కారును సువాసనలతో నింపేయాలని చూస్తున్నారా.. రూ.200ల్లోపు దొరికే బెస్ట్ ఎయిర్ ఫ్రెషర్ యాక్సెసరీస్ ఇవే!
కారు ఎప్పుడూ నీట్‌గా, సువాసనతో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. చాలా మంది కారు బయటి లుక్ బాగుండాలని చూస్తారు కానీ, లోపలి భాగాన్ని శుభ్రంగా ఉంచేవారు చాలా తక్కువ. పండ్లు, ఆహార పదార్థాలు కారులో పెట్టినప్పుడు వాటి వాసన లోపల ఉండిపోతుంది. అప్పుడు గ్లాస్ కొంచెం దించి డ్రైవ్ చేయడం అంతగా మంచిది కాదు. కొందరు ఎయిర్ ఫ్రెష్నర్‌ను ఎక్కువ చేస్తారు.
అలాంటి సమయంలో మీ కారులో పెట్టుకోవడానికి ఏవి మంచి ఎయిర్ ఫ్రెష్నర్‌లు? అవి ఎక్కడ దొరుకుతాయో తెలుసుకుందాం. సాధారణంగా వేలాడదీసే ఎయిర్ ఫ్రెష్నర్‌లే కాదు. అమెజాన్‌లో చాలా స్టైలిష్ యాక్సెసరీస్ కూడా ఉన్నాయి. వాటిని తెలుసుకోవడం మంచిది, ఎందుకంటే అవి కారు లోపలి భాగాన్ని మరింత అందంగా కనిపించేలా చేస్తాయి.

చాలా కార్ల డాష్‌బోర్డ్‌లపై చిన్న హెలికాప్టర్లు లేదా విమానాలు కనిపించడం గమనించే ఉంటారు. అవి చూడగానే సోలార్‌తో పనిచేస్తాయని అర్థమవుతుంది. కానీ, అవి కేవలం బొమ్మలు కావు, ఎయిర్ ఫ్రెషర్‌లు. అమెజాన్‌లో ఒక ఎయిర్ ఫ్రెషనర్ కోసం వెతికినప్పుడు, మొదటగా ఈ తరహా మోడల్స్ మీకు కనిపిస్తాయి. చూడడానికి చాలా స్టైలిష్‌గా ఉండడం, మీ కారు డాష్‌బోర్డ్‌కు ఒక ప్రత్యేకమైన లుక్ ఇవ్వడం వీటిలో ఆకర్షించే ముఖ్యమైన అంశం.
ఈ తరహా యాక్సెసరీస్ అంటే ఆసక్తి లేనివారికి సింపుల్‌గా కారు రియర్ వ్యూ మిర్రర్‌కు వేలాడదీసే ఎయిర్ ఫ్రెషనర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు, గోద్రేజ్ వంటి ప్రముఖ బ్రాండ్ల నుండి అనేక రకాల ఎయిర్ ఫ్రెషనర్‌లను మీరు అమెజాన్ లేదా ఇతర ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో కొనుగోలు చేయవచ్చు. ఇవి రూ.200 నుండి ప్రారంభమయ్యే ధరలలో లభిస్తాయి.

ప్రస్తుతం వర్షాకాలం నడుస్తోంది. వర్షాకాలంలో కారు లోపలి భాగం, ముఖ్యంగా ఫ్లోర్ మ్యాట్స్ తడిసిపోవడం వల్ల దుర్వాసన వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, మ్యాట్స్ తడవకుండా చూసుకోవడానికి ప్రయత్నించాలి. తడిసిన గొడుగులు, రెయిన్‌కోట్‌లు వంటివి కారు లోపల ఉంచడం వల్ల కూడా దుర్వాసన వస్తుంది.
ఇలాంటి వాసనలు రాకుండా ఉండటానికి, సిలికా జెల్ ప్యాకెట్లు ఉపయోగించడం చాలా మంచిది. ఇవి తేమను పీల్చుకుని దుర్వాసనను తగ్గిస్తాయి. అలాగే, కారు లోపల తడిసిపోయిన వస్తువులను వెంటనే తీసివేయడం మంచిది.

వర్షాకాలంలో రోడ్లపై బురద, మట్టి చిమ్ముకుంటూ వెళ్ళేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి. చాలా రకాల మట్టి, బురద కారు బాడీకి అంటుకుపోతాయి. ఇది కొన్నిసార్లు మీ కారు పెయింట్‌ను కూడా దెబ్బతీస్తుంది. అందుకే, కారును క్రమం తప్పకుండా సరైన పద్ధతిలో కడగడం కారు పెయింట్ రక్షణకు చాలా సహాయపడుతుంది. కార్లు కడిగేటప్పుడు ఉపయోగించే వస్తువుల నుంచి కడిగే పద్ధతి వరకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
కారు పెయింట్ పాడైతే కారును రీసేల్ చేయాలని అనుకున్నప్పుడు ఆశించిన ధర దొరకకపోవచ్చు. అందుకే కారు పెయింట్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. బాడీలోని ఒక చిన్న భాగానికి పెయింట్ వేయించడానికి కూడా చాలా ఖర్చవుతుంది. అంతేకాదు, ఒరిజినల్ స్టాక్ కండిషన్‌లో పెయింట్‌ను తిరిగి పొందడం కూడా చాలా కష్టం. కారు ఇంటీరియర్ లేదా ఇతర భాగాలను నిర్వహించినట్లే బయటి బాడీ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ ఉండాలి.
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: కారును బయట ఎంత నీట్‌గా ఉంచినా.. లోపల శుభ్రంగా, సువాసనతో లేకపోతే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మజాగా ఉండదు. ముఖ్యంగా వర్షాకాలంలో తడిసిన వస్తువుల వల్ల దుర్వాసన రావడం చాలా సహజం. అందుకే ఈ ఎయిర్ ఫ్రెషనర్‌లు, సిలికా జెల్ వంటివి కారును ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉంచడానికి చాలా సహాయపడతాయి. కారు పెయింట్ రక్షణ కూడా చాలా ముఖ్యం. అది కారు రీసేల్ వాల్యూను కూడా ప్రభావితం చేస్తుంది.


Click it and Unblock the Notifications








