UP International Trade Show రేపటి నుంచి నోయిడాలో అతి పెద్ద ‘ఇంటర్నేషనల్ ట్రేడ్ షో’.. ఎగ్జిబిషన్ విశేషాలివే
భారత్‌లో మొట్టమొదటి సారిగా మోటో జీపీ భారత్ రేసింగ్(MotoGP Bharat 2023)ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 22 నుంచి 24 వరకు యూపీలోని గ్రేటర్ నోయిడా కేంద్రంగా అట్టహాసంగా ఈ ఈవెంట్ జరగనుంది. మోటో జీపీ రేసింగ్‌ను చూసేందుకు లక్షల మంది తరలివస్తారు. కాగా రేపటి నుంచి నోయిడాలో ఇంటర్నేషనల్ ట్రేడ్ షో(UP International Trade Show) నిర్వహించనున్నారు.
అయితే ఇప్పటి వరకు మీరు ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో నిర్వహించే ట్రేడ్ ఫెయిర్ గురించి వినే ఉంటారు. ఇది ఇండియాలోనే అతి పెద్దది. అయితే యూపీలో జరిగే ఇంటర్నేషనల్ ట్రేడ్ షో(International Trade Show In Noida) గురించి ఎప్పుడైనా విన్నారా.? గ్రేటర్ నోయిడాలో ఈ సారి రేసింగ్ అభిమానులకు డబుల్ ధమాకా లభించనుంది. యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో మరియు బైక్ రేస్ మోటో జిపీతో నోయిడా చాలా సందడిగా మారబోతోంది.

మోటో జీపీ రేసింగ్(MotoGP Bharat Racing 2023) నిర్వహణ దృష్ట్యా నోయిడాలో ఇప్పటికే పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కొన్ని రోడ్లను మూసివేసి ట్రాఫిక్‌ను మళ్లించారు. ఈ నేపథ్యంలో ఒకరోజు ముందుగా ప్రపంచ వ్యాపారులను ఆకర్షించేందుకు యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో సెప్టెంబర్ 21 నుంచి 25 వరకు గ్రేటర్ నోయిడాలో నిర్వహించనున్నారు.
MotoGP భారత్ ఈవెంట్ 22 వ తేదీ నుంచి 24 వ తేదీ వరకు గ్రేటర్ నోయిడాలోని బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో జరగనుంది. దేనిపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. మోటో జీపీ రేసింగ్ నిర్వహించే రోజుల్లో నోయిడాలో స్కూల్స్, కాలేజ్‌లకు సెలవు ప్రకటించారు. ఈ రెండింటినీ యూపీ ప్రభుత్వం నిర్వహిస్తోంది. దీని ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందనుంది.

మోటో జీపీ రేసింగ్(MotoGP Bharat) ఈవెంట్‌కు బైక్ ప్రియులు, రైడింగ్ అభిమానులు, రైడర్లు ఎక్కువగా తరలివచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఈవెంట్‌కు మీరు కూడా వెళ్లాలనుకున్నట్లయితే.. మీరు ట్రేడ్ షోకు ఖచ్చితంగా వెళ్లి తీరాల్సిందే. భారతీయులనే కాకుండా ప్రపంచ వ్యాపారులను ఈ ఎగ్జిబిషన్ ఆకట్టుకోనుంది. అందుకే ఈ కథనంలో మీకు ఈ ట్రేడ్ ఫెయిర్‌కు సంబంధించి ప్రత్యేక విశేషాలను అందిస్తున్నాం.
గ్రేటర్ నోయిడాలో నిర్వహించనున్న ఇంటర్నేషనల్ ట్రేడ్ షో(International Trade Show Entry)లో రెండు వేల మందికి పైగా ఎగ్జిబిటర్లు తమ కళలను ప్రదర్శించనున్నారు. వీటిలో అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్, డిఫెన్స్ కారిడార్, ఇన్‌ఫ్రా, ఇంజినీరింగ్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్, ఫిల్మ్ సెక్టార్, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ డైరీ ప్రొడక్ట్స్, జీఐ ట్యాగ్ ప్రొడక్ట్స్, హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్, హెల్త్ అండ్ వెల్నెస్, ఐటీ ఇలా వివిధ రంగాలకు సంబంధించి తమ ఉత్పత్తులతో అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో పాల్గొంటారు.

ఇంకో విశేషమేమంటే ఫ్యాషన్ షో నుంచి షెహనాయ్ నైట్ వరకు, ఇంటర్నేషనల్ ట్రేడ్ షోలో వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఆర్ట్ అండ్ పెయింటింగ్ షో, UP ఫ్యాషన్ షో, UP సాంస్కృతిక ప్రదర్శన, కళాకారులు, యూపీ బ్యాండ్ షో, షెహనాయ్ నైట్ వంటివి ప్రత్యేక ఆకర్షణలుగా నిలవనున్నాయి. అంతే కాకుండా, కన్నౌజ్ నుండి పెర్ఫ్యూమ్, మీరట్ నుంచి ఇత్తడి, బిజ్నోర్ నుంచి పెయింట్ బ్రష్‌లను ఎలా తయారుచేస్తారో ఇక్కడ ప్రదర్శించనున్నారు.
ఇంటర్నేషనల్ ట్రేడ్ షోలో ఫుడ్ లవర్స్‌కీ ప్రత్యేక స్థానం ఉంది. మీరు అక్కడికి వెళ్లినట్లయితే వెరైటీ ఆఫ్ డిషెస్‌ను ఆస్వాదించవచ్చు. ఉత్తరప్రదేశ్‌లోని వివిధ జిల్లాల ప్రసిద్ధ వంటకాలను రుచి చూడవచ్చు, అయితే ఇది ఉచిత సర్వీస్ కాదనే విషయం గుర్తుంచుకోవాలి. ఎగ్జిబిషన్(International Trade Show Timings) టైమింగ్స్ వ్యాపారులకు ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు ఉంటాయి.

అయితే సాధారణ ప్రజలకు మాత్రం మధ్యాహ్నం 3:00 నుండి రాత్రి 8:00 గంటల వరకు ఈ ఎగ్జిబిషన్(International Trade Show) కు ఎంట్రీ ఉంటుంది. ట్రేడ్ షోలో మీకు ఫ్రీ ఎంట్రీ లభిస్తుంది. మీరు మీ వ్యాపార ఉత్పత్తులను ప్రదర్శించాలనుకుంటే ఇంతకంటే బెస్ట్ ప్లేస్ మరొకటి ఉండదు.
మీరు మీ బిజినెస్ ప్రొడక్ట్స్‌ని ఇక్కడ ప్రదర్శించాలనుకుంటే, https://www.upinternationaltradeshow.com/ వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఈ లింక్ ద్వారా మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్నవారికి ఇ-బ్యాడ్జ్ జారీ చేస్తారు. అంటే ఆన్‌లైన్‌లో ఈ-బ్యాడ్జీని పొంది ఎగ్జిబిషన్‌కు తీసుకురావాలి. ఈ ప్రదర్శనకు హాజరు పూర్తిగా ఉచితం. అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనను 2,000 మందికి పైగా సందర్శకులు సందర్శిస్తారని అంచనా.


Click it and Unblock the Notifications








