హై స్పీడ్ వల్ల కారు ప్రమాదంలో చిక్కుకున్న ఇండియన్ IPL క్రికెటర్

సాధారణంగా భారతదేశంలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. కానీ నేడు కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఐపిఎల్ క్రికెటర్, ఉత్తర ప్రదేశ్ అండర్ -19 జట్టు వైస్ కెప్టెన్ ఆకాశ్‌దీప్ నాథ్ కూడా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆకాశ్‌దీప్ నడుపుతున్న ఫోర్డ్ ముస్తాంగ్ కారు క్రాష్ అయ్యింది.

హై స్పీడ్ వల్ల కారు ప్రమాదంలో చిక్కుకున్న ఇండియన్ IPL క్రికెటర్

ఫ్లైఓవర్‌లో అధిక వేగంతో కారు నడుపుతున్న ఆకాశ్‌దీప్ కారు నియంత్రణ కోల్పోయాడు. ఈ సంఘటన శుక్రవారం అర్థరాత్రి జరిగింది. లక్నోలోని కుక్రైల్ ఫ్లైఓవర్‌లో ఈ ప్రమాదం జరిగిందని నివేదికలు ద్వారా తెలుస్తుంది.

హై స్పీడ్ వల్ల కారు ప్రమాదంలో చిక్కుకున్న ఇండియన్ IPL క్రికెటర్

ఫ్లైఓవర్ గత సంవత్సరం లాంచ్ చేయబడింది. 5.8 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్‌లో ఒక్క స్పీడ్ బ్రేకర్లే కూడా లేదు. అందుకే ఈ ఫ్లైఓవర్ లో వేగంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది.

MOST READ:దొంగలించిన బైక్ పార్సిల్ ద్వారా తిరిగి ఇచ్చిన వలస కార్మికుడు

హై స్పీడ్ వల్ల కారు ప్రమాదంలో చిక్కుకున్న ఇండియన్ IPL క్రికెటర్

ఆకాశ్‌దీప్ కారు నడుపుతున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో కారు వేగం గురించి ఖచ్చితమైన సమాచారం లేదు, కానీ కారు యొక్క స్థితిని చూసినప్పుడు, అధిక వేగంతో ప్రయాణించాడనీ నిర్దారించవచ్చు.

హై స్పీడ్ వల్ల కారు ప్రమాదంలో చిక్కుకున్న ఇండియన్ IPL క్రికెటర్

మొదట మారుతి 800 తర్వాత ఆకాశ్‌దీప్‌కు చెందిన ముస్తాంగ్ కారు హ్యుందాయ్ ఎలైట్ ఐ 20 డీకొట్టిందని సామాజిక వర్గాలు తెలిపాయి. ముస్తాంగ్ రోడ్ సెపరేటర్‌ను డీకొట్టగానే ఎయిర్‌బ్యాగ్ ఓపెన్ చేయబడింది.

MOST READ:కరోనా ఎఫెక్ట్ : ఇకపై మీ ఇంటికే పెట్రోల్

ఈ కారు ప్రమాదంలో ఎవరూ తీవ్రంగా గాయపడలేదు. ఆకాశ్‌దీప్ కారులో 5 మంది ఉన్నారు. అందరూ స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. అందరూ స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆకాష్‌దీప్ గత ఏడాది ఈ కారు కొన్నాడు.

హై స్పీడ్ వల్ల కారు ప్రమాదంలో చిక్కుకున్న ఇండియన్ IPL క్రికెటర్

ఫోర్డ్ ముస్టాంగ్‌లో 5.0 లీటర్ వి 8 పెట్రోల్ ఇంజన్ అమర్చారు. ఈ ఇంజన్ 396 బిహెచ్‌పి పవర్ మరియు 515 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. భారతదేశంలో ఈ కారు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అమ్మబడుతుంది.

MOST READ:ఆనంద్ మహీంద్రా ట్వీట్ : మహిళా ధైర్యానికి నిలువెత్తు నిదర్శనం ఈ సంఘటన, ఏంటో చూసారా ?

Most Read Articles

English summary
IPL cricketer Akashdeep Nath crashes his Ford Mustang GT. Read in Telugu.
Story first published: Wednesday, June 3, 2020, 14:07 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X