ఇస్రో మరో కీలక ముందడుగు.. సక్సెస్‌ఫుల్‌గా సెమీ క్రయోజనిక్ ఇంజిన్ టెస్ట్.. ప్రయోజనాలివే.!!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) తన పరిశోధనలో భాగంగా కీలక అడుగు ముందుకు వేసింది. లిక్విడ్ ఆక్సిజన్ కిరోసిన్ ఆధారంగా పనిచేసే సెమీ క్రయోజెనిక్ ఇంజిన్‌ను అభివృద్ధి చేసింది. ఈమేరకు ఇస్రో సోమవారం ప్రకటించింది. దీనిని 2,000 కెఎన్ (కిలో న్యూటన్ ) చోదక సెమీక్రయోజెనిక్ ఇంజిన్‌గా ఇస్రో తెలిపింది. ఈ పరిశోధన పూర్తి వివరాలు ఈ కథనంలో..

ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూసేలా ఇస్రో కీలక ప్రయోగాలు చేపడుతోంది. చంద్రయాన్- 3, ఆదిత్య -L1 మిషన్ల విజయవంతంతో అంతరిక్ష రంగంలో కొత్త ఒరవడిని సృష్టిస్తున్న ఇస్రో.. త్వరలో గగన్‌యాన్ ప్రాజెక్టుతో మరో అద్భుతమైన విజయాన్ని చేజిక్కించుకునేందుకు యత్నిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల ఇస్రో చేపట్టిన కీలక ప్రాజెక్టులో అభివృద్ధి దిశగా పనిచేస్తోంది.

ISRO-Semi-Cryogenic-Test-Successful

ఎల్‌వీఎం3(LVM3) రాకెట్ పేలోడ్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి మరియు భవిష్యత్తులో ప్రయోగ వాహనాల కోసం లిక్విడ్ ఆక్సిజన్ (LOX) కిరోసిన్ ప్రొపెల్లెంట్ కాంబినేషన్‌పై ఇస్రో పనిచేస్తోంది. ఇందుకోసం 2,000 కెఎన్ థ్రస్ట్ సెమీ క్రయోజెనిక్ ఇంజిన్‌ను అభివృద్ధి చేస్తున్న ఇస్రో కీలక మైలురాయిని సాధించింది.

తమిళనాడు మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్(IPRC) సెమీ క్రయోజనిక్ ప్రీ బర్నర్ ఇగ్నిషన్‌ టెస్టును విజయవంతంగా నిర్వహించినట్లు సోమవారం వెల్లడించింది. దీని తర్వాత ఇంజిన్ పవర్‌హెడ్ టెస్ట్ ఆర్టికల్ మరియు పూర్తిగా ఇంటిగ్రేటెడ్ ఇంజిన్‌పై డెవలప్‌మెంట్ పరీక్షలు ఉంటాయని ఇస్రో పేర్కొంది. 120-టన్నుల ప్రొపెల్లెంట్ లోడింగ్‌తో కూడిన సెమీ-క్రియో స్టేజ్ అభివృద్ధి కూడా పురోగతిలో ఉందని వెల్లడించింది.

ISRO-Semi-Cryogenic-Test-Successful

ఈ సెమీ క్రయోజనిక్ ఇంజిన్‌ను ఇస్రోకు చెందిన లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (LPSC) కేంద్రంగా అభివృద్ధి చేశారు. ఈ క్రయోజనిక్ ఇంజిన్ లిక్విడ్ ఆక్సిజన్(LOX), శుద్ధి చేయబడిన కిరోసిన్(ఇస్రోసేన్) ప్రొపెల్లెంట్ కాంబినేషన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ ద్వారా ఫ్యూచర్ జనరేషన్ లాంచ్ వెహికల్స్‌తో పాటు తదుపరి ప్రయోగ వాహనాలకు కూడా భారీ పేలోడ్స్ లిఫ్టింగ్ సామర్థ్యాన్ని అందిస్తుంది.

సెమీ క్రయోజనిక్ ఇంజిన్ అభివృద్ధిలో భాగంగా మే 2న మొదటి ఇగ్నిషన్ ట్రయల్ విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో తెలిపింది. దీనిని ఇటీవల ప్రధాని మోదీ దేశానికి అంకితం చేశారని వెల్లడించింది. ఈ లిక్విడ్ రాకెట్ ఇంజిన్ వ్యవస్థల అభివృద్ధిలో ఈ ఇగ్నిషన్ ప్రక్రియ అత్యంత కీలకమైనదని ఇస్రో స్పష్టం చేసింది. ఈ సెమీ క్రయోజనిక్ ఇంజిన్ ప్రారంభానికి ముందు ప్రీ బర్నర్ ఇగ్నిషన్ టెస్టును విజయవంతంగా నిర్వహించారు.

ISRO-Semi-Cryogenic-Test-Successful

విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) అభివృద్ధి చేసిన ట్రైథైల్ అల్మ్‌నైడ్ మరియు ట్రైథైల్ బోరాన్ కాంబినేషన్ ద్వారా స్టార్ట్ ఫ్యూయల్ యాంపుల్‌ని ఉపయోగించి సెమీ క్రయోజెనిక్ ఇంజన్ ఇగ్నిషన్‌ను సాధించబడినట్లు ఇస్రో తెలిపింది. అంతేకాకుండా ఇస్రోలో మొదటిసారిగా 2,000 kN సెమీ క్రయోజెనిక్ ఇంజిన్‌లో ఉపయోగించినట్లు వెల్లడించింది.

ISRO-Semi-Cryogenic-Test-Successful

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, May 8, 2024, 12:27 [IST]
English summary
Isro achieves milestone in semi cryogenic engine development by pre burner ignition test
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+