ఇషా అంబానీ లగ్జరీ కార్లు చూశారా.. ప్రత్యేకించి ఆ కారు ధర రూ. 6 కోట్ల పైమాటే.!!
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఫ్యామిలీ.. ఎంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారో మనకు తెలిసిందే. వారి వద్ద ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి. కాగా ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ(Isha Ambani Luxury Cars Collection) కార్ల కలెక్షన్ వివరాలు తాజాగా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.. మీరు ఓ లుక్కేయండి.
Mercedes Benz S Class: ఇషా అంబానీ వద్ద ఉన్న లగ్జరీ, ఖరీదైన కార్ల లిస్ట్‌లో మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఒకటి. ధర రూ. 1.77 కోట్ల నుంచి రూ. 1.86 కోట్లు ఉంటుంది. ఇది ఎక్స్-షోరూమ్ ధర. ఈ కారులో 3.0 లీటర్ 6 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉపయోగించారు. అంతేకాకుండా, ఇందులో 3.0 లీటర్ 6 సిలిండర్ డీజిల్ ఇంజిన్ కూడా ఉంది.

BMW 7 Series: గ్లోబల్ మార్కెట్లో అధిక భద్రతా ఫీచర్లు, లగ్జరీ సౌకర్యాలకు BMW 7 సిరీస్ కారు ప్రసిద్ధి చెందింది. ఈ కారు మోడల్ ధర రూ. 1.82 కోట్ల నుంచి రూ. 1.84 కోట్ల ధరలో విక్రయానికి అందుబాటులో ఉంటుందిది. అయితే ఇది కూడా ఎక్స్-షోరూమ్ ధర మాత్రమే.
పవర్‌ట్రెయిన్ విషయానికొస్తే ఇందులో 3.0-లీటర్ పెట్రోల్ మరియు 3.0 లీటర్ డీజిల్ మోటార్ ఆప్షన్‌లతో కూడిన హై-పవర్ మోడల్ ఉంది. రెండూ అధిక సామర్థ్యం గల డిశ్చార్జర్‌లు. అవి వరుసగా 376 బిహెచ్‌పి మరియు 281 బిహెచ్‌పిల పవర్‌ను ఉత్పత్తి చేస్తాయి.

బెంట్లీ ఆర్నేజ్ ఆర్: వింటేజ్ కార్లలో ఒకటైన Bentley Arnage R మోడల్‌ను చివరగా రూ. 2.25 కోట్లకు విక్రయించారు. అయితే ఇది కూడా ఎక్స్-షోరూమ్ ధర మాత్రమే. ఈ కారు మోడల్‌లో 6761 సీసీ ఇంజిన్‌ని అమర్చారు. ఇది V8 టర్బోచార్జ్డ్ పెట్రోల్ మోటార్‌తో పనిచేస్తుంది.
పోర్స్చే కేమాన్ S: ఇషా అంబానీ లగ్జరీ కార్లలో మరో మోడల్ Porsche Cayman S ధర రూ. 1.48 కోట్లు(ఎక్స్-షోరూమ్). ఈ కారు 3436 సీసీ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది చాలా పవర్‌ఫుల్ ఇంజిన్ కావడంతో.. ఈ కారు మోడల్‌కు సూపర్‌కార్ ఔత్సాహికులలో భారీ స్పందన ఉంది.

రేంజ్ రోవర్ ఎవోక్: ఇషా అంబానీకి చెందిన కార్లలో Range Rover Evoque అత్యంత చవకైన కార్ మోడల్. దీని ధర రూ. 67.60 లక్షలు(ఎక్స్-షోరూమ్) గా ఉంది. దేశంలో చాలా మంది సంపన్నుల వద్ద ఈ లగ్జరీ కారు ఉంది.
రోల్స్ రాయిస్ కల్లినన్: ఇషా అంబానీ కార్ల గ్యారేజ్‌లో అత్యంత ఖరీదైన కారు రోల్స్ రాయిస్ కల్లినన్.. దీని ధర రూ. 6.95 కోట్లు(ఎక్స్-షోరూమ్). ఇది అత్యంత విలాసవంతమైన ఫీచర్లు మరియు అత్యంత శక్తివంతమైన మోటారును కలిగి ఉన్న లగ్జరీ కారు కావడం విశేషం. ఇషా అంబానీ తన ప్రయాణాలకు ఎక్కువగా ఈ కారునే ఉపయోగిస్తుంటారు.

ఈ కారు మోడల్‌లో 6.5 లీటర్ V12 పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. ఈ మోటార్ గరిష్ఠంగా 563 bhp శక్తిని మరియు 850 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జత చేయబడి ఉంటుంది. అధిక పనితీరు మరియు అధిక లగ్జరీ ఫీచర్ల కారణంగా ఇషా అంబానీ ఈ కారును తన ప్రధాన యుటిలిటీ వాహనంగా వినియోగిస్తుంటారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








