పరీక్షించింది. హిందుస్తాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ వారు దిగ్విజయంగా పరీక్షించిన హెచ్‌టిటి-40 శిక్షణ విమానం గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

విజవంతమైన ప్రయోగం

విజవంతమైన ప్రయోగం

హిందుస్తాన్ ఏరోనాటికల్స్ రూపొందించిన స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ప్రాథమిక శిక్షణ విమానం హెచ్‌టిటి-40 ను హెచ్‌ఏఎల్ గ్రూప్ కెప్టెన్ రిటైర్డ్ సుబ్రమణ్యం ప్రయోగాత్మకంగా విమానాన్ని నడిపి చూశారు. ఇది అనుకున్న విధంగానే ఎంతో మెరుగుగా ఉందని తెలిపాడు.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి ఆర్డర్

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి ఆర్డర్

హెచ్‌టిటి-40 బ్రాండ్ విమానాలు సుమారుగా 72 కావాలని భారతీయ వాయు దళం (ఇండియన్ ఎయిర్ ఫోర్స్) హెచ్‌ఏఎల్‌కు ఆర్డర్ ఇచ్చింది.

కొత్త ఉత్పత్తి

కొత్త ఉత్పత్తి

ప్రారంభంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు హెచ్‌పిటి-32 అనే శిక్షణ విమానాలను వినియోగించేది. అయితే దీనిని పూర్తిగా అభివృద్ది చేసి హెచ్‌ఏఎల్‌ హెచ్‌‍‌టిటి-40 అనే బ్రాండ్ పేరుతో శిక్షణ విమానాన్ని అభివృద్ది చేసింది. అయితే కొత్త పైలట్లకు ప్రాథమిక ఏవియేషన్ గురించి వివరించడానికి ఈ హెచ్‌పిటి-32 విమానాన్ని వినియోగించనున్నారు.

సీటింగ్ వ్యవస్థ

సీటింగ్ వ్యవస్థ

హెచ్‌ఏఎల్ ఈ హెచ్‌టిటి-40 శిక్షణ విమానంలో కేవలం ఇద్దరు మాత్రమే కూర్చునే దానికి వీలు కల్పించారు. తద్వారా దీనిని యుద్ద భూమిలలో యుద్ద అవసరాల కోసం కూడా దీనిని వినియోగించవచ్చు. ఈ ఎయిర్ క్రాఫ్ట్‌‌ను ప్రత్యేకించి యుద్ద అవసరాలను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేశారు.

ఇంజన్

ఇంజన్

ఇందులో 950 హార్స్‌పవర్ ఉత్పత్తి చేయగల టుర్బోప్రోప్ ఇంజన్‌ను అందించారు. ఈ శిక్షణ విమానంలో శత్రువుల దాడిని తిప్పికొట్టే మెలుకువలు, అడ్వెంచర్స్, రాత్రి వేళల్లో శిక్షణ ఇవ్వడం వంటి అవకాశాలు కల్పించారు.

విమానం వేగం

విమానం వేగం

ఈ శిక్షణ విమానం గరిష్టంగా గంటకు 600 కిలోమీటర్లు వేగంతో వెళుతుది. ఇది గరిష్టంగా 1,000 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగరగలదు. ఇది నిరంతరాయంగా 6,000 మీటర్ల పాటు ప్రయాణిస్తుంది.

ధర వివరాలు

ధర వివరాలు

దేశీయంగా తయారు చేయబడిన ఈ విమానం ధర రూ. 34.5 మిలియన్లుగా ఉంది. దేశీయంగా అభివృద్ది చేయడం వలన ఇది తక్కువ బడ్జెట్‌తో రూపొందించబడింది. ఇందులో పైలట్లు అత్యవసరంగా విమానం నుండి బయటడటానికి ఇందులో ఎమర్జెన్సీ ఎక్సిట్ సీట్లు ఉన్నాయి.

ప్రత్యేకతలు

ప్రత్యేకతలు

శిక్షణ నిమిత్తం వినియోగించే ఈ విమానంలో అత్యవసరం అవసరాల కోసం బాంబులు, రాకెట్లు మరియు మెషీన్ గన్నులు ఉన్నాయి. శత్రువుల మీద దాడి చేయడానికి వీటిని ఎలాంటి సమయంలోనైనా వినియోగించవచ్చు.

అవసరం

అవసరం

మొత్తం106 శిక్షణ హెచ్‌టిటి-40 విమానాలను తయారు చేయాలని హెచ్‌ఏఎల్ భావిస్తోంది. ఈ మొత్తం సంఖ్యలో మొదటగా 72 విమానాలను సిద్దం చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు అందివ్వనుంది.

హెచ్‌టిటి 40 శిక్షణ విమానం ప్రత్యేకతలు

ఇండియా-పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్న యుద్ద వాతావరణం....?

More from DriveSpark

Article Published On: Friday, June 3, 2016, 12:17 [IST]
English summary
Interesting Things About Hal Built Htt 40 Trainer Plane
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+