స్టీరింగ్ పట్టిన మహిళాలోకం..డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి

స్త్రీ లేనిదే ఈ సృష్టి లేదన్న మాట వాస్తవం. నేడు ప్రపంచ వ్యాప్తంగా ఆమెను గౌరవించుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. ప్రతి మగవాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుందన్న మాట వినే ఉంటాం. తన వెనుక ఒక తల్లి, భార్య, చెల్లి, అక్క, కూతురు ఇలా ఎవరో ఒకరు ఉండే ఉంటారు. వారి త్యాగాలను గుర్తిస్తూ వారి శక్తి మరింత చేసే విధంగా ప్రతి ఒక్కరూ వాళ్లకు సహకరించాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా మీ జీవితంలో మీకు అండగా నిలిచిన మహిళలకు శుభాకాంక్షలు తెలపడం మన కర్తవ్యం.

ప్రతి ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా మార్చి 8న జరుపుకుంటారు. మహిళల అభివృద్ధిని ప్రోత్సహించడానికి.. తద్వారా ప్రపంచ అభివృద్ధి సాధించడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలు మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. కొన్నేళ్ల కింద మహిళలు వంటగదికే పరిమితం అయ్యే వారు. కానీ రోజులు మారాయి. ప్రస్తుతం చాలా మంది అనేర రంగాల్లో రాణిస్తున్నారు.

Women Wheel Safety

అంతర్జాతీయ స్థాయిలో కొన్ని దేశాలు చేస్తున్న ప్రయత్నాలు.. నేటి మహిళలు పురుషులతో సమానంగా అనేక రంగాలలో నైపుణ్యం సాధించడానికి ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. అలాంటి అనేక రంగాల్లో కారు డ్రైవింగ్ రంగం కూడా ఒకటి. ఒకానొకప్పుడు కార్లను పురుషులు మాత్రమే నడిపేవారు. మహిళలు డ్రైవింగ్‎కు చాలా దూరంగా ఉండేవాళ్లు. ఇప్పుడు పవర్ ఫుల్ దేశాలుగా చెప్పుకునేవి కూడా మహిళలకు లైసెన్స్ లు ఇవ్వాలంటే వెనుకడుగు వేశాయి.

టెక్నాలజీ సాయంతో లేటెస్ట్ కార్ల డ్రైవింగ్ సులువు అయిపోయింది. వృద్ధులు కూడా ఉపయోగించేంత సింపుల్ అయింది. టెస్లా వంటి కార్ కంపెనీలు పూర్తిగా ఆటోమేటిక్ కార్లను అభివృద్ధి చేయడం పై దృష్టి సారించాయి. అందువల్ల ప్రస్తుత వాతావరణంలో మహిళలు కూడా డ్రైవింగ్ చేయగలుగుతున్నారు. మహిళలలు ప్రస్తుతం ఆటోల నుండి భారీ ట్రక్కులు, బస్సు డ్రైవర్లుగా రాణిస్తున్నారు. పురుషుల మీద ఆధారపడకుండా తమ కాళ్లపై తాము నిలబడేందుకు డ్రైవింగ్ వృత్తి ఎంచుకుంటున్నారు.

Women On The Wheel

మనం రోజూ చాలా మంది మహిళా డ్రైవర్లను చూస్తుంటాం. వారి చూసినప్పుడల్లా లింగ సమానత్వం వచ్చిందని అనిపిస్తుంది. మహిళలపై లైంగిక వేధింపులు విపరీతంగా జరుగుతున్న భారత్ లాంటి దేశంలో మహిళా డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి. సాధారణంగా ఉద్యోగం అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఉంటుంది. కానీ డ్రైవింగ్ వృత్తి అలా కాదు. ప్రయాణికులు ఎప్పుడు, ఎక్కడికి వెళ్తారో తెలీదు. అందుకే మహిళా డ్రైవర్లు రాత్రిపూట కూడా పనిచేయాల్సి ఉంటుంది.

మహిళలకు మంచి సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించడం మన కర్తవ్యం. దీని గురించి అవగాహన పెంచడానికే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. మహిళలు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అంటే, డ్రైవర్‌గా పని ప్రారంభించిన తర్వాత కొన్ని నెలల పాటు సుదీర్ఘ ప్రయాణాలు చేయకూడదు. తెలియని ప్రాంతాలకు వెళ్లవద్దు. నడిపిస్తున్న వాహనాన్ని త్వరగా, చక్కగా పార్క్ చేయడం నేర్చుకోవాలి. రోడ్డు ట్రాఫిక్ రూల్స్, వాటిలో ఉపయోగించే చిహ్నాలను గుర్తుపెట్టుకోవాలి.

మొబైల్ ఫోన్ల వినియోగం, ఇంటర్నెట్ వినియోగం, మొబైల్ యాప్‌ల రాకతో మహిళా డ్రైవర్లకు మరిన్ని అవకాశాలను అందిస్తున్నాయి. డ్రైవింగ్ లైసెన్స్ పొందడం నుండి వెహికల్ ఇన్సురెన్స్ వరకు సగం పని మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లలోనే జరుగుతుంది. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో అపరిచిత వ్యక్తులు అనుమానాస్పదంగా అనిపిస్తే.. తప్పనిసరిగా ఎమర్జెన్సీ నంబర్లను అందుబాటులో ఉంచుకోవడం మంచిది. మద్యం సేవించిన ప్రయాణికులను సాధ్యమైనంత వరకు కార్లలో ఎక్కించుకోకపోవడం ఉత్తమమనే చెప్పాలి.

Article Published On: Saturday, March 8, 2025, 12:58 [IST]
English summary
International womensday special women on the wheel safety tips for female drivers
Read more on: #offbeat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+