Isreal hamas war హమాస్‌పై దాడులకు AH-64 Apache హెలికాప్టర్లు.. ఏంటి వీటి ప్రత్యేకత..?
ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు గత శనివారం దాడులకు పాల్పడ్డారు. దీంతోపాటు వేల రాకెట్లతో దాడిచేశారు. ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించి మారణహోమం సృష్టించారు. చిన్నారులు, మహిళలు అని చూడకుండా దారుణంగా హతమార్చారు. దాంతోపాటు వందలాది మందిని బందీలుగా చేసుకున్నారు. దీంతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. హమాస్ ఉగ్రవాదులు ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.
దీనిలో భాగంగా హమాస్ ఉగ్రవాదాల కేంద్రమైన గాజాపై ఇజ్రాయెల్ సేనలు విరుచుకుపడుతున్నాయి. ఇందుకు ఇజ్రాయెల్ వద్ద ఉన్న అనేక అత్యాధునిక ఆయుధాలను ఉపయోగిస్తున్నారు. హమాస్ ఉగ్రమూకలపై దాడులు చేసేందుకు ఇజ్రాయెల్ AH-64 Apache హెలికాప్టర్లను ఉపయోగిస్తోంది. ఈ హెలికాప్టర్లతో హమాస్ ఉగ్రమూకలను మట్టుపెడుతున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

AH-64 అపాచీ హెలికాప్టర్లు (AH-64 Apache helicopters) 30mm చైన్ గన్‌లు, హెల్‌ఫైర్ క్షిపణులను కలిగి ఉంటాయి. వీటితో హమాస్ మిలిటెంట్లపై దాడులు చేయడం, సమూలంగా నాశనం చేస్తున్నాయి. ఈ హెలీకాప్టర్లు ఎదురుదాడులను సైతం తట్టుకోగలిగే సామర్థ్యాలను కలిగి ఉంటాయి. హమాస్‌పై దాడులకు ఇలాంటి హెలికాప్టర్లను వినియోగించడం ద్వారా ఇజ్రాయెల్ తన విధ్వంసక సామర్థ్యాలను ప్రదర్శించింది.
భారత్ కూడా ఈ AH-64 అపాచీ హెలికాప్టర్లను కలిగి ఉంది. వీటిని సాధారణంగా 'ఫ్లైయింగ్ ట్యాంక్స్' అని పిలుస్తారు. 2020లో భారతీయ వాయుసేన (Indian Airforce) 22 అపాచీ హెలికాప్టర్లను కొనుగోలు చేసిన వీటిని దేశ సరిహద్దులకు సమీపంలోని ఎయిర్‌ఫీల్డ్‌ల వద్ద మోహరించింది.

AH-64 అపాచీ హెలికాప్టర్లు రెండు ఇంజన్లు, నాలుగు బ్లేడ్‌లను కలిగి ఉంటాయి. ఈ బ్లేడ్‌లను మడిచేందుకు వీలుంటుంది. క్షిపణులను మోయగల సామర్థ్యం వీటి సొంతం. ఈ హెలీకాప్టర్లు ప్రత్యర్థులకు గణనీయమైన స్థాయిలో నష్టాన్ని కలిగిస్తాయి. ఈ హెలికాప్టర్లు హమాస్ స్థావరాలను ధ్వంసం చేస్తున్న వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
భారత్ వద్ద అపాచీతోపాటు భారీ సైనిక పరికరాలు, సైనిక దళాలను రవాణా చేయగల 15 చినూక్ సైనిక హెలికాప్టర్లను భారత్‌కు అందించింది. అత్యంత అధునాతన మల్టీరోల్ కంబాట్ హెలికాప్టర్‌గా ప్రసిద్ధి చెందిన అపాచీని తయారుచేస్తున్న అమెరికన్ బోయింగ్ సంస్థ.. వీటి సామర్థ్యాన్ని గురించి నొక్కి చెప్పింది.

ఇజ్రాయెల్ రెండు రకాల అపాచీ హెలికాప్టర్లను కలిగి ఉంది. ఈ రెండు వేర్వేరు మోడల్‌లను కలిగి ఉంటాయి. వాటిలో ఒకటి రామన్ ఎయిర్‌బేస్‌లో ఉంది. మరొకటి AH-64D అపాచీలో సాధారణ నిర్వహణలో గుర్తించిన లోపం కారణంగా ఈ సంవత్సరం ప్రారంభం నుంచి తాత్కాలికంగా పక్కన పెట్టారు.
రష్యాతో సుదీర్ఘ కాలంగా పోరాటం చేస్తున్న ఉక్రెయిన్ సేనలకు ఈ తరహా పోరాట AH-64 అపాచీ హెలికాప్టర్లను ఎందుకు సరఫరా చేయలేదని ఆన్‌లైన్ వేదికగా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే 2028 వరకు AH-64E హెలీకాప్టర్ల నిరంతర ఉత్పత్తి కోసం ప్రణాళికలు ఉన్నట్లు తెలుస్తోంది.

హమాస్ మిలిటెంట్లు దాడిచేసిన రెండో రోజు నుంచే గ్లాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ ముమ్మర దాడులు చేస్తోంది. ఆ ప్రాంతానికి ఆహారం, నీరు, విద్యుత్, ఇంధన సరఫరాలను నిలిపేసింది. దీంతోపాటు గాజా సరిహద్దులను మూసివేసింది. దీంతో గాజాలో చాలా ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. దీనిపై స్థానికులు తీవ్ర ఆందోళన నెలకొంది. ఏ క్షణం ఏం జరుగుతుందో అనే భయం అక్కడి ప్రజల్లో నెలకొంది.


Click it and Unblock the Notifications








