టోల్ ప్లాజా దందా షురూ? అక్కడకు వెళ్లకముందే డబ్బులు కట్ అయితే ఏం చేయాలి?
టోల్ ప్లాజాలు కూడా మోసాలు చేస్తున్నాయా? మీరు టోల్ గేట్ దాటకముందే మీ ఫాస్టాగ్‌లో డబ్బులు కట్ అయితే ఏం చేయాలి? ఏంటి అలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యపోతున్నారా.. మరి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. మీ డబ్బులు పోతే ఎక్కడ కంప్లైంట్ చేయాలో తెలుసా? తెలుసుకోకపోతే మీ డబ్బులు పోయినట్టే.. అందుకోసం ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.
రాష్ట్రాలు దాటి వెళ్లాలన్నా, రాష్ట్రంలోనే వేరే ప్రాంతాలకు వెళ్లాలన్నా టోల్ చెల్లించాల్సిందే అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఒక్కోసారి టోల్ ప్లాజా దగ్గరికి వెళ్లకుండానే మీ ఫాస్టాగ్‌లో డబ్బులు కట్ అయితే ఏం చేస్తారు? కేరళలో ఇలాంటి కొన్ని సంఘటనలు జరిగాయి. తరూర్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి తాను పన్నియంకర టోల్ గేట్ దాటకపోయినా తన ఫాస్టాగ్‌లో డబ్బులు కట్ అయ్యాయని కంప్లైంట్ చేశాడు.

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాలను తీసేసి శాటిలైట్ ద్వారా టోల్ వసూలు చేసేందుకు సిద్ధమవుతోంది. కానీ, ఇంట్లో ఉన్న వాహనానికి కూడా టోల్ పడితే ఏం చేయాలో తెలుసా ?. ఇలా మీ డబ్బులు పోతే ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలో చాలా మందికి తెలియదు.
ఇలాంటివి టెక్నికల్ సమస్యల వల్ల జరుగుతాయి. మీ వాహనం ఫాస్టాగ్‌లో డబ్బులు కట్ అయితే వెంటనే 1033 నెంబర్‌కు కాల్ చేసి కంప్లైంట్ చేయండి. వారు వివరంగా పరిశీలించిన తర్వాత అది నిజంగా టెక్నికల్ సమస్య వల్లే జరిగిందని తేలితే, మీ డబ్బులు మీకు తిరిగి ఇస్తారు.

కేంద్ర ప్రభుత్వం శాటిలైట్ ద్వారా వాహనాలను కచ్చితంగా ట్రాక్ చేసి, హైవేలపై ప్రయాణించిన రియల్ టైం దూరాన్ని బట్టి టోల్ వసూలు చేయడానికి GNSS సిస్టమ్‌ను (GPS, GPS-ఎయిడెడ్ GEO ఆగ్మెంటెడ్ నావిగేషన్ - GAGAN) ఉపయోగించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ విధానం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని మొదట ప్రకటించినప్పటికీ, కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల వాయిదా పడింది.
టోల్ లీకేజీని తగ్గించడానికి, వినియోగదారుల నుంచి ఎక్కువ ఛార్జీ వసూలు చేయకుండా నిరోధించడానికి ఈ కొత్త సిస్టమ్‌ను తీసుకువస్తున్నారు. ప్రస్తుతం ఉన్న విధానంలో బ్యారియర్‌ల వద్ద అమర్చిన కెమెరాలు వాహనాల ఫాస్టాగ్ ఐడీలను రీడ్ చేసి, ముందున్న టోల్ ప్లాజా నుంచి ఉన్న దూరాన్ని బట్టి ఫీజు వసూలు చేస్తున్నాయి.

కొత్త ప్రకటన వచ్చే వరకు ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్ సిస్టమ్‌నే ఉపయోగిస్తున్నారు. టోల్ గేట్ వద్ద స్కార్ చేసినప్పుడు తక్కువ బ్యాలెన్స్ చూపిస్తే మీ ఫాస్టాగ్‌ను బ్లాక్‌లిస్ట్ చేసే అవకాశం ఉంది. ఇలాంటి వాహనాలు టోల్ బూత్‌లలో ట్రాఫిక్ జామ్‌కు కారణమవుతాయి కాబట్టి ఇలా చేస్తారు. అలాగే, ఛాసిస్ నెంబర్, వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ వేర్వేరుగా ఉన్నా కూడా ఫాస్టాగ్‌ను బ్లాక్‌లిస్ట్ చేయవచ్చు.
స్కానింగ్‌కు కనీసం 10 నిమిషాల ముందు మీ ట్యాగ్ బ్లాక్‌లిస్ట్‌లో ఉంటే మీ ట్రాన్సాక్షన్ రిజెస్ట్ అవుతుంది. టోల్ బూత్‌లను దాటే ముందు వినియోగదారులు తమ ఫాస్ట్ ట్యాగ్ స్టేటస్‌ను సరిచేసుకోవడానికి 70 నిమిషాల కొత్త గ్రేస్ పీరియడ్‌ను ప్రవేశపెట్టారు.
జరిమానా విధించే ముందు వినియోగదారులు తమ ట్యాగ్‌లలోని సమస్యలను పరిష్కరించడానికి ఇది సమయం ఇస్తుంది. ఫాస్టాగ్ కార్డ్‌తో టోల్ బూత్‌కు చేరుకున్నప్పుడు మీ వాహనం బ్లాక్‌లిస్ట్‌లో ఉంటే మీరు రెట్టింపు టోల్ చెల్లించాల్సి ఉంటుంది.
అయితే, స్కాన్ చేసిన 10నిమిషాల్లోపు మీరు మళ్లీ డబ్బులు చెల్లిస్తే అదనంగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి పొందడానికి రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఇది సకాలంలో చెల్లింపులను ప్రోత్సహిస్తుంది. డ్రైవర్లకు అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. కొత్త నిబంధనల ప్రకారం మరొక ముఖ్యమైన మార్పు లావాదేవీ ఆలస్యం కావడం. టోల్ రీడర్‌ను దాటిన తర్వాత టోల్ లావాదేవీ ప్రాసెస్ చేయడానికి 15నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకుంటే ఫాస్టాగ్ వినియోగదారుడు అదనపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications








