నావిక్ ప్రయోగంతో స్వంత జిపిఎస్ వ్యవస్థను రూపొందించుకున్న భారత్

By Anil

అంతరిక్ష పరిశోధనలు కేరాఫ్ అడ్రస్‌గా ఇండియన్ ఇస్రో తయారవుతోంది. అంతరిక్ష పరిజ్ఞానంలో ఎన్నో విజాయలను సాధించిన ఇండియా చాలా సంవత్సరాల వరకు అమెరికాకు చెందిన జిపిఎస్ సిస్టమ్ మీద ఆధారపడి ఉండేది. అయితే ఇండియా తాజాగా జిపిఎస్ కు బదులుగా ఐఆర్‌ఎన్ఎస్ఎస్ వ్యవస్థను ప్రవేశ పెట్టింది. దీనికి చెందిన చివరి శాటిలైట్ అయిన ఏడవ దానిని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఇంతటితో అమెరికా జిపిఎస్ పరిజ్ఞానానికి స్వస్తి పలికి స్వంత న్యావిగేషన్ వ్యవస్థను కలిగి ఉన్న ఐదు దేశాల సరసన ఆరవ దేశంగా అవతరించింది.

 ఐఆర్‌ఎన్ఎస్ఎస్ అనగా

ఐఆర్‌ఎన్ఎస్ఎస్ అనగా

ఐన్‌ఆ‌ర్‌ఎస్ఎస్ అనే దానిని ప్రస్తుతం అమెరికా నుండి వినియోగించుకుంటున్న జిపిఎస్ స్థానంలో ప్రేవేశపెట్టనున్నారు. గ్లోబల్ పొజిషనింగ్‌ సిస్టమ్ కు బదులుగా ఇండియన్ రీజియన్ న్యావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. జిపిఎస్‌ ద్వారా జరిగే అన్ని కార్య కలాపాలను దీనిని నుండి వినియోగించుకోవచ్చు.

నావిక్

నావిక్

చాల సంవత్సరాల క్రితం దేశీయంగా ఉన్న సముద్ర తీరం వెంబడి నావికులు ఉండేవారు. అయితే అప్పట్లో దిక్కులు పసిగట్టి ప్రయాణించే ఆత్యాధునిక పరిజ్ఞానాల వారి వద్ద ఉండేవి కాదు. అయితే ఆకాశంలో ఉన్న నక్షత్రాలు మరియు సూర్య, చంద్రుల కదలికల బట్టి వారు సముద్రంలో ప్రయాణించే వారు. వారికి చిహ్నంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రయోగం విజయానంతరం దీనికి నావిక్ అని నామకరణం చేశారు.

ఐఆర్‌ఎన్ఎస్ఎస్ 1జి

ఐఆర్‌ఎన్ఎస్ఎస్ 1జి

శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి ఇస్రో ఎక్కువగా పిఎస్ఎల్‌వీ 33 రాకె‌ట్‌ను వినియోగించేది. ఎందుకంటే ఈ రాకెట్‌ను వినియోగించినపుడు ప్రయోగం ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఐఆర్‌ఎన్ఎస్ఎస్-1జి శాటిలైన్ ఈ రాకెట్‌ను ఉపయోగించి ప్రయోగించారు.

20.21 నిమిషాలు, 497.8 కిలోమీటర్లు

20.21 నిమిషాలు, 497.8 కిలోమీటర్లు

అత్యధిక విజయాలు సాధించిన పిఎస్‌‌ఎల్‌వీ 33 రాకెట్‌ ద్వారా క్రితం రోజున ఇస్రో ఐఆర్‌ఎన్ఎస్ఎస్ శాటిలైట్‌ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఇది 20.21 నిమిషాల కాల వ్యవధిలో సుమారుగా 497 కిలోమీటర్లు పాటు ప్రయాణించి నిర్ధిష్ట కక్ష్యను చేరుకుంది.

ఆరవ దేశంగా అవతరణ

ఆరవ దేశంగా అవతరణ

స్వంత జిపిఎస్ పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేసుకున్న దేశాల సరసన ఆరవ దేశంగా అవతరించింది భారత్. ప్రస్తుతం అమెరికా, రష్యా, యూరప్, చైనా మరియు జపాన్ ఈ జాబితాలో ఉన్నాయి.

మిగిలిన ఐదు దేశాలకు ధీటుగా

మిగిలిన ఐదు దేశాలకు ధీటుగా

ఇస్రో అధికారికంగా ప్రకటించిన వాటిలో భారత్‌కు చెందన ఈ ఐఆర్ఎన్ఎస్ఎస్ వ్యవస్థ అమెరికాకు చెందిన జిపిఎస్, రష్యాకు చెందిన గ్లోనాస్ మరియు ఇతర స్వంత పరిజ్ఞానం కలిగిన దేశలతో సమానంగా ఉంటుందని తెలిసింది.

