పుష్ పుల్ టెక్నాలజీ వల్ల ట్రైన్ వేగం మరింత పెరిగే అవకాశం ; ఈ పుష్ పుల్ టెక్నాలజీ ఏంటనుకుంటున్నారా..!

సాధారణంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి అతి తక్కువ ఖర్చుతో చేరే వేసే సాధనాలు ఏవైనా ఉన్నాయి అంటే అది తప్పకుండా రైల్వే అనే చెప్పాలి. భారతదేశంలో రైల్వే అతి పెద్ద సంస్థ. ప్రయాణికులకు రైళ్ల ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి మరియు ప్రయాణ అనుభవాన్ని పెంచడానికి భారత రైల్వే నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో భాగంగా భారత రైల్వే క్యాపిటల్ రైళ్లలో కొత్త టెక్నాలజీని ప్రవేశపెడుతోంది.

పుష్ పుల్ టెక్నాలజీ వల్ల ట్రైన్ వేగం మరింత పెరిగే అవకాశం ; ఈ పుష్ పుల్ టెక్నాలజీ ఏంటనుకుంటున్నారా..!

భారత రైల్వే క్యాపిటల్ రైళ్లలో ప్రవేశపెట్టిన ఈ కొత్త టెక్నాలజీని పుష్ పుల్ అని పిలుస్తారు. ఈ పుష్-పుల్ టెక్నాలజీ కలిగిన క్యాపిటల్ రైళ్లు గత జనవరి నుంచిడిల్లీ-ముంబై మార్గంలో నడుస్తున్నాయి. ఇంజిన్ సాధారణంగా రైళ్ల ముందు భాగంలో జతచేయబడుతుంది. అదనపు సామర్థ్యాన్ని పెంచడానికి వెనుక భాగంలో రైలు ఇంజన్లు అమర్చబడి ఉంటాయి.

పుష్ పుల్ టెక్నాలజీ వల్ల ట్రైన్ వేగం మరింత పెరిగే అవకాశం ; ఈ పుష్ పుల్ టెక్నాలజీ ఏంటనుకుంటున్నారా..!

సాధారణంగా సరుకు రవాణా చేసే రైళ్ల వెనుక భాగంలో ఇంజిన్‌ను ఏర్పాటు చేసి ఉంటారు. కానీ ఇప్పుడు క్యాపిటల్ రైళ్లలో ముందు మరియు వెనుక రెండు ఇంజన్లు ఏర్పాటు చేస్తారు. ఇవే పుష్ పుల్ మోడ్ గా మార్చబడ్డాయి. ఈ రెండు ఇంజన్లను ఒకే నియంత్రణలో ఉంచడానికి పుష్ పుల్ టెక్నాలజీ ఉపయోగించబడుతుంది.

MOST READ:కొచ్చిలో కొత్త డీలర్‌షిప్‌ ప్రారంభించిన ఏథర్ ఎనర్జీ; వివరాలు

పుష్ పుల్ టెక్నాలజీ వల్ల ట్రైన్ వేగం మరింత పెరిగే అవకాశం ; ఈ పుష్ పుల్ టెక్నాలజీ ఏంటనుకుంటున్నారా..!

పుష్-పుల్ టెక్నాలజీ కలిగిన క్యాపిటల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-కోల్‌కతా వంటి మార్గాలలో అందుబాటులో ఉంటాయి. రైల్వే శాఖ అందించిన సమాచారం ప్రకారం, 12 పుష్-పుల్ క్యాపిటల్ రైళ్లు మొదలుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. దేశంలో నడుస్తున్న అన్ని క్యాపిటల్ రైళ్లు ఈ సిస్టం లోకి మార్చే అవకాశం ఉంది.

పుష్ పుల్ టెక్నాలజీ వల్ల ట్రైన్ వేగం మరింత పెరిగే అవకాశం ; ఈ పుష్ పుల్ టెక్నాలజీ ఏంటనుకుంటున్నారా..!

