2015లో స్కైకార్ సేవలు ప్రారంభం..
ఈ ఫొటోలను చూశారా.. ఇదేదో హాలీవుడ్ సినిమాల్లో గ్రాఫిక్స్ మాయాజాలం మాదిరిగా అనిపిస్తుంది కదూ..! కానీ ఇది అతి త్వరలోనే నిజం కానుంది. గాలిలో రయ్యిమని దూసుకుపోతూ కనిపించే ఈ విశిష్టమైన వాహనాలను స్కై కార్స్ లేదా హోవర్ కార్స్ అని పిలుస్తారు. స్కైట్రాన్ అనే సంస్థ వీటిని డిజైన్ చేస్తోంది.
మోనో రైల్ (సింగిల్ ట్రాక్‌పై వెళ్లే రైలు), కేబుల్ కార్ కాన్సెప్ట్‌ల ఆధారంగా వీటిని డిజైన్ చేశారు. కాలిఫోర్నియాకు చెందిన స్కైట్రాన్ సంస్థ ఈ స్కైకార్లను వచ్చే ఏడాదిలో వీటిని అందుబాటులోకి తీసుకురానుంది. ఇజ్రాయెల్‌లోని ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ క్యాంపస్‌లో ఈ మాగ్నటిక్ స్కైకార్ల వ్యవస్థను నిర్మించనున్నారు.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

తర్వాతి స్లైడ్‌లలో మరింత సమాచారాన్ని పరిశీలించండి.

భవిష్యత్ ప్రజారవాణా వ్యవస్థలో సరికొత్త విప్లవానికి తెర లేపనున్న ఈ స్కైకార్ మాగ్నటిక్ ట్రాక్స్ ఆధారంగా నడుస్తాయి.

మాగ్నటిక్ లెవిటేషన్ అనే టెక్నాలజీని ఉపయోగించి ఈ వ్యవస్థను రూపొందించారు. ప్రస్తుతం జపాన్‌లో బుల్లెట్ రైళ్లకు ఇదే పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు.

స్కైకార్ ప్రాజెక్ట్ చూడటానికి కేబుల్ కార్ ప్రాజెక్ట్ మాదిరిగా అనిపిస్తుంది. అయితే, ఇక్కడ కేబుల్స్‌కు బదులుగా ధృడమైన మాగ్నిటిక్ ట్రాక్స్ ఉపయోగిస్తారు.

భూమిపై నుంచి ఎత్తులో ఈ స్కై ట్రాక్స్‌ను నిర్మిస్తారు. ఈ స్కై కార్లను యాక్సిస్ చేసుకునేందుకు వీలుగా అక్కడక్కగా బోర్డింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తారు.

స్కైకార్‌లో ఇద్దరికి మాత్రమే చోటు ఉంటుంది. ఇందులో డ్రైవర్ ఉండడు. విర్చ్యువల్ కంప్యూటర్ సాయంతో ఇది నడుస్తుంది.

స్కైకార్‌లో ఎక్కి కూర్చున్న తర్వాత మనం చేరాల్సిన గమ్యాన్ని ఎంచుకుంటే సరిపోతుంది, ఆటోమేటిక్‌గా అది గమ్యానికి చేర్చుతుంది.

స్కైకార్‌ను మనం ముందుగా బుక్ చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్‌లో ఓ అప్లికేషన్ సాయంతో స్కైకార్‌ను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలో బుక్ చేసుకొని, సమయాన్ని సెలక్ట్ చేసుకొని, ఫోన్ ద్వారానే టికెట్ ధరను చెల్లించే వెసలుబాటు ఉంటుంది.

స్కైకార్లు గంటకు 70 కిలోమీటర్ల వేగంతో వెళ్తాయి. భవిష్యత్తులో వీటి వేగాన్ని గంటకు 240 కిలోమీటర్లకు పెంచుతామని స్కైట్రాన్ కంపెనీ చెబుతోంది.

ట్రాఫిక్ సమస్యలకు ఇది చక్కని పరిష్కారమని, స్కైకార్లు విజయవంతమైతే ఇజ్రాయెల్‌లోని టెల్ అవివ్ నగరమంతా వీటిని ఏర్పాటు చేస్తామని స్కైట్రాన్ చెబుతోంది.

బాగుంది కదూ.. ఈ స్కైకార్ టెక్నాలజీ. మన దేశంలో కూడా ఇలాంటి అధునాతన రవాణా వ్యవస్థ అందుబాటులోకి వస్తే ఎంత బాగుంటుందో కదా..!
వీడియో
స్కైకార్ పనితీరును చూపించే వీడియోని ఈ స్లైడ్‌లో వీక్షించండి.


Click it and Unblock the Notifications








