రా.వన్ సినిమాలో షారుఖ్ రైడ్ చేసింది పల్సర్ 220 బైకా..?

ఈ ఫోటోతో పాటు షారుఖ్ తన బ్లాగ్‌లో ఓ సందేశాన్ని కూడా పోస్టే చేశారు. దాని సారాంశం ఇది.."రా.వన్‌లో ఉపయోగించిన బైక్ ఫిక్చర్‌ను పోస్ట్ చేస్తున్నాను. నాకు ఎల్లప్పుడూ బైక్‌లను రైడ్ చేయాలనే కోరిక ఉండేది.. కానీ అమ్మ ఎప్పుడూ అనుమతించేది కాదు. ఎందుకంటే, అదంత సురక్షితం కాదని ఆమెకు తెలుసు. అయితే, ఈ బైక్ రైడ్ సన్నివేశంలో నన్ను తాళ్లతో కట్టేడం వలన సురక్షితంగా రైడ్ చేయగలిగాను. ఒక రొమాంటింగ్ హీరోగా ఉన్న నాకు ఈ బైక్ రైడ్ సన్నివేశం చాలా థ్రిల్‌ను కలిగించింద"ని కింగ్ ఖాన్ పేర్కొన్నాడు.
మన సూపర్‌హీరో కోసం ఈ సూపర్‌బైక్‌ను సాబు సిరిల్ అనే డిజైనర్ రూపొందించారు. వివిధ ఇమేజ్‌లు, బుక్స్, ఫోటోల ద్వారా ప్రేరణ పొంది సిరిల్ ఈ బైక్‌ను డిజైన్ చేసినట్లు షారుఖ్ వెల్లడించాడు. ఈ బైక్‌ను గమనిస్తే.. ట్రాన్ లెగస్సీ చిత్రంలోని ట్రాన్ బైక్‌ను చూసి ప్రేరణ పొందినట్లు తెలుస్తుంది. ఏదైమనప్పటికీ.. రెండింటి డిజైన్‌లలోనూ భారీ వ్యత్యాసమే ఉంది. ఇదిలా ఉంచి ఈ బైక్‌ను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే.. బైక్ వెనుక భాగం బజాజ్ పల్సర్ 220 సీసీ బైక్‌ను పోలి ఉంటుంది. బైక్ స్టెప్ సీటింగ్ మరియు వెనుకవైపు ఉండే బ్రేక్ లైట్లను గమనిస్తే.. ఇది పల్సర్ బైక్ అని తెలిసిపోతుంది. మరి మీరేమంటారు..!?


Click it and Unblock the Notifications








