దగ్గర నుంచి అలా.. దూరం నుంచి ఇలా! మైండ్ బ్లోయింగ్ చేస్తున్న ఇషా అంబానీ కారు - వీడియో

ఇటీవల సోషల్ మీడియాలో ఓ రంగులు మార్చే ఖరీదైన 'రోల్స్ రాయిస్' (Rolls Royce) తెగ వైరల్ అయింది. ఇంతకీ ఆ కారు ఎవరిది? దాని ఖరీదు ఎంత.. అనే మరిన్ని వివరంగా వివరంగా ఈ కథనంలో చూసేద్దాం.

ముంబై రోడ్డుపై కనిపించిన రంగులు మార్చే రోల్స్ రాయిస్ కలినన్.. ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీకి చెందినదని తెలుస్తోంది. వీడియోలో గమనించినట్లయితే.. ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ కార్లు ముందు వైపు వెళ్తుంటే దాని వెనుక సెక్యూరిటీ కార్లు ఆ తరువాత రోల్స్ రాయిస్ కారుని చూడవచ్చు. ఈ కారు ఇతర రోల్స్ రాయిస్ కార్ల మాదిరిగా కాకుండా రంగులు మార్చుకునే స్పెషాలిటీ కలిగి ఉంది.

Isha Ambani Rolls Royce Cullinan

వీడియోలో కనిపించే ఈ కారు దగ్గర నుంచి ఒక రంగులో.. దూరం నుంచి మరో రంగులో కనిపిస్తోంది. ప్రత్యేకమైన ఈ కారు చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటుంది. దీని ధర రూ. 10 కోట్లు వరకు ఉండొచ్చని తెలుస్తోంది. సాధారణ రోల్స్ రాయిస్ కలినన్ ధర మార్కెట్లో రూ. 6.95 కోట్లు, దీనిని కస్టమర్ తనకు నచ్చినట్లు మార్చుకునే విధానాన్ని బట్టి ధర ఎక్కువగా ఉంటుంది.

అంబానీ ఫ్యామిలీ అంటేనే ఓ ప్రత్యేకం, ఎందుకంటే వారు ఖరీదైన కార్లను మాత్రమే కాకుండా.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన నివాసాలలో ఒకటైన 'యాంటీలియా' భవనంలో ఉన్నారు. ఈ ఒక్క భవనం ఖరీదు మాత్రమే ఏకంగా రూ. 15000 కోట్లు వరకు ఉంటుంది. అంత విలాసవంతమైన భవనం నివసించే వారు ఖరీదైన కార్లను ఉపయోగించడం గురించి పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

Isha Ambani Rolls Royce Cullinan Rear

రోల్స్ రోయ్స్ కలినన్

ఇక బ్రిటీష్ బ్రాండ్ అయిన రోల్స్ రాయిస్ కలినన్ విషయానికి వస్తే.. ప్రస్తుతం భారతదేశంలో చాలామంది సెలబ్రిటీలు ఉపయోగిస్తున్న కార్ల జాబితాలో ఇది కూడా ఒకటి. అద్భుతమైన డిజైన్, అంతకు మించియున్న ఇంటీరియర్ డిజైన్ కలిగిన కలినన్ పనితీరు పరంగా ఉత్తమంగా ఉండటమే కాకుండా వాహన వినియోగదారులకు లగ్జరీ అనుభూతిని అందిస్తుంది. ఈ కారణంగానే సెలబ్రిటీలు ఎగబడి మరీ రోల్స్ రాయిస్ కార్లను కొనుగోలు చేస్తారు.

అంబానీ గ్యారేజిలోని ఇతర కార్లు

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ గ్యారేజిలో రోల్స్ రాయిస్ కార్లు మాత్రమే కాకుండా బీఎండబ్ల్యూ ఐ8, ఫెరారీ 812 సూపర్ ఫాస్ట్, మెక్‌లారెన్ 520ఎస్ స్పైడర్, లంబోర్ఘిని అవెంటడార్ ఎస్ రోడ్‌స్టర్, ఫెరారీ పోర్టోఫినో, ఆస్టన్ మార్టిన్ డీబీ11, లంబోర్ఘిని ఉరుస్, ల్యాండ్ రోవర్ కార్లు, ప్రేత్యేకంగా బుల్లెట్ ప్రూఫ్ కలిగిన మెర్సిడెస్ బెంజ్ వంటి అనేక ఖరీదైన కారు ఉన్నాయి.

ముఖేష్ అంబానీ కుటుంబం రోజు వారీ వినియోగానికి ఉపయోగించే కార్లు మాత్రమే కాకుండా.. సెక్యూరిటీలోని కార్లు కూడా ఖరీదైనవే కావడం గమనించడదగ్గ విషయం. అంబానీ సెక్యూరిటీలో మెర్సిడెస్ బెంజ్ వంటి ఇతర ఖరీదైన కార్లు ఉన్నాయి. భారతదేశంలో అత్యంత సంపన్న వ్యాపారవేత్తగా పేరు పొందిన అంబానీకి పటిష్టమైన భద్రతను కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం జెడ్ ప్లస్ కేటగిరీ ప్రొటక్షన్ అందిస్తుంది.

నిజానికి ముఖేష్ అంబానీ మరియు వారి ఫ్యామిలీ అత్యంత ఖరీదైన కార్లను ఉపయోగిస్తుందని అందరికి తెలుసు, కానీ అంబానీ గ్యారేజిలో ఎన్ని కార్లు ఉన్నాయి, ఏ బ్రాండ్ కార్లు ఉన్నాయి, వాటన్నింటిని కొనుగోలుకు ఎంత డబ్బు వెచ్చించారనే చాలా విషయాలు తెలియదు. బహుశా భారతదేశంలో ఎక్కువ ఖరీదైన కార్లను కలిగిన అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ అయి ఉంటారని చాలా మంది భావిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Monday, February 12, 2024, 17:00 [IST]
English summary
Isha ambani colour changing expensive rolls royce cullinan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+