రాబోయే రోజుల్లో శతాబ్ది రైళ్లను కూడా ఈ తరహాలో మార్చడానికి గురించి రైల్వే శాఖ ఆలోచిస్తోంది. ఈ పుష్ పుల్ వ్యవస్థ రైళ్లు ఆగినప్పుడు లేదా బయలుదేరేటప్పుడు రైలు బోగీలకు అనుసంధానించే హుక్ వ్యవస్థలోని చిన్న అంతరాయాన్ని తొలగించడానికి సహాయపడుతుంది.

MOST READ:బాలీవుడ్ స్టార్ 'షాహిద్ కపూర్' కొనుగోలు చేయనున్న కొత్త కార్, ఇదే

పుష్ పుల్ టెక్నాలజీ వల్ల ట్రైన్ వేగం మరింత పెరిగే అవకాశం ; ఈ పుష్ పుల్ టెక్నాలజీ ఏంటనుకుంటున్నారా..!

రైలులో నిద్రిస్తున్న ప్రయాణీకులు రైళ్ల ప్రకంపనలకు కొంత ఇబ్బందిపడే అవకాశం ఉంది. కానీ పుష్ పుల్ సిస్టమ్ ఉన్న క్యాపిటల్ రైళ్లు ఎటువంటి కంపనాలు చేయవు. కావున ప్రయాణకులకు కూడా ఎటువంటి కదలికలు అనిపించదు. ఇది ప్రయాణికులకు లగ్జరీ ప్రయాణాన్ని ఆస్వాదించడానికి వీలు కల్పిస్తుంది.

పుష్ పుల్ టెక్నాలజీ వల్ల ట్రైన్ వేగం మరింత పెరిగే అవకాశం ; ఈ పుష్ పుల్ టెక్నాలజీ ఏంటనుకుంటున్నారా..!

రైల్వే స్టేషన్లలో ఇంజిన్లు మార్చేటప్పుడు కొంత ఆలస్యం అవుతుంది. కానీ రెండు ఇంజిన్లు ఉండటం వల్ల ఈ ఆలస్యాన్ని కూడా నివారించవచ్చు. ఎందుకంటే పుష్ పుల్ ఇంజన్లు ప్రయాణ వ్యవధిని తగ్గిస్తాయి. ఈ పుష్-పుల్ టెక్నాలజీ రైళ్లు గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది.

MOST READ:చిల్డ్రన్స్ డెవలప్మెంట్ కోసం హైదరాబాద్ ఎంజి సెంటర్ సభ్యులు చేయూత

పుష్ పుల్ టెక్నాలజీ వల్ల ట్రైన్ వేగం మరింత పెరిగే అవకాశం ; ఈ పుష్ పుల్ టెక్నాలజీ ఏంటనుకుంటున్నారా..!

పుష్ పుల్ టెక్నాలజీ కారణంగా ముంబై- ఢిల్లీ మార్గంలో ప్రయాణ సమయం ఒకటిన్నర గంటలు తగ్గుతుందని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఇది క్యాపిటల్ రైళ్లలో జనరేటర్లను కనెక్ట్ చేయడాన్ని నిరోధిస్తుంది. ఇది ఇంధనం మరియు నిర్వహణ వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తుందని రైల్వే శాఖ ప్రకటించింది.

పుష్ పుల్ టెక్నాలజీ వల్ల ట్రైన్ వేగం మరింత పెరిగే అవకాశం ; ఈ పుష్ పుల్ టెక్నాలజీ ఏంటనుకుంటున్నారా..!

ప్రపంచంలోని ఇతర దేశాలలో ప్రవేశపెట్టడానికి ముందే ఈ టెక్నాలజీని ఇప్పుడు భారతదేశంలో ప్రవేశపెడుతున్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో రైల్వే తన రైళ్లను ఎంత వేగంగా అప్‌డేట్ చేస్తుందో ఇప్పుడు చూడాలి. ఈ టెక్నాలజీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

MOST READ:పిల్లలు చేసిన తప్పుకు తల్లిదండ్రులకు రూ. 1 లక్ష జరిమానా.. ఆ తప్పేమిటో తెలుసా?

Most Read Articles

English summary
Interesting Things About Push Pull Technology Which Makes Journey More Comfortable. Read in Telugu.
Story first published: Sunday, March 14, 2021, 5:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X