దీపావళికి IRCTC బంపర్ ఆఫర్.. బడ్జెట్ ధరలో ఫ్లైట్‌లో అండమాన్ టూర్, ప్యాకేజీ వివరాలివే..
పండుగలు, లేదా సెలవులు వచ్చాయంటే చాలు.. చాలా మంది పల్లెటూళ్లకు పయనమవుతుంటారు. మరికొందరు లాంగ్ ట్రిప్ ప్లాన్ చేస్తుంటారు. మరికొద్ది రోజుల్లో దీపావళి రానుంది. ఈ క్రమంలో ఈ దీపావళిని వినూత్నంగా సెలబ్రేట్ చేసుకునేవారికి IRCTC సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది. దీని ప్రకారం మీరు అండమాన్ నికోబార్ ఐలాండ్స్‌లో వెలుగుల ఫెస్టివ్‌గా తక్కువ బడ్జెట్‌లో చేసుకోవచ్చు.
దేశంలో అత్యంత సుందరమైన పర్యాటక ప్రాంతాల్లో అండమాన్ నికోబార్ దీవులు (Andaman Nicobar Islands) ఒకటి. తెల్లని ఇసుక తిన్నెలతో ఆహ్లాదకరంగా కనిపించే బీచ్‌లు ఎల్లప్పుడూ పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. అందుకే సమ్మర్ వెకేషన్, ఇంకా ప్రత్యేక సెలవుల్లో చాలా మంది ఈ ఐల్యాండ్‌కు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తారు. ఇక ఈ సుందరమైన దీవులకు ఫ్లైట్‌లో వెళ్తే ఆ మజానే వేరు.

ఈ దీపావళిని మీరు సరికొత్తగా సెలబ్రేట్ చేసుకునేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) బంపర్ ఆఫర్ ప్రకటించింది. సరికొత్త ప్యాకేజీతో తక్కువ బడ్జెట్‌లో మీరు అండమాన్ టూర్‌ను మీ సన్నిహితులతో లేదంటే మీరైనా సరే ఒంటరిగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ మేరకు ఆ ప్యాకేజీ వివరాల్లోకి వెళితే..
దీపావళి సందర్భంగా 5 రాత్రుళ్లు, 6 పగళ్లు అండమాన్ టూర్ ప్యాకేజీ ఉండనుంది. నవంబర్ 6 నుంచి నవంబర్ 24 వరకు ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. కాగా పోర్ట్ బ్లెయిర్ నుంచి ఈ పర్యటన ప్రారంభం అవుతుంది. అండమాన్‌లోని వివిధ ద్వీపాలు మరియు బీచ్‌లను ఈ ట్రిప్ ప్యాకేజీ ద్వారా మీరు చూడవచ్చు.

ఈ ప్యాకేజీలో పోర్ట్ బ్లెయిర్, నీల్, హేవ్‌లాక్ ఐలాండ్ పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అండమాన్ అండ్ నికోబార్ ట్రిప్ స్టార్ట్ అయిన అనంతరం మీరు ప్రయాణంలో కార్బిన్స్ కోవ్ బీచ్, సెల్యులార్ జైలు, రాస్ ఐలాండ్, నార్త్ బే ఐలాండ్, హేవ్‌లాక్ ద్వీపం, కాలాపత్తర్ బీచ్, రాధా నగర్ బీచ్, నీల్ ఐలాండ్, నేచురల్ బ్రిడ్జ్ & లక్సాంపూర్ బీచ్, భరత్‌పూర్ బీచ్ వంటి ప్రదేశాలను మీరు చుట్టేయొచ్చు.
పోర్ట్ బ్లెయిర్ నుంచి ప్రారంభమయ్యే ట్రిప్ మొదటి రోజు కార్బిన్స్ కోవ్ బీచ్, సెల్యులార్ జైలును చూడవచ్చు. పోర్ట్ బ్లెయిర్ నుంచి మరుసటి రోజు, అల్పాహారం తర్వాత బ్రిటిష్ పాలనలో పోర్ట్ బ్లెయిర్ రాజధానిగా ఉన్న రోజ్ ఐలాండ్‌కు వెళ్లవచ్చు. అక్కడ వాటర్ స్పోర్ట్స్ కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందిన బే ఐలాండ్‌ను సందర్శించవచ్చు. ఇక్కడ స్కూబా డైవింగ్ వంటి కార్యకలాపాలలో పాల్గొనడానికి మీకు సౌకర్యాలు కల్పించారు.

మూడో రోజు పోర్ట్ బ్లెయిర్ నుంచి హేవ్‌లాక్ ద్వీపానికి ఫెర్రీ రైడ్ హైలైట్ ట్రిప్ ఉంటుంది. ఇక్కడ కాలాపత్తర్ మరియు రాధానగర్ బీచ్‌లలో గడపవచ్చు. నాల్గవ రోజు నీల్ ద్వీపంలో నేచురల్ బ్రిడ్జ్ మరియు లక్సాంపూర్ బీచ్‌ను సందర్షించవచ్చు. 5వ రోజు ప్రసిద్ధ భరత్‌పూర్ బీచ్‌ని సందర్శించిన తర్వాత డే 6 పోర్ట్ బ్లెయిర్‌కు తిరిగి వస్తుంది.
ప్యాకేజీ ప్రకారం నవంబర్ 6 నుంచి 24 వరకు ప్రతి రోజూ పోర్ట్ బ్లెయిర్ నుంచి ఈ ట్రిప్ ప్రారంభం అవుతుంది. ఇక ప్యాకేజీ కాస్ట్ విషయానికొస్తే ఆక్యుపెన్సీని బట్టి ధరలు ఉంటాయి. 5 రాత్రులు 6 రోజుల ప్యాకేజీ ధర ట్రిపుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికీ.. రూ. 27,450 ఉంటుంది.

డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికీ రూ. 30,775, సింగిల్ ఆక్యుపెన్సీలో రూ. 52,750 ధర ఉంటుంది. 5 నుంచి 11 సంవత్సరాలు వయసు ఉండి బెడ్ అవసరమయ్యే పిల్లల కోసం, ప్యాకేజీకి రూ. 17,000, బెడ్ అవసరం లేని పిల్లలకు (2-4 సంవత్సరాలు) రూ. 13,550 ఛార్జెస్ ఉంటాయి.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ట్రావెల్ ప్యాకేజీలో కొన్ని అంశాలను చేర్చలేదు. ఈ ప్యాకేజీలో ఎయిర్ టికెట్, టెలిఫోన్ బిల్లులు, డ్రింక్స్, పోర్టర్, బీమా, మద్యం, రూమ్ సర్వీస్, కెమెరా ఛార్జ్, హెర్బల్ మసాజ్ వంటి వ్యక్తిగత ఖర్చులు ఉండవని ఐఆర్‌సీటీసీ తెలిపింది. లిఫాన్రా బీచ్‌కి ఆప్షనల్ టూర్, వాటర్ స్పోర్ట్స్ మొదలైనవాటికి కూడా టూరిస్టులు పర్సనల్‌గా చెల్లించాల్సి ఉంటుంది.

ఇంకా మీరు మరిన్ని వివరాల కోసం irctc వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చు. ఆఫీసు పనులు, వ్యాపారాలతో బిజీగా గడుపుతున్న వారు.. ఈ దీపావళిని సంతోషంగా, కొత్తగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ ప్యాకేజీ మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు.. ఇక హనీమూన్ జంటలకు అయితే ఇది సువర్ణావకాశం.


Click it and Unblock the Notifications








