BMW 6-Series GT కారును కొనుగోలు చేసిన క్రికెటర్ పృథ్వీ షా

ఢిల్లీ క్యాపిటల్స్ ఐపిఎల్ జట్టుకి చెందిన క్రికెటర్ పృథ్వీ షా, తాజాగా ఓ కొత్త లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ అందిస్తున్న 6 సిరీస్ గ్రాన్ తురిస్మో (BMW 6 Series Gran Turismo) కారును ఈ యువ క్రికెటర్ సొంతం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించన ఫొటోలను అతను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేశారు.

BMW 6-Series GT కారును కొనుగోలు చేసిన క్రికెటర్ పృథ్వీ షా

ఐపిఎల్ ముగిసిన తర్వాత పృథ్వీ షా ఇటీవల యూఏఈ నుండి తిరిగి వచ్చారు. ఆ తర్వాత అతను ఈ కొత్త కారు నడుపుతూ కనిపించాడు. తన కొత్త కారు ముందు ఫొటోలకు పోజులిస్తూ, తన తండ్రితో ఉన్న ఫోటోను కూడా పంచుకున్నాడు. ఐపిఎల్ ఆటగాళ్లలో పృథ్వీ షా మెరుగైన ఐపిఎల్ సీజన్‌ను కలిగి ఉన్నాడు, ఇతను ఢిల్లీ క్యాపిటల్స్ కోసం ఆడుతున్నప్పుడు 15 మ్యాచ్‌ల్లో 479 పరుగులు సాధించాడు.

BMW 6-Series GT కారును కొనుగోలు చేసిన క్రికెటర్ పృథ్వీ షా

బహుశా ఈ విజయాన్ని జరుపుకునేందుకు అతను ఈ ఖరీదైన కారును కొనుగోలు చేసి ఉండొచ్చు. పృథ్వీ షా ప్రస్తుత వయస్సు 21 ఏళ్లు, ఈ యువ క్రికెటర్ కొనుగోలు చేసిన బిఎమ్‌డబ్ల్యూ 6-సిరీస్ జిటి కారు ధర సుమారు రూ. 68.50 లక్షలు (ఎక్స్-షోరూమ్). అతను కొనుగోలు చేసిన కారు తెలుపు రంగులో ఉండి, చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

BMW 6-Series GT కారును కొనుగోలు చేసిన క్రికెటర్ పృథ్వీ షా

పృథ్వీ షా ఈ చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, తాను 'దిగువ నుండి ప్రారంభమై ఇప్పుడు ఇక్కడకు చేరుకున్నాను!' అంటూ పోస్ట్ చేశారు. ఈ సంతోషకరమైన సందర్భంలో, బిఎమ్‌డబ్ల్యూ ఇండియా కూడా అతడిని అభినందించింది మరియు అతని చిత్రాలను తమ సోషల్ మీడియాలో పంచుకుంది. బిఎమ్‌డబ్ల్యూ కుటుంబంలోకి స్వాగతం అంటూ రీషేర్ చేసింది.

BMW 6-Series GT కారును కొనుగోలు చేసిన క్రికెటర్ పృథ్వీ షా

మనదేశంలోని చాలా మంది క్రికెటర్ల వద్ద ఇప్పటికే పలు రకాల బిఎమ్‌డబ్ల్యూ కార్లు ఉన్నాయి మరియు ఈ కంపెనీకి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరించారు. ఇక పృథ్వీ షా కొత్త కారు విషయానికి వస్తే, ఈ బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్ తురిస్మో మోడల్, స్టాండర్డ్ 6 సిరీస్ కన్నా చాలా స్పోర్టీయర్ గా ఉంటుంది.

