భూలోక స్వర్గాన్ని తలపిస్తున్న గోల్డెన్ చారిట్ లగ్జరీ ట్రైన్.. చూసారా!

సాధారణంగా విలాసవంతమైన జీవితాలను గడపాలనే చాలామంది లగ్జరీ విధానాలను ఇష్టపడతారు. ఇందులో భాగగంగానే విహారయాత్రలు చేయడానికి కూడా ఈ విధానాలనే ఎక్కువ ఇష్టపడతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని 2008 లో కర్ణాటక రాష్ట్ర పర్యాటక శాఖ గోల్డెన్ చారిట్ లగ్జరీ ట్రావెల్ ట్రైన్ సర్వీస్ ప్రారంభించబడింది. ట్రైన్ లో లగ్జరీ టూర్లు చేయాలనుకునేవారికి ఈ సర్వీస్ చాలా బాగా ఉపయోగపడుతుంది.

భూలోక స్వర్గాన్ని తలపిస్తున్న గోల్డెన్ చారిట్ లగ్జరీ ట్రైన్.. చూసారా!

ఈ ట్రైన్ సర్వీస్ ప్రారంభించినప్పుడు మంచి ఆదరణ లభించింది. కానీ రానురాను ఈ ట్రైన్ లో ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో లగ్జరీ ట్రావెలర్స్ కొంత క్లిష్టపరిస్థితి ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా, 2017 లో గోల్డెన్ చారిట్ లగ్జరీ టూరిస్ట్ ట్రైన్ సర్వీసు నిలిపివేయబడింది. కానీ లగ్జరీ టూరిజం ప్రేమికులు గోల్డెన్ చారిట్ లగ్జరీ రైలు సర్వీస్ మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.

భూలోక స్వర్గాన్ని తలపిస్తున్న గోల్డెన్ చారిట్ లగ్జరీ ట్రైన్.. చూసారా!

వారి నిరీక్షణ వీలైనంత త్వరగా నెరవేరుతుంది. 3 సంవత్సరాల విరామం తరువాత జనవరి 2021 లో గోల్డెన్ చారిట్ టూర్ ట్రైన్ సర్వీస్ తిరిగి ప్రారంభమవుతుంది. గోల్డెన్ చారిట్ లగ్జరీ ట్రైన్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సిటిసి) కు అప్పగించారు.

MOST READ:మీకు తెలుసా.. ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీ యాక్సెసరీ ప్యాకేజస్ ఇవే

భూలోక స్వర్గాన్ని తలపిస్తున్న గోల్డెన్ చారిట్ లగ్జరీ ట్రైన్.. చూసారా!

ఇప్పటికే వివిధ లగ్జరీ సౌకర్యాలను కలిగి ఉన్న గోల్డెన్ చారిట్ ట్రైన్ ఐఆర్‌సిటిసి మరింత అప్‌డేట్ చేసింది. గోల్డెన్ చారిట్ లగ్జరీ రైలులోని లివింగ్ రూమ్ మరియు బాత్‌రూమ్‌లు ఎక్కువగా నవీకరించబడ్డాయి.

భూలోక స్వర్గాన్ని తలపిస్తున్న గోల్డెన్ చారిట్ లగ్జరీ ట్రైన్.. చూసారా!

గదిని వివిధ అలంకరణలతో నవీకరించారు. స్మార్ట్ టీవీ కూడా అందించబడుతుంది. గోల్డెన్ చారిట్ లగ్జరీ ట్రైన్ లో స్పా సౌకర్యం కూడా ఉంటుంది. ఈ సదుపాయాన్ని పొందాలనుకునే యాత్రికులు మసాజ్ సర్వీస్ కూడా పొందవచ్చు.

MOST READ:ప్రైవేట్ బస్సుకు రూ. 5 లక్షలకుపైగా జరిమానా విధించిన గవర్నమెంట్.. కారణం ఏంటో తెలుసా ?

భూలోక స్వర్గాన్ని తలపిస్తున్న గోల్డెన్ చారిట్ లగ్జరీ ట్రైన్.. చూసారా!

ఇందులో ఆల్కహాల్ కూడా అందించబడుతుంది. గోల్డెన్ చారిట్ లగ్జరీ ట్రైన్ లో 2 స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ జిమ్ మరియు 2 రెస్టారెంట్లు ఉన్నాయి. యాత్రికులు ఆ రెస్టారెంట్లలో భోజనం చేయవచ్చు మరియు దృశ్యాన్ని ఆస్వాదించవచ్చు. సుదీర్ఘ విరామం తరువాత, గోల్డెన్ చారిట్ లగ్జరీ ట్రైన్ దాని విలాసవంతమైన సౌకర్యాలతో జనవరిలో వివిధ రాష్ట్రాల ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో పర్యటించనుంది.

భూలోక స్వర్గాన్ని తలపిస్తున్న గోల్డెన్ చారిట్ లగ్జరీ ట్రైన్.. చూసారా!

ప్రైడ్ ఆఫ్ కర్ణాటక అని పిలువబడే ఈ ట్రైన్ 7 రోజుల పర్యటనలో మైసూర్ నుండి బండిపూర్ నేషనల్ పార్క్, చిక్కమగలూరు, హంపి మరియు గోవాకు బయలుదేరుతుంది. జ్యువెల్ ఆఫ్ ది సౌత్ అని పిలువబడే ఈ ట్రైన్ 7 రోజుల పర్యటనలో మైసూర్ నుండి బయలుదేరి హంపి, మామల్లపురం, తంజావూర్ మరియు కొచ్చితో సహా వివిధ గమ్యస్థానాలకు వెళుతుంది.

MOST READ:ఇది చూసారా.. మొబైల్ లైబ్రరీగా మహీంద్రా బొలెరో పిక్-అప్ ట్రక్

భూలోక స్వర్గాన్ని తలపిస్తున్న గోల్డెన్ చారిట్ లగ్జరీ ట్రైన్.. చూసారా!

కర్ణాటక క్లైంబ్స్ అని పిలువబడే ఈ రైలు 4 రోజుల పర్యటనలో మైసూర్ నుండి బయలుదేరి బండిపూర్ నేషనల్ పార్క్, హంపితో సహా వివిధ ప్రాంతాలకు వెళుతుంది. ఫీజుల వివరాల కోసం ప్రయాణికులు సంబంధిత కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. ఇది ఏమైనా ఇలాంటి లగ్జరీ ట్రైన్ సర్వీస్ యాత్రికులకు చాలాబాగా ఉపయోగపడుతుంది.

Most Read Articles

English summary
IRCTC Organising Golden Chariot Train Tours From 2021. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X