కర్ణాటకలో టెస్లా?.. హెచ్‌డీ కుమారస్వామి ఏం చెప్పారంటే..

భారత్ ప్రగతి మార్గంలో దూసుకెళ్తోంది. ఈ తరుణంలో ప్రపంచంలోని చాలా కంపెనీలు ఇండియా వైపు చూస్తున్నాయి. ఇందులో ఒకటి అమెరికన్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా (Tesla) కూడా ఒకటి. నుంచి ఈ కంపెనీ భారతదేశంలో తయారీ కర్మాగారం ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లను చేస్తోంది. దీనికి సంబంధించిన ఎలోన్ మస్క్.. దేశ ప్రధానమంత్రితో పలుమార్లు మాట్లాడారు. ఆ తరువాత టెస్లా భారత్ రానున్నట్లు ధ్రువీకరించారు. ఈ విషయాన్ని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

జనతాదళ్ సెక్యులర్ నాయకుడు ఇటీవలే కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖల బాధ్యతలు స్వీకరించిన హెచ్‌డి కుమారస్వామి టెస్లా ఇండియా రాకను గురించి మాట్లాడారు. కర్నాటకలో టెస్లా కర్మాగారాన్ని నెలకొల్పడానికి గల అవకాశాల గురించి ప్రశ్నించినప్పుడు.. కుమారస్వామి సానుకూలంగా స్పందితూ.. నిజమే టెస్లా రావడానికి అవకాశం ఉంది. దీనిని సక్సెస్ చేయడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.

Is Tesla Coming To Karnataka Minister HD Kumaraswamy

కేవలం కర్ణాటక రాష్ట్రం మాత్రమే కాకుండా.. దేశం మొత్తం బాగుండాలని ఆలోచించిస్తున్నాను. కేంద్రమంత్రిగా ఒక్క రాష్ట్రం మీద మాత్రమే కాకుండా దేశాభివృద్ధి మీద ద్రుష్టి పెడతానని హెచ్‌డి కుమారస్వామి అన్నారు. టెస్లా గత కొంతకాలం నుంచి మన దేశానికీ రావడానికి సరైన సమయం కోసం వేచి చూస్తోంది. ప్రారంభంలో టెస్లా కర్ణాటకలో ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు గుజరాత్ వద్ద తయారీ కర్మాగారం ఏర్పటు చేయడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం.

టెస్లా అనేది ప్రపంచ మార్కెట్లో ఎంతో పాపులర్ అయిన దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ. అమెరికాలో అగ్రగామిగా ఉన్న ఈ కంపెనీ తన ఉత్పత్తులను ప్రపంచంలోని అనేక దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇలాంటి ఎగుమతుల కారణంగా టెస్లా ధరలు ఎక్కువగా ఉన్నాయి. స్వదేశీయంగా ఉత్పత్తి జరిగినప్పుడు ఉత్పత్తుల ధరలు కొంత వరకు తగ్గుతాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం కూడా టెస్లాకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది.

Tesla Model 3

భారతదేశంలో అధిక దిగుమతి సుంకాలు, మౌలిక సదుపాయాల కొరత మరియు స్థానిక తయారీదారుల నుండి పోటీ వంటి సవాళ్లు ఎలక్ట్రిక్ కార్ కంపెనీకకు పెద్ద అడ్డంకులుగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ.. స్థిరమైన రవాణా వైపు పెరుగుతున్న ప్రపంచ ధోరణి మరియు ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి మరియు వినియోగం కోసం భారత ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది. ఇందులో భాగంగానే టెస్లా సమీప భవిష్యత్తులో దేశంలో ఉనికిని స్థాపించే అవకాశం ఉందని తెలుస్తోంది.

భారతదేశంలో అన్యదేశ్య కంపెనీలను కూడా కొంత ఉపశమనం కల్పించడానికి భారత ప్రభుత్వం గత మార్చి నెలలో కొత్త ఎలక్ట్రిక్ వాహన విధానం ప్రకటించింది. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతి మీద ఏకంగా 85 శాతం వరకు పన్నులు తగ్గించడానికి సన్నద్ధమైనట్లు తెలిసింది. ఇది ఇతర దేశాల సంస్థల పెట్టుబడులను ఆకర్శించడానికి ఓ మార్గం కూడా. ఇవన్నీ చూస్తుంటే టెస్లా త్వరలోనే భారతదేశంలో అడుగుపెడుతుంది తెలుస్తోంది.

మన దేశంలో హోరాహోరీగా సాగిన సార్వత్రిక ఎన్నికలు ముగిసి బీజేపీ విజయం సాధించిన తరువాత టెస్లా సీఈఓ మస్క్.. ప్రధాని నరేంద్ర మోదికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నికలలో మీరు గొప్ప విజయం సాధించినందుకు అభినందనలు అంటూ.. భారతదేశంలో టెస్లా ఉత్తేజకరమైన పని చేయడానికి ఎదురు చూస్తోందని అన్నారు. దీనికి మోదీ కూడా శుభాకాంక్షలు చెబుతూ.. ప్రభుత్వం మా భాగస్వాములందరికీ అనుకూల వ్యాపార వాతావరణాన్ని అందిస్తుందని అన్నారు.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Saturday, June 15, 2024, 9:01 [IST]
English summary
Is tesla coming to karnataka minister hd kumaraswamy answer
Read more on: #tesla
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+