BMW 6-Series GT కారును కొనుగోలు చేసిన క్రికెటర్ పృథ్వీ షా

మార్కెట్లో ఈ మోడల్ ఒక పెట్రోల్ మరియు రెండు డీజిల్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి డిజైన్ విషయానికి వస్తే, మునుపటి తరం మోడల్ తో పోల్చి చూసినప్పుడు ఇందులో కొత్తగా రీడిజైన్ చేసిన బంపర్లు, కొత్త L-ఆకారపు డ్యూయల్ డేటైమ్ రన్నింగ్ లైట్లు, ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు మరియు వెడల్పాటి కిడ్నీ గ్రిల్ వంటి మార్పులు ఉందులోఉ న్నాయి. వెనుక భాగంలో డ్యూయల్ కలర్ బంపర్ మరియు కొత్త 3డి ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ లను కూడా ఇందులో గమనించవచ్చు.

BMW 6-Series GT కారును కొనుగోలు చేసిన క్రికెటర్ పృథ్వీ షా

ఇక ఫీచర్ల విషయానికి వస్తే, కొత్త బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి మోడల్ లో పెద్ద 12.3 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 12.3 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఇందులోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే లతో పాటుగా బిఎమ్‌డబ్ల్యూ లైవ్ కాక్‌పిట్ మరియు బిఎమ్‌డబ్ల్యూ వర్చువల్ అసిస్టెంట్ లను కూడా సపోర్ట్ చేస్తుంది.

BMW 6-Series GT కారును కొనుగోలు చేసిన క్రికెటర్ పృథ్వీ షా

ఇవేకాకుండా, ఇందులో వైర్‌లెస్ ఛార్జింగ్, రియర్ సీట్ ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్, 360 డిగ్రీల పార్కింగ్ కెమెరా, ఆటోమేటిక్ పార్కింగ్, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ రియర్ సీట్, పానోరమిక్ సన్‌రూఫ్, ఎయిర్ సస్పెన్షన్ మరియు డోర్‌లపై సాఫ్ట్ క్లోజ్ ఫంక్షన్ వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి.

BMW 6-Series GT కారును కొనుగోలు చేసిన క్రికెటర్ పృథ్వీ షా

ఇదివరకు చెప్పుకున్నట్లుగా బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్ తురిస్మో మూడు ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో మొదటిది 630ఐ ​​2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్. ఇది 258 హెచ్‌పి శక్తిని మరియు 400 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వేరియంట్ కేవలం 6.5 సెకన్లలోనే గంటకు 0 - 100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది.

BMW 6-Series GT కారును కొనుగోలు చేసిన క్రికెటర్ పృథ్వీ షా

ఇకపోతే, రెండవది 620డి 2.0 లీటర్ డీజిల్ ఇంజన్. ఇది 190 హెచ్‌పి శక్తిని మరియు 400 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 7.9 సెకన్లలోనే గంటకు 0 - 100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. ఇక ఇందులో చివరిది 630డి 3.0 లీటర్ డీజిల్ ఇంజన్. ఈ ఇంజన్ 265 హెచ్‌పి శక్తిని మరియు 620 న్యూటన్ మీటర్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కేవలం 6.5 సెకన్లలోనే గంటకు 0 - 100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది.

BMW 6-Series GT కారును కొనుగోలు చేసిన క్రికెటర్ పృథ్వీ షా

బిఎమ్‌డబ్ల్యూ ఇండియా తమ కస్టమర్ల కోసం నెలవారీ ఈఎమ్ఐ పథకాలను కూడా అందిస్తోంది. బిఎమ్‌డబ్ల్యూ కార్ల కోసం ఈఎమ్ఐ రూ. 69,999 నుండి అందుబాటులో ఉంటుంది. అలాగే, కంపెనీ తమ కార్లపై 3 నుండి 10 సంవత్సరాల వరకు సర్వీస్ ప్యాకేజీని కూడా అందిస్తోంది. కాగా, బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ భారత మార్కెట్లో మెర్సిడెస్ ఇ-క్లాస్ ఎల్‌డబ్ల్యూబి వంటి మోడళ్లతో పోటీపడుతుంది.

Most Read Articles

English summary
Ipl cricketer prithvi shaw buys new bmw 6 series gt details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X