1ఎ మరియు 1బి

1ఎ మరియు 1బి

ఐఆర్ఎన్ఎస్ కోసం ముందుగా ప్రారంభించిన 1ఎ శాటిలైట్ దాని కక్ష్యలో సరైన పనితీరును కనబరుస్తోంది. ఇది ముఖ్యమైన 1బి ను ప్రయోగించడానికి ముందుగా అనువైన పరిస్థితులను అధ్యనం చేయడానికి 1ఎ శాటిలైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఖర్చు

ఖర్చు

ఇండియన్ ఇస్రో విజయాలలో అరుదైనది ఈ ఐర్‌ఎన్ఎస్ఎస్ ప్రయోగం. దీని ద్వారా భారత్ ఖ్యాతి మరో మారు ప్రపంచ వ్యాప్తంగా మారు మ్రోగింది. ఇంతటి పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవాలంటే సుమారుగా ఏడు శాటిలైట్ల వరకు అవసరం అవుతాయని ప్రతిపాదించింది. అయితే అన్నీ అనుకున్నట్లుగానే 3,425 కోట్లు రుపాయల బడ్జెట్‌తో దీనిని పూర్తి చేసింది.

ఇంధనం

ఇంధనం

దీనిని ప్రయోగించడానికి మొదటి దశలలో రెండు భాగాలుగా అవసరమయ్యే 73.2 టన్నుల ఘన ఇంధనాన్ని మరియు 138.2 టన్నుల ఘన ఇంధనాన్ని వినియోగించారు. ఈ ఇంధన మండుతూ మొత్తం 320 టన్నుల బరువున్న రాకెట్‌ నింగిలోకి పరుగులు తీయడానికి ఉపయోగపడింది.

ఏడు ఉపగ్రహాలతో అందుబాటులోకి

ఏడు ఉపగ్రహాలతో అందుబాటులోకి

ఇస్రో మొత్తం ఏడు ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టింది. ముందు నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం గత ఏడాది ఏప్రిల్ 4 నుండి ఈ ఏడాది ఏప్రిల్ 28 వరకు IRNSS శ్రేణిలో మొత్తం ఏడు ఉపగ్రహాలను ప్రయోగించింది.

శాటిలైట్ బరువు

శాటిలైట్ బరువు

పిఎస్‌ఎల్‍‌వీ-33 రాకెట్ నింగిలోకి మోసుకెళ్లిన ఐఆర్ఎన్‌ఎస్ఎస్ యొక్క శాటిలైట్ బరువు సుమారుగా 1425 కిలోలుగా ఉంది. తక్కువ ఖర్చుతో స్వంత జిపిఎస్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న ఘనత కూడా ఇండియన్ ఇస్రోకే దక్కింది.

వాతావరణ సమాచారం

వాతావరణ సమాచారం

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ ఐఎన్ఆర్ఎస్ఎస్ ద్వారా దేశానికి చెందిన గాలిలో మరియు వాతావరణంలో చోటు చేసుకునే మార్పులను అన్ని వాతావరణ పరిస్థితుల్లో స్థానం మరియు సమయం ఆధారంగా పూర్తి సమాచారాన్ని పొందవచ్చు.

దేశం నలువైపులనూ...

దేశం నలువైపులనూ...

ఐఆర్ఎన్ఎస్ఎస్ కోసం ఇస్రో మొత్తం ఏడు శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అందులో మూడు శాటిలైట్లను భూ స్థిర కక్ష్యలోకి మరియు నాలుగు శాటిలైట్లను భూ సమస్థిత కక్షలోకి ప్రవేశపెట్టింది. తద్వారా భారతదేశపు మొత్తం భూ భాగపు చుట్టు ప్రక్కలను పర్యవేక్షిస్తుంది.

విమానయాన సేవలకు

విమానయాన సేవలకు

దేశీయంగా ఉన్న అన్ని విమానాశ్రయాల్లో సమాచార సాంకేతిక వ్యవస్థ కోసం ఈ దేశీయ ఐఆర్‍‌ఎన్ఎస్ఎస్ పరిజ్ఞానాన్ని రానున్న రెండేళ్లలోపు వినియోగించనున్నారు.

ఆటోమొబైల్ రంగంలో

ఆటోమొబైల్ రంగంలో

వెహికల్ ట్రాకింగ్ (ఈ పరిజ్ఞానం ద్వారా వాహనం ఉన్న ప్రదేశాన్ని గుర్తించడం), డ్రైవర్ల కోసం విజువల్ మరియు వాయిస్ న్యావిగేషన్ సిస్టమ్ కోసం ఈ పరిజ్ఞానాన్ని వినియోగించుకోవచ్చు.

