IRCTC ద్వారా అతి తక్కువ ఛార్జీలతో ఫ్లైట్ జర్నీ.. అయితే ఈ ఛాన్స్ వారికి మాత్రమే.!!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓ గుడ్ న్యూస్.. ఇకపై మీరు ఫ్లైట్ జర్నీస్ చేయాలనుకుంటే తక్కువ ధరలోనే విమాన్ టికెట్ కొనుగోలు చేయవచ్చు. ఇందుకోసం IRCTC వెబ్‌సైట్ ఛార్జీల రాయితీలను అందిస్తోంది. దీని ద్వారా సాధారణ ప్రజల కంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు తక్కువ ఛార్జెస్‌తో ఫ్లైట్ జర్నీ చేయొచ్చు.
కాగా చాలా మందికి IRCTC ద్వారా ఇలా తక్కువ ధరలో విమాన ప్రయాణం చేయెచ్చనే విషయం తెలియదు. ఈ కథనంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రిఫరెన్షియల్ రేట్లతో విమాన టిక్కెట్ల ధరలను ఎలా బుక్ చేసుకోవచ్చో పూర్తి వివరాలను అందిస్తున్నాం. దీంతో మీకు డబ్బు ఆదా అవుతుంది.

IRCTC రైలు టిక్కెట్లను బుక్ చేసుకునే ఏకైక వెబ్‌సైట్ అని అందరికీ తెలిసిందే. కానీ ఈ సైట్ రైలు టిక్కెట్ల బుకింగ్ మాత్రమే కాకుండా వివిధ సేవలను కూడా అందిస్తోంది. ఇందులో అత్యంత ముఖ్యమైన సర్వీస్ ఫ్లైట్ టికెటింగ్ సర్వీస్.. ఇతర కంపెనీల భాగస్వామ్యంతో IRCTC ఈ సేవలందిస్తోంది.
ఫ్లైట్ టికెటింగ్ ప్రాసెస్ ప్రత్యేక పోర్టల్ air.irctc.co.in ద్వారా జరుగుతుంది. ఈ వెబ్‌సైట్ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు విమాన టిక్కెట్లు బుక్ చేసుకోవాలనుకుంటే వారికి ప్రత్యేక ధర రాయితీ కల్పిస్తారు. అయితే ప్రభుత్వ సెలవు ప్రయాణ రాయితీ పథకం కింద విమాన టికెట్ ధరను బుక్ చేసుకోవడానికి కొన్ని నియమాలను పాటించాలి.

ముందుగా ఉద్యోగులు తమకు వర్తించే ట్రావెల్ క్లాస్‌లో మాత్రమే టిక్కెట్లను ముందస్తుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అటువంటి నమోదుపై మాత్రమే విమాన టిక్కెట్ ధర సంబంధిత రాయితీ అందిస్తుంది. ఈ ఆఫర్ కింద ఎవరైనా విమాన టిక్కెట్లను బుక్ చేసుకున్నప్పుడు, అది నాన్-స్టాప్ ఫ్లైట్ అయి ఉండాలనే నిబంధన కూడా ఉంది.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులు ప్రయాణ తేదీకి 21 రోజుల ముందు విమాన టిక్కెట్లను బుక్ చేసుకోవాలని సలహా ఇస్తుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నాన్‌స్టాప్ ఫ్లైట్‌ను మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తర్వాత టికెట్ బుక్ చేసేందుకు కొన్ని ఆప్షన్‌లు ఫిల్ చేయాల్సి ఉంటుంది.

ఫ్లైట్ టికెట్‌ను బుక్ చేసుకోవడానికి, air.irctc.co.in వెబ్‌సైట్‌కి వెళ్లిన తర్వాత, ప్రభుత్వ ఉద్యోగి, LTC, డిఫెన్స్ ఫేర్ ఆప్షన్‌లలో ఒకదాన్ని ఎంచుకోవాలి. ప్రయాణ వివరాలను నమోదు చేసి, మీకు కేటాయించిన ట్రావెల్ క్లాస్‌లో తక్కువ ధరకు నాన్‌స్టాప్ విమానాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత మీకు తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ కన్‌ఫామ్ అవుతుంది.
అయితే ఎవరైనా హాలిడే ట్రావెల్ ఆఫర్ కింద విమాన టిక్కెట్లను బుక్ చేసుకున్నట్లయితే, ఉద్యోగి ఆమోదించబడిన ప్రభుత్వ గుర్తింపు ధృవీకరణ పత్రాలను తీసుకెళ్లాలని కూడా IRCTC ప్రకటించింది. LTC సిస్టమ్ కింద పరిమిత సంఖ్యలో టిక్కెట్‌లు ఉన్నందున టికెట్ రిజర్వేషన్ చేసుకోవడం అవసరం. అయితే రిజిస్ట్రేషన్ తర్వాత మాత్రమే టికెట్‌లు ధృవీకరించబడతాయని మీరు గుర్తుంచుకోవాలి.
LTC అలాట్‌మెంట్‌లో సీట్లు పరిమితం కావడంతో బుక్ చేసుకున్న వారికి మాత్రమే టిక్కెట్‌లు గ్యారెంటీ అని మీరు గమనించాలి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను బలోపేతం చేసేందుకు IRCTC సబ్సిడీ ధరతో టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. మరెందుకు ఆలస్యం కేంద్రం మీకు కల్పిస్తున్న అవకాశాన్ని ఈ సారి సద్వినియోగం చేసుకోండి.


Click it and Unblock the Notifications








