ఇక్కడ ఎగిరే విమానం నుండి కదిలే విమానాశ్రయంలోకి ల్యాండవచ్చు
విమానాలు అభివృద్ది చెందాలంటే వాటితో పాటు విమానాశ్రయాలు అందులోని రన్‌వేలను కూడా అత్యాధునికంగా తీర్చిదిద్దాలి. అన్ని ఉన్నా కూడా అలాంటి విమానాశ్రయాలు నిర్మించాలంటే స్థలం కొరత ఎక్కువ ఉంటే...? ఇలాంటి వాటికి ప్రత్యామ్నాయంగా వచ్చిన ఆలోచనే ఈ నీటి మీద తేలియాడే విమానాశ్రయం.
తేలియాడే విమానాశ్రయాల గురించి పూర్తి వివరాలు క్రింది కథనంలో....

లండన్ బ్రిటాన్నియా ఎయిర్ పోర్ట్
లండన్ ఎయిర్ పోర్ట్ ఆరు రన్‌వేలను కలిగి ఉండే విధంగా తేలియాడే ఎయిర్ పోర్ట్‌కు ప్రతిపాదనలు చేసింది. లండన్ రాజధానికి తూర్పున 30 మైళ్ల దూరాన తేలియాడే విమానాశ్రయానికి పూర్తి స్థాయిలో ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు.

ఈ తేలియాడే విమానాశ్రయం యొక్క కాన్సెప్ట్‌ను పట్టాలెక్కించేందుకు జెన్స్‌లర్ మరియు థామెస్ ఎస్టారి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ వారు ఆర్కిటెక్చర్‌ను రూపొందిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ కోసం సుమారుగా 63బిలియన్ అమెరికన్ డాలర్లను ఖర్చు చేయనున్నారు.

ఎయిర్ పోర్ట్ అంతర్భాగం
మెయిన్ టర్మెనల్‌కు ఇరువైపులా పొడవుగా రన్‌వేలు ఉంటాయి. ఎయిర్ పోర్ట్ అంతర్బాగం ఇలా వృక్షాలతో నిండి ఉండనుంది.

తేలియాడే ఎయిర్ పోర్ట్ నమూనా
తేలియాడే విమానాశ్రయంలోని వివిధ రకాల భాగాలను సూచించే నమూనా...

హైడ్రాలిక్ వ్యవస్థతో కంట్రోల్ చేయబడే పూర్తి స్థాయి రన్‌వేను పరీక్షించనున్నారు. దీనిని అమెరికాకు చెందిన ప్రముఖ ఏరో నాటికల్ ఇంజనీరింగ్ సంస్థ అభివృద్ది చేస్తోంది.

వినోదాత్మకం కోసమూ...
ప్రయాణికుల సరదా మరియు వినోదం కోసం తీరం వెంబడి నిర్మించే తేలియాడే విమానాశ్రయానికి అనుసంధానంగా థియేటర్లు షాపింగ్ కాంపెక్స్‌లు వంటివి నిర్మించనున్నారు.

తేలియాడే విమానాశ్రయం

- విమానయాన రంగం భవిష్యత్ ఇదే....


Click it and Unblock the Notifications