న్యావిగేషన్

న్యావిగేషన్

ప్రతి ఒక్క రంగంలో కూడా న్యావిగేషన్ వ్యవస్థ ఎంతో కీలకమైనది. అందులో ముఖ్యంగా కారులో, సెల్ ఫోన్ ద్వారా జిపిఎస్ న్యావిగేషన్, ఓడలు, నౌకలు, బోట్లు, ఫ్లీట్ మేనేజ్‌మెంట్ అంతే కాకుండా ఎయిర్ క్రాఫ్ట్ భారీ విమానాలలో మరియు కొన్ని శాటిలైట్లలో కూడా దీని వినియోగిస్తారు.

నగరాల సర్వే మరియు నిర్మాణ ప్రణాళికల్లో

నగరాల సర్వే మరియు నిర్మాణ ప్రణాళికల్లో

ఐఎన్ఆర్ఎస్ఎస్ పరిజ్ఞానాన్ని నిర్మాణ రంగం పరంగా వినియోగించే భౌగోళిక సమాచార వ్యవస్థలా కూడా ఇది పనిచేస్తుంది. అంతే కాకుండా సర్వేలలో నిర్ధిష్ట పాయింట్లను గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది.

విపత్తుల నిర్వహణ

విపత్తుల నిర్వహణ

ఐఆర్ఎన్ఎస్ఎస్ పరిజ్ఞానం ద్వారా రెస్కూ నిర్వహించవచ్చు అంతే కాకుండా ఇందులో ఉండే ప్రత్యేక టెక్నాలజీ ద్వారా శత్రువుల కదలికలు మరియు భూమి ఆక్రమనలను గుర్తించవచ్చు.

ఆట విడుపు మరియు మానసిక విశ్రాంతి కోసం

ఆట విడుపు మరియు మానసిక విశ్రాంతి కోసం

భవిష్యత్తులో జియో ట్యాగింగ్ అనే పరిజ్ఞానం ద్వారా ఫోటోలు, ప్రదేశం యొక్క ఆధారంగా జరిగే ఆటలకు సంభందించిన వివరాలను ఎన్ఎస్ఎస్ డివైస్‌ల ద్వారా వినియోగించుకోవచ్చు.

భద్రత రంగంలో

భద్రత రంగంలో

జంతువుల భద్రత పరంగా ముందడగు వేస్తున్నారు. అందుకు నిదర్శనం ఈ పరిజ్ఞానం. ఎందుకంటే జంతువులను మరియు వాహనాలను ట్రాకింగ్ చేయడం ద్వారా వాహనాల ద్వారా జరిగే ప్రమాదాలు జరగకుండా ముందుగా సందేశం పంపిస్తుంది.

వ్యవసాయ రంగంలో

వ్యవసాయ రంగంలో

పంటలు పండించే ముందు వేయనున్న పంట, నేల రకము మరియు వాతావరణానికి చెందిన సమాచారం దీనికి తెలియజేయడం ద్వారా ఇది అవసరానికి తగ్గట్లుగా సూచనలను ఇస్తుంది. తద్వారా పంట దిగుబడులు పెరుగుతాయి.

గడియారం యొక్క సూచనలు

గడియారం యొక్క సూచనలు

ఈ పరిజ్ఞానం ద్వారా సమకాలీకరించబడిన సమయం ప్రకారం సమాచారం యొక్క సూచనలు చేస్తుంది.

రక్షణ రంగంలో

రక్షణ రంగంలో

రక్షణ రంగంలో ముఖ్యంగా సైన్యానికి ఎంతో ఉపయోగపడే విధంగా మిస్సైల్స్, బాంబులు మరియు ఎయిర్ క్రాఫ్ట్ ల యొక్క దిశను మరియు వాటిని పనితీరులను ఈ పరిజ్ఞానం ద్వారా గమనించవచ్చు. యుద్ద సమయంలో ఇది ఎంతో విలువైన సమాచారాన్ని సైనిక స్థావరాలకు చేరవేస్తుంది.

మరిన్ని కథనాల కోసం......

హైదరాబాద్ నుండి ఢిల్లీకి కేవలం రూ. 91 లతో ప్రయాణించవచ్చు

మరిన్ని కథనాల కోసం......

అణు పరీక్షలు ఆపకపోతే మేమేంటో చూపిస్తాం...!!

More from DriveSpark

Article Published On: Friday, April 29, 2016, 16:15 [IST]
English summary
Irnss Launch Indias Own Regional Navigation Satellite System Takes Shape